AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PPF అకౌంట్15 సంవత్సరాల పీరియడ్.. కానీ మరో ఐదేళ్లు పెంచితే అధిక లాభం..!

PPF Account: ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (ppf) హామీతో కూడిని ప్రభుత్వ పథకం. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్(fixed deposit) వ‌డ్డీ రేటు క‌న్నా ఇందులో అధికంగానే వ‌డ్డీని ఆశించ‌వ‌చ్చు.

PPF అకౌంట్15 సంవత్సరాల పీరియడ్.. కానీ మరో ఐదేళ్లు పెంచితే అధిక లాభం..!
Money
uppula Raju
|

Updated on: Mar 20, 2022 | 5:59 AM

Share

PPF Account: ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (ppf) హామీతో కూడిని ప్రభుత్వ పథకం. బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్(fixed deposit) వ‌డ్డీ రేటు క‌న్నా ఇందులో అధికంగానే వ‌డ్డీని ఆశించ‌వ‌చ్చు. పీపీఎఫ్ ఖాతాను ప్రభుత్వ రంగ బ్యాంకులో గానీ, పోస్టాఫీసు(Post Office)లో గానీ తెరవొచ్చు. పీపీఎఫ్ వ‌డ్డీని నెల‌వారీ ప్రాతిప‌దిక‌న లెక్కిస్తారు. పీపీఎఫ్ ఖాతా 100% రిస్క్ లేనిది. ప్రస్తుతం, పీపీఎఫ్ వ‌డ్డీ రేటు 7.10 శాతంగా ఉంది. PPF ఖాతా మెచ్యురిటీ15 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఈ ఖాతా మెచ్యురిటీ అయిన తర్వాత మరో ఐదేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. PPF ఖాతాను మూసివేయడం కంటే దానిని కొనసాగిస్తే బెటర్. ఎందుకంటే మరో ఐదేళ్లు పెంచుకునే అవకాశాన్ని PPF కల్పిస్తోంది. ఖాతాను మూసివేయాలా లేదా కొనసాగించాలా అనేది మీ ఇష్టం. కానీ కొనసాగిస్తే మాత్రం ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. మీకు ఇష్టమైతే ఈ ఖాతాని 5 సంవత్సరాల చొప్పున రెండుసార్లు పొడగించవచ్చు. అయితే మొదటి 5 ఏళ్లు పొడిగించినప్పుడు డబ్బు డిపాజిట్ చేయకూడదు. రెండో ఆప్షన్ అకౌంట్‌ను 5 ఏళ్లు పొడిగించడంతో పాటు అందులో కొంతమొత్తం జమచేయవచ్చు.

ఖాతా పొడిగించడం వల్ల ప్రయోజనాలు

ఇందులో రెండో ఎంపిక గురించి తెలుసుకుందాం. 15 సంవత్సరాల తర్వాత PPF ఖాతాను 5 సంవత్సరాలు పొడిగిస్తే ప్రతి సంవత్సరం మీరు కొంత డబ్బును డిపాజిట్ చేయాలి. మొత్తం ఎంత అనేది మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి సంవత్సరం మీరు రూ.500 డిపాజిట్ చేయాలని నిర్ణయించుకుంటే ఈ విషయాన్ని కచ్చితంగా బ్యాంక్ లేదా పోస్టాఫీసుకు తెలియజేయాలి. సమాచారం లేకుండా ఖాతాలో డబ్బు వేస్తే వడ్డీ ప్రయోజనం లభించదు.

15 సంవత్సరాల PPF ఖాతా పూర్తయిన తర్వాత మీరు 60 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. 15 ఏళ్ల తర్వాత మీ ఖాతాలో రూ.25 లక్షలు జమ అయ్యాయని అనుకుందాం. మీరు ఇందులో 60% అంటే గరిష్టంగా రూ. 15 లక్షల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన రూ. 10 లక్షలను PPFలోనే వదిలేయండి. దానిపై మీరు వడ్డీని పొందడం కొనసాగుతుంది. దీనితో పాటు ప్రతి సంవత్సరం 500 రూపాయలని డిపాజిట్ చేయండి. ఈ మొత్తంపై వడ్డీ లభిస్తుంది.

15 సంవత్సరాల తర్వాత మీకు డబ్బు అవసరం లేనట్లయితే ఖాతాను మరో 5 సంవత్సరాలు పొడిగించుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా పీపీఎఫ్ సొమ్ముపై ఎలాంటి పన్ను ఉండదు. ఈ పథకంలోని ప్రతి పైసా పన్ను రహితం. ఇది మీ పెట్టుబడిని మరింత పెంచుకునే అవకాశాన్ని ఇస్తుంది. మీరు చిన్న వయస్సులోనే PPF తెరిచినట్లయితే 15 సంవత్సరాల తర్వాత, 5 సంవత్సరాలకు పెంచడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.

Telangana: నిరుద్యోగులకి తీపి కబురు.. వయోపరిమితి పెంచుతూ ఉత్తర్వులు జారీ..

Virat Kohli: విరాట్‌ కోహ్లీపై సినిమా తీస్తే టైటిల్‌ ఏంటో తెలుసా..!

CONGRESS PARTY: కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం దిశగా కీలక అడుగు.. జీ23 నేతల సూచనలపై సోనియా స్పందన.. వచ్చేవారం కీలక భేటీ