AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nissan X-Trail SUV: త్వరలో మార్కెట్‌లోకి మరో సూపర్ కార్.. నిస్సాన్ నుంచి కొత్త ఎస్‌యూవీ..

నిస్సాన్ మోటార్ ఇండియా కంపెనీ తన నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్ యూవీని టీజ్ చేసింది. అయితే దాదాపు రెండేళ్ల క్రితమే దీనిని కంపెనీ పరిచయం చేసింది. 2022 నవంబర్ లోనే ఎక్స్ ట్రైల్ ను ప్రదర్శించింది. చివరకు దేశ మార్కెట్ లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీని ధర రూ.40 లక్షల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Nissan X-Trail SUV: త్వరలో మార్కెట్‌లోకి మరో సూపర్ కార్.. నిస్సాన్ నుంచి కొత్త ఎస్‌యూవీ..
Nissan X Trail Suv
Madhu
|

Updated on: Jun 30, 2024 | 4:08 PM

Share

దేశంలోని రహదారులపై మరో అత్యాధునిక కారు పరుగులు పెట్టనుంది. లేటెస్ట్ ఫీచర్లతో ప్రముఖ బ్రాండ్ కారు త్వరలో విడుదల కానుంది. నిస్సాన్ ఆటోమొబైల్ సంస్థ తన నిస్సాన్ ఎక్స్ ట్రైల్ ఎస్ యూవీని ఆవిష్కరించడానికి సన్నాహాలు చేసింది. జీప్ మెరిడియన్, టయోటా ఫార్చ్యూనర్, ఎంపీ గ్లోస్టర్, స్కోడా కొడియాక్, వీడబ్ల్యూ టిగువాన్‌లతో ఈ కారు పోటీపడుతుందని భావిస్తున్నారు. నిస్సాన్ ఎక్స్ ట్రైల్ ప్రత్యేకతలు, ధర, ఇతర వివరాలను తెలుసుకుందాం.

త్వరలో దేశంలోకి..

నిస్సాన్, రెనాల్డ్ సంయుక్తంగా ఎక్స్ ట్రైల్ ఎస్ యూవీని అభివృద్ధి చేశాయి. ఇది సీఎంఎఫ్-సి ప్లాట్ ఫాంపై ఆధారపడి పనిచేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా బలమైన హైబ్రిడ్‌తో సహా బహుళ పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందించనున్నాయి. అయితే మన దేశంలో సింగిల్ ఇంజిన్ ఆప్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

మార్కెట్లో గట్టిపోటీ..

నిస్సాన్ మోటార్ ఇండియా కంపెనీ తన నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఎస్ యూవీని టీజ్ చేసింది. అయితే దాదాపు రెండేళ్ల క్రితమే దీనిని కంపెనీ పరిచయం చేసింది. 2022 నవంబర్ లోనే ఎక్స్ ట్రైల్ ను ప్రదర్శించింది. చివరకు దేశ మార్కెట్ లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. దీని ధర రూ.40 లక్షల కంటే ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో ఈ కారును ప్రదర్శనకు ఉంచినప్పుడు మార్కెట్ నిపుణులు అనేక అంచనాలు వేశారు. జీప్ మెరిడియన్, టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్, స్కోడా కొడియాక్, వీడబ్ల్యూ టిగువాన్‌లతో పోటీపడుతుందని భావించారు.

గతంలోనూ..

దేశంలో నిస్సాన్ ఎక్స్ ట్రైల్ కారును విక్రయించడం ఇదే ప్రథమం కాదు. గతంలో ఈ కారు అమ్మకాలు జరిగాయి. తర్వాత ఆ సంస్థ వాటిని ఆపివేసింది. ఇప్పుడు కొత్తగా నిస్సాన్ ఎక్స్ ట్రైల్ ఎస్ యూవీ విక్రయాలు జరగనున్నాయి. కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ ట్రైల్ ఐదు, ఏడు సీట్ల కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులోకి రానుంది. అయితే మన దేశంలో ఎలా రానుందో కచ్చితంగా ఆధారాలు లేవు. ఇది 1.5 లీటర్ మూడు సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తుందని భావిస్తున్నారు.

ప్రత్యేకతలు..

నిస్సార్ ఎక్స్ ట్రైల్ ఎస్ యూవీ కారు పొడవు 4.6 మీటర్లకు పైగా, వీల్ బేస్ 2,705 ఎంఎంగా ఉంటుంది. డిజైన్ పరంగా చాాాలా ఆకట్టుకుంటోంది. పెద్ద గ్రిల్‌తో స్ప్లిట్ ఎల్ ఈడీ హెడ్‌లైట్ సెటప్‌, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్‌, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, డిఫ్యూజర్‌తో కూడిన ఎల్ఈడీ టైల్‌లైట్లు దీని ప్రత్యేకతలు.

ఇతర విషయాలు..

నిస్సాన్ ఎక్స్ టైల్ కారులో ఇంకా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే/ ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన ఫ్రీ స్టాండింగ్ 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పవర్డ్ టెయిల్‌గేట్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన హీటెడ్ పవర్డ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. స్పీకర్ ప్రీమియం బోస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, హెచ్ యూడీ డిస్‌ప్లే, అడాస్, 360 డిగ్రీల కెమెరా తదితర వాటిని ఏర్పాటు చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us