Govt Scheme: బడ్జెట్‌కు ముందు కేంద్రం ఈ పథకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలుసా?

2025 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అన్ని చిన్న పొదుపు పథకాలపై వడ్డీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. గత త్రైమాసికంలో ఈ ప్రభుత్వ పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఈసారి కూడా జూలై నుండి సెప్టెంబర్ త్రైమాసికంలో పీపీఎఫ్‌, ఎస్‌సీఎస్‌ఎస్‌, సుకన్య సమృద్ధి పథకం వడ్డీ రేట్లలో..

Govt Scheme: బడ్జెట్‌కు ముందు కేంద్రం ఈ పథకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుందో తెలుసా?
Govt Scheme
Follow us

|

Updated on: Jun 30, 2024 | 3:56 PM

2025 ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అన్ని చిన్న పొదుపు పథకాలపై వడ్డీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. గత త్రైమాసికంలో ఈ ప్రభుత్వ పథకాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. ఈసారి కూడా జూలై నుండి సెప్టెంబర్ త్రైమాసికంలో పీపీఎఫ్‌, ఎస్‌సీఎస్‌ఎస్‌, సుకన్య సమృద్ధి పథకం వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు.

ఇది కూడా చదవండి:Bank Account: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. ఈరోజే చివరి గడువు.. ఈ పని చేయకుంటే అకౌంట్‌ నిలిపివేత

కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి చిన్న పొదుపు పథకాల కింద వడ్డీకి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటుంది. దీని కింద ఈసారి చిన్న పొదుపు పథకాలపై వడ్డీని యథాతథంగా ఉంచారు. 2024-25 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికానికి సంబంధించి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు జూలై 1, 2024 నుండి ప్రారంభమై సెప్టెంబర్ 30, 2024న ముగియనున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Petrol Diesel Price: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించిన ఆ ప్రభుత్వం

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY), మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) అనేవి త్రైమాసికానికి ఒకసారి ఈ పథకాలపై వడ్డీ నిర్ణయించబడతాయి. ఈ పథకాలకు సంబంధించిన వడ్డీకి సంబంధించి ప్రతి మూడు నెలలకోసారి నిర్ణయం తీసుకుంటుంది కేంద్రం.

చివరి మార్పు ఎప్పుడు జరిగింది?

FY24 జనవరి-మార్చి త్రైమాసికానికి డిసెంబర్ 2023లో వడ్డీ రేట్లలో చివరి సవరణ జరిగింది. మునుపటి మార్పులో సుకన్య సమృద్ధి యోజన, 3 సంవత్సరాల కాల డిపాజిట్లు వంటి కొన్ని చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను Q4 FY24 కోసం 20bps వరకు కేంద్రం పెంచింది. 3 సంవత్సరాలకు పైగా పీపీఎఫ్‌ రేట్లు మారలేదు. ఇది చివరిగా ఏప్రిల్-జూన్ 2020లో మార్చబడింది. ఇది 7.9 శాతం నుండి 7.1 శాతానికి తగ్గించింది.

పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాపై వడ్డీ :

పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాకు వడ్డీ రేటు సంవత్సరానికి 4 శాతంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు 8.2 శాతం కాగా, సుకన్య సమృద్ధి ఖాతా వడ్డీ రేటు వచ్చే త్రైమాసికానికి 8.2 శాతంగా ఉంటుంది.

ఏడాది కాల డిపాజిట్‌పై 6.9%, రెండేళ్ల టీడీపై 7.0%, మూడేళ్ల టీడీపై 7.1%, ఐదేళ్ల టీడీపై 7.5% వడ్డీ ఇస్తారు. ఇది కాకుండా, ఆర్‌డిపై 6.7% వడ్డీ, నెలవారీ ఆదాయ పథకం కింద 7.4% వడ్డీ, ఎన్‌ఎస్‌సి కింద 7.7% వడ్డీ, కిసాన్ వికాస్ పత్ర కింద 7.5% వడ్డీ ఇస్తారు.

ఇది కూడా చదవండి: New Rules: ఇక రూల్స్‌ మరింత కఠినతరం.. జూలై 1 నుంచి అమలు కానున్న కొత్త నిబంధనలు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బైడెన్ పేలవ ప్రదర్శన.. అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్‌
బైడెన్ పేలవ ప్రదర్శన.. అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్‌
తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు.. పేర్కొన్న అంశాలి
తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు.. పేర్కొన్న అంశాలి
'రో-కో' తదుపరి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ ఆడతారంటే?
'రో-కో' తదుపరి మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ ఆడతారంటే?
జగన్నాథుడుకి నైవేద్యం తర్వాత వేప పొడిని ఎందుకు ఇస్తారంటే
జగన్నాథుడుకి నైవేద్యం తర్వాత వేప పొడిని ఎందుకు ఇస్తారంటే
Horoscope Today: వారికి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం..
Horoscope Today: వారికి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం..
భగవద్గీత శ్లోకాన్నిషేర్ చేసిన షోయబ్ అక్తర్..పాక్ ఫ్యాన్స్ గగ్లోలు
భగవద్గీత శ్లోకాన్నిషేర్ చేసిన షోయబ్ అక్తర్..పాక్ ఫ్యాన్స్ గగ్లోలు
సచిన్ వీరాభిమానికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన రోహిత్ శర్మ
సచిన్ వీరాభిమానికి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన రోహిత్ శర్మ
వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..
వివో నుంచి అదిరిపోయే ట్యాబ్‌.. ఫీచర్స్‌ మాములుగా లేవు..
ఆహాలో పార్వతీశం మార్కెట్ మహాలక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆహాలో పార్వతీశం మార్కెట్ మహాలక్ష్మి.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
మల్టీస్టారర్‌లకు బూస్టప్ ఇచ్చిన నాగ్ అశ్విన్..
మల్టీస్టారర్‌లకు బూస్టప్ ఇచ్చిన నాగ్ అశ్విన్..