AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Income Tax: నెలకు రూ.50 వేల కంటే తక్కువ ఆదాయంపై ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలా?

ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ రోజు దగ్గర పడుతోంది. పన్ను శ్లాబ్‌ పరిధిలోకి వచ్చినా ఇంకా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ దాఖలు చేయని వారు సకాలంలో దాఖలు చేయవచ్చు. అయితే, పన్ను శ్లాబ్ వెలుపల ఆదాయం ఉన్నవారు రిటర్న్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. కానీ, ఆదాయపు పన్ను చెల్లించడానికి ఎంత ఆదాయం అవసరం ఉండాలనే గందరగోళం ఉంటుంది. 7 లక్షల రూపాయల..

Income Tax: నెలకు రూ.50 వేల కంటే తక్కువ ఆదాయంపై ఐటీఆర్‌ ఫైల్‌ చేయాలా?
Income Tax
Subhash Goud
|

Updated on: Jun 20, 2024 | 3:03 PM

Share

ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ రోజు దగ్గర పడుతోంది. పన్ను శ్లాబ్‌ పరిధిలోకి వచ్చినా ఇంకా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌ దాఖలు చేయని వారు సకాలంలో దాఖలు చేయవచ్చు. అయితే, పన్ను శ్లాబ్ వెలుపల ఆదాయం ఉన్నవారు రిటర్న్ దాఖలు చేయాల్సిన అవసరం లేదు. కానీ, ఆదాయపు పన్ను చెల్లించడానికి ఎంత ఆదాయం అవసరం ఉండాలనే గందరగోళం ఉంటుంది. 7 లక్షల రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్నట్లయితే ఐటీఆర్‌ ఫైల్ చేయాల్సిన అవసరం ఉందా? ఈ ప్రశ్న చాలా మంది మదిలో మెదులుతోంది. పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వ్యక్తులు రూ. 5 లక్షల వార్షిక ఆదాయంపై పన్ను మినహాయింపు పొందుతున్నారు. అయితే, కొత్త పన్ను విధానం ప్రకారం, రూ. 7 లక్షల ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

సమాచారం ప్రకారం.. పాత పన్ను విధానంలో గరిష్టంగా రూ.12,500 పన్ను మినహాయింపు లభిస్తుంది. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపు రూ. 25,000 వరకు ఉంటుంది. ఈ రెండు సందర్భాల్లో మీకు పన్ను బాధ్యత జీరో. కానీ మీరు నిర్దిష్ట పరిస్థితులలో ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయాలి. చాలా సందర్భాలలో పన్ను బాధ్యత లేనట్లయితే పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయవలసిన అవసరం లేదని భావిస్తారు. కానీ అది సరికాదంటున్నారు నిపుణులు.

మీ మొత్తం జీతం పన్ను శ్లాబ్‌లోకి వస్తే, మీరు ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. పాత పన్ను విధానం ప్రకారం.. వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షలకు మించిన 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. 60 నుంచి 80 ఏళ్ల మధ్య వార్షికాదాయం రూ. 3 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు కూడా ఐటీఆర్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది. 5 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు కూడా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాల్సి ఉంటుంది.

మరోవైపు 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ బ్యాంకు డిపాజిట్లు ఉన్న పన్ను చెల్లింపుదారులు కూడా ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో మీ వృత్తిపరమైన ఆదాయం 10 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే, అటువంటి పరిస్థితిలో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం అవసరం. అదే సమయంలో TCS/TDS రూ.25,000 కంటే ఎక్కువ ఉన్న వారికి ఐటీఆర్‌ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు విదేశీ ఆస్తి ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తే మీరు తప్పనిసరిగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను కూడా ఫైల్ చేయాలి. విదేశీ ప్రయాణాలకు రూ.2 లక్షలకు మించి ఖర్చు చేస్తే ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేయాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..