Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalki e-Bike: ప్రభాస్ కల్కి పేరుతో కొత్త ఈ-బైక్.. ఆన్‌లైన్‌లోనే కొనొచ్చు.. పూర్తి వివరాలు..

ఎలక్ట్రిక్ బైక్ లను తయారు చేసే ఈమోటోరాడ్ కంపెనీ కల్కి పేరుతో లిమిటెడ్ ఎడిషన్ కొత్త ఈ బైక్ ను విడుదల చేసింది. దీనికి ఫోల్డ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కల్కి సినిమా నేపథ్యంతో రూపొందించిన డూడుల్ వీ3 బైక్ ఎంతో ఆకట్టుకుంటోంది. అత్యాధునిక సాంకేతికతతో, కల్కి చిత్రం స్ఫూర్తితో ప్రత్యేక, విలక్షణమైన డిజైన్ తో ఈ -బైక్ ను ఈమోటోరాడ్ కంపెనీ తయారు చేసింది.

Kalki e-Bike: ప్రభాస్ కల్కి పేరుతో కొత్త ఈ-బైక్.. ఆన్‌లైన్‌లోనే కొనొచ్చు.. పూర్తి వివరాలు..
Kalki Doodle E Bike
Follow us
Madhu

|

Updated on: Jun 20, 2024 | 3:08 PM

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. పాన్ ఇండియా స్థాయిలో ఆయన ఎంత పాపులరో అందరికీ తెలుసు. తెలుగు సినిమా స్టామినాను అత్యుత్తమ శిఖరాలకు తీసుకువెళ్లిన హీరోలలో ఆయన ఒకరు. ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. దీని కోసం దేశ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదలకు ముందే ఈ చిత్రం అనేక రికార్డులను నమోదు చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంతో ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కల్కి సినిమా కథ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. అద్భుతమైన విజువల్స్‌ తో పాటు రెబల్ స్టార్ ప్రభాస్ యాక్షన్ ప్రత్యేక అందాన్ని తీసుకువస్తుందన్నారు. పురాణ కథనం, ఆకట్టుకునే సినిమాటోగ్రఫీతో ప్రేక్షకులకు ఆకట్టుకుంటుదని సమాచాారం.

కల్కి ప్రేరణతో డూడుల్ వీ3 బైక్..

ఎలక్ట్రిక్ బైక్ లను తయారు చేసే ఈమోటోరాడ్ కంపెనీ కల్కి పేరుతో లిమిటెడ్ ఎడిషన్ కొత్త ఈ బైక్ ను విడుదల చేసింది. దీనికి ఫోల్డ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కల్కి సినిమా నేపథ్యంతో రూపొందించిన డూడుల్ వీ3 బైక్ ఎంతో ఆకట్టుకుంటోంది. అత్యాధునిక సాంకేతికతతో, కల్కి చిత్రం స్ఫూర్తితో ప్రత్యేక, విలక్షణమైన డిజైన్ తో ఈ -బైక్ ను ఈమోటోరాడ్ కంపెనీ తయారు చేసింది. ఆ కంపెనీ వెబ్ సైట్ లో ఈ-బైక్ అందుబాటులో ఉంది.

ప్రత్యేక డిజైన్..

కల్కి లిమిటెడ్ డూడుల్ ప్రత్యేక డిజైన్ తో ఆకట్టుకుంటోంది. ఆ సినిమా ప్రేరణతో ఈ-బైక్ ను రూపొందించారు. ప్రత్యేక గ్రాఫిక్స్, కలర్ స్కీములతో చాలా అందంగా కనిపిస్తుంది.

ఫోల్డబుల్ ఫ్రేమ్..

ఈ-బైక్ ను సులభంగా మడత పెట్టవచ్చు. అలాగే ఎక్కడికైనా ఈజీ గా తీసుకువెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా పట్టణాలలో నివసించే వారికి, సైక్లింగ్ చేయాలనుకునే వారికి చక్కగా సరిపోతుంది.

టైర్లు..

అన్ని రకాల నేలలపై సులభంగా తిరిగే, నాణ్యమైన టైర్లు ఏర్పాటు చేశారు. స్థిరమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి.

స్పీడ్, రేంజ్..

కల్కి ఈ-బైక్ వేగం గంటకు 25 కిలోమీటర్లు. ఒక్కసారి రీచార్జి చేస్తే దాదాపు 60 కిలోమీటర్లు ప్రయాణం సాగించవచ్చు.

మోడ్‌లు..

కొత్త ఈ-బైక్ లో ఐదు రకాల రైడింగ్ మోడ్ లు ఉన్నాయి. రైడర్లకు సాధారణ సైకిళ్ల కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. అయితే ఇవి పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఖాతాదారుల సౌకర్యం కోసం..

ఈమోటోరాడ్ సీఈవో కునాల్ గుప్తా మాట్లాడుతూ పరిమిత ఎడిషన్ డూడుల్ వీ3 బైక్‌ను పరిచయం చేయడానికి ప్రభాస్ తాజా చిత్రం కల్కితో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు. తమ కొత్త ఆవిష్కరణపై ఆనందం వ్యక్తం చేశారు. ఖాతాదారుల లైఫ్ స్టైల్, వారి ఆసక్తికి అనుగుణంగా ఈ-బైక్ రూపొందించినట్టు తెలిపారు. కల్కి నేపథ్యంతో విడుదల చేసిన డూడుల్ వీ3 బైక్ ను రూ.2,898 చెల్లించి ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ ఆకును ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో తినండి.. ఆరోగ్యంలో అద్భుతాలు
ఈ ఆకును ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో తినండి.. ఆరోగ్యంలో అద్భుతాలు
వీడెవడ్రా ఇట్లా ఉన్నాడు.. మహిళలను వేధిస్తూ సంతోషపడే మృగాడు..
వీడెవడ్రా ఇట్లా ఉన్నాడు.. మహిళలను వేధిస్తూ సంతోషపడే మృగాడు..
కాశ్మీర్‌పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు
కాశ్మీర్‌పై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కీలక వ్యాఖ్యలు
24 సిక్సర్లతో క్రికెట్ ప్రపంచానికి మెంటలెక్కించిన యంగ్ ప్లేయర్
24 సిక్సర్లతో క్రికెట్ ప్రపంచానికి మెంటలెక్కించిన యంగ్ ప్లేయర్
డీలర్ల వద్దకు చేరుతున్న ఓలా బైక్స్.. త్వరలోనే డెలివరీలు షురూ
డీలర్ల వద్దకు చేరుతున్న ఓలా బైక్స్.. త్వరలోనే డెలివరీలు షురూ
రికార్డు బ్రేక్ చేసిన రియాన్! బ్యాట్‌తో కాదు బాస్.. ఫీల్డింగ్‌తో
రికార్డు బ్రేక్ చేసిన రియాన్! బ్యాట్‌తో కాదు బాస్.. ఫీల్డింగ్‌తో
ఐఫోన్లు అమెరికాలో కాకుండా చైనాలో ఎందుకు తయారవుతాయి?
ఐఫోన్లు అమెరికాలో కాకుండా చైనాలో ఎందుకు తయారవుతాయి?
9 కోట్ల DC పెట్టుబడి కి JFM ప్లాప్ షో!
9 కోట్ల DC పెట్టుబడి కి JFM ప్లాప్ షో!
అటు చీరకట్టులో క్లాస్.. ఇటు మోడ్రన్ డ్రస్సులో మాస్
అటు చీరకట్టులో క్లాస్.. ఇటు మోడ్రన్ డ్రస్సులో మాస్
12 ఏళ్లకే గిన్నిస్‌ రికార్డ్.. బాపట్ల బుడ్డోడి ట్యాలెంట్‌ చూడండి!
12 ఏళ్లకే గిన్నిస్‌ రికార్డ్.. బాపట్ల బుడ్డోడి ట్యాలెంట్‌ చూడండి!