PM Modi – Jhunjhunwala: కోట్లకు అధిపతి.. ప్రధానితో భేటీలో నలిగిన చొక్కతో బిగ్ బుల్ ఝున్‌ఝున్‌వాలా..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రముఖ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలాను కలిశారు. ఆయనతోపాటు కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంపాటు ఓ ఆసక్తికర కామెంట్‌ను ప్రధాని జోడించారు.

“నేను ఓ చురుకైన వ్యక్తిని కలిశాను.. అంతర్ధృష్టి ఉన్న వ్యక్తితో మాట్లాడాను” అంటూ ప్రధాని మోడీ పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రముఖ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారుడు రాకేష్ ఝున్‌ఝున్‌వాలాను కలిశారు. వారితో సమావేశ అనంతరం సింప్లిసిటీకి, స్టాక్ మార్కెట్‌లో సంచలనాలకు కేరాఫ్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా గురించి ఓ ట్వీట్ చేశారు ప్రధాని మోడీ. వారితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేయడంపాటు ఓ ఆసక్తికర కామెంట్‌ను ప్రధాని జోడించారు. ‘అంతర్దృష్టి ఉన్న వ్యక్తిని, అత్యంత చురుకైన వ్యక్తిని కలిశానంటూ’ తన ట్విటర్‌లో పేర్కొన్నారు.
దేశ ప్రధాని మోడీ, ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాను కలిశారు. భారత ఆర్థిక వ్యవస్థలో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతున్న బిగ్ బుల్‌ను కలవడం సంతోషంగా ఉందని చెప్పారు ప్రధాని మోడీ. రాకేష్‌తో పాటు ఆయన సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా సైతం ఆ ఫొటోలో కనిపించారు. భారత షేర్ మార్కెట్ బిగ్ బుల్‌గా పిలుచుకునే ఝున్‌ఝున్‌వాలా నలిగిన చొక్కాతో చాలా సాదాసీదాగా కనిపించారు. ఇక ఝున్‌ఝున్‌వాలా కుర్చీలో కూర్చోగా.. తనకంటే వయసులో చిన్నవాడైనప్పటికీ ఎదురుగా వినయంగా చేతులు కట్టుకుని ఉన్న మోదీ ఫొటో మరొకటి ట్విటర్‌లో షేర్ అయ్యాయి.

Rakesh Jhunjhunwala With Pm
మనీ మార్కెట్‌లో ఆయన ఏది మాట్లాడినా బిగ్ న్యూస్.. ఆయన ప్రతీ కదలికను ఫైనాన్సియల్ మార్కెట్ గమనిస్టుంటాయి. ‘‘ఇంట్లో తిండి దొరుకుతుంటే బయట తినడం ఎందుకు.. భారత్‌ను నమ్మండి. పెట్టుబడులు పెట్టండి’’ అంటూ జూన్ నెలలో ఝున్‌ఝున్‌వాలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇన్వెస్టర్లకు ఝున్‌ఝున్‌వాలా పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఆయన్ని అభినందించారు.
ఝున్‌ఝున్‌వాలతోపాటు మరికొందరు ప్రముఖ వ్యాపారవేత్తలతో కూడా ప్రధాని మోడీ సమావేశమైనట్లుగా తెలుస్తోంది. QS క్వాక్వారెల్లి సైమండ్స్ లిమిటెడ్ CEO, మేనేజింగ్ డైరెక్టర్ నుంజియో క్వాక్వారెల్లితో కూడా ప్రధాన మంత్రి సమావేశం అయ్యారు. విద్యా రంగానికి సంబంధించిన అంశాల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.ఐఐఎఫ్‌ఎల్ వెల్త్ ఇండియా రిచ్ జాబితాలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అండ్ ఫ్యామిలీ ఆస్తుల విలువ 22,300 కోట్ల రూపాయలుగా ఉంది.
Delighted to meet the one and only Rakesh Jhunjhunwala…lively, insightful and very bullish on India. pic.twitter.com/7XIINcT2Re
— Narendra Modi (@narendramodi) October 5, 2021
ఇవి కూడా చదవండి: Powerball Winner: ఒకే ఒక్కడు విజేత.. ఐదువేలు కోట్ల లాటరీ గెలిచాడు.. రాత్రికి రాత్రి కుబేరుడయ్యాడు..
Cheddi Gang: తిరుపతివాసుల్లో వణుకుపుట్టిస్తున్న చెడ్డీ గ్యాంగ్.. ఛాలెంజింగ్‌గా తీసుకున్న పోలీసులు..