PM Kisan: మీ అకౌంట్‏లోకి పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు రాలేదా ? అయితే ఇలా ఫిర్యాదు చేయండి… కాల్ లేదా మెయిల్..

PM Kisan Scheme: కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు పీఎం కిసాస్ యోజన పథకం ప్రారంభించిన

PM Kisan: మీ అకౌంట్‏లోకి పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు రాలేదా ? అయితే ఇలా ఫిర్యాదు చేయండి... కాల్ లేదా మెయిల్..
Pm Kisan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 03, 2021 | 6:01 PM

PM Kisan Scheme: కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు ఆర్థిక భరోసా అందించేందుకు పీఎం కిసాస్ యోజన పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా దేశంలోని రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ. 6 వేల వరకు నగదును జమ చేయనుంది కేంద్రం. అయితే ఈ డబ్బు మొత్తం ఒకేసారి కాకుండా.. విడతల వారిగా రైతుల ఖాతాల్లోకి వచ్చి చేరుతుంది. ఇప్పటికే 7 విడతలుగా డబ్బులు అందించిన ఇటీవల 8వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసింది.

అయితే ఈ డబ్బులు కేవలం పీఎం కిసాన్ పథకంలో చేరిన వారికి మాత్రమే వస్తాయి. ఇప్పటికే ఇందులో ఎంతోమంది రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. తాజాగా కేంద్రం 8వ విడత డబ్బులను రైతుల ఖాతాల్లోకి జమ చేయగా.. ఎంతోమంది రైతులు ఈ డబ్బులను అందుకున్నారు. అయితే కొంతమందికి ఈ పీఎం కిసాన్ డబ్బులు తమ ఖాతాల్లో జమకాలేదు. అలాంటివారికి ఎలాంటి భయం అవసరం లేదు. ఒకవేళ మీ అకౌంట్లోకి డబ్బులు రాకపోతే మీరు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు డబ్బులు వస్తాయి. అయితే ఫిర్యాదు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పీఎం కిసాన్ డబ్బులు రానివారు.. 011-24300606 నెంబర్‌కు కాల్ చేసి చెప్పవచ్చు. అలాగే.. ఇంకా పలు హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్లకు కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. 18001155266, 155261, 011-23381092, 011 23382401 వంటి నెంబర్లకు కూడా కాల్ చేయొచ్చు. కేవలం ఫోన్ ద్వారానే కాకుండా.. ఇమెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం మీరు pmkisan-ict@gov.inకు ఇమెయిల్ పంపాలి. ఇక ఇందులో చేరని రైతులు ఇప్పటికీ ఈ పథకంలో చేరి డబ్బులను అందుకోవచ్చు.

Also Read: Sarkaru Vari Pata: మహేష్ మూవీ నుంచి క్రేజీ అప్‏డేట్.. ‘సర్కారు వారి పాట’ షూట్ మొదలయ్యేది అప్పుడే..

Nithiin: మరో ప్రాజెక్ట్‏కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నితిన్.. త్వరలోనే సెట్స్ పైకి కొత్త సినిమా… డైరెక్టర్ ఎవరంటే..