AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM-SYM Scheme: నెలకు రూ. 15 వేల లోపు ఆదాయం గల వారి కోసం కేంద్రం పెన్షన్ పథకం.. ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే

PM-SYM Scheme: నెలసరి తక్కువ ఆదాయంతో ఉన్న ఆ సంఘటిత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో..

PM-SYM Scheme: నెలకు రూ. 15 వేల లోపు ఆదాయం గల వారి కోసం కేంద్రం పెన్షన్ పథకం.. ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే
Pm Sym Scheme
Surya Kala
| Edited By: Anil kumar poka|

Updated on: Sep 06, 2021 | 9:36 PM

Share

PM-SYM Scheme: నెలసరి తక్కువ ఆదాయంతో ఉన్న ఆ సంఘటిత కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లో పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ పథకం లబ్ధిదారులకు నెలసరి ఆదాయం రూ.15 వేలు మాత్రమే ఉండాలి.

ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన పథకంలో అసంఘటిత కార్మికులు అంటే ఇళ్లలో పని చేసేవారు, కూలీ పనులు చేసే వారు, భవన నిర్మాణ కార్మికులు, రోజు వారీ వేతనం తీసుకునే తదితరులందరూ లబ్ధిదారులే. ఈ స్కీంలో ఉన్న సభ్యుడు అనివార్య కారణాల వలన మరణిస్తే భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. ఎప్పుడైనా కావాలంటే ఈ పథకం నుంచి బయటకు రావాలంటే ఉపసంహరించుకోవచ్చు. ఇక ఈ పథకం లో రిజిస్టర్ కావడానికి లబ్ధిదారులకు 40 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. ఇలా రిజిస్టర్ అయిన వీరికి 60 ఏళ్లు పూర్తి అయిన తరువాత నెలకు 3 వేల రూపాయల పింఛను ఇస్తారు. ఈ పథకంలో చేరాలంటే కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 18 ఏళ్ళు పైబడిన వారు నెలకి రూ.55లు ప్రీమియం కట్టాలి. 29 ఏళ్ల వయసు పైబడిన వారు రూ.100 లు కట్టాలి. 40 ఏళ్ల పైబడిన వారు నెలకు రూ.200లు కట్టాలి. ఈ పథకంలో చేరిన కార్మికులు డిపాజిట్ చేసిన మొత్తం డబ్బును ప్రభుత్వం వారి పేరుతోనే జమ చేస్తుంది.

కావాల్సినవి

ఈ పథకంలో చేరాలనుకునే ఏ వ్యక్తి అయినా ఆధార్ కార్డు, బ్యాంకులో ఖాతా తెరిచి ఉండాలి. ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్ యోజన పథకానికి సంబంధిన మరింత సమాచారం కోసం 1800 2676 888 టోల్ ఫ్రీకి కాల్ చేసి తెలుసుకోవచ్చు.

Also Read:  తాలిబన్లు శిక్షించినా.. సంబరాలు చేసుకున్న మారణకాండ తప్పదా.. తుపాకీతో సంబరాలు..17మంది చిన్నారులు మృతి

ట్రై యాంగిల్‌ లవ్‌స్టోరీ.. వివాహానికి లాటరీ పద్దతిలో యువతి ఎంపిక.. చివరకు..

టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా…?

ఓవైపు వ్యాపారం.. మరోవైపు సినిమాలతో దూసుకుపోతున్న ఈ అందాల తార ఎవరో గుర్తుపట్టారా.?