PM Kisan: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఇకపై ఆ డాక్యూమెంట్ ఉండాల్సిందే.. కొత్త రూల్స్ తెలుసుకోండి..

అయితే ఈ పథకంలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు కేంద్రం నియమాలను మార్చింది. కేవలం నిర్దిష్ట వర్గం రైతులకు మాత్రమే ప్రయోజనాలను పొందేలా రూల్స్ తీసుకువచ్చింది ప్రభుత్వం.

PM Kisan: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఇకపై ఆ డాక్యూమెంట్ ఉండాల్సిందే.. కొత్త రూల్స్ తెలుసుకోండి..
Pm Kisan
Follow us

|

Updated on: Jun 30, 2022 | 6:14 PM

దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే (PM Kisan). ఈ స్కీమ్ ద్వారా రైతుల ఖాతాల్లోకి రూ. 6000 నేరుగా జమచేస్తుంది. ఏడాదికి మూడు విడతలుగా ప్రతి విడతలో రూ. 2000 చొప్పున ఈ నగదును అన్నదాతల ఖాతాల్లో జమవుతుంది. ఇప్పటివరకు 11 విడతల నగదును రైతులకు అందించింది కేంద్రం. అయితే ఈ పథకంలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు కేంద్రం నియమాలను మార్చింది. కేవలం నిర్దిష్ట వర్గం రైతులకు మాత్రమే ప్రయోజనాలను పొందేలా రూల్స్ తీసుకువచ్చింది ప్రభుత్వం. ఈ పథకంలో అనేక మోసాలు జరిగినట్లుగా పలు రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందుకుంది కేంద్రం. పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ లో మరిన్ని మోసాలను అరికట్టేందుకు ..ఈ స్కీమ్ ప్రయోజనాలను అసలైన రైతులు అందుకునేందుకు వారు ఇకపై రేషన్ కార్డ్ నంబర్ తప్పనిసరిగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

కొత్త నియమాల ప్రకారం పీఎం కిసాన్ పథకంలో నమోదు చేసుకునేటప్పుడు రైతులందరూ తమ రేషన్ కార్డ్ నంబర్ కూడా సమర్పించాల్సి ఉంటుంది. అంటే పీఎం కిసాన్ పథకంలో నమోదు చేసుకునే ముందు రేషన్ కార్డ్ సాఫ్ట్ కాపీని కూడా అధికారిక పోర్టల్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఈ కేవైసీ అప్డేట్ కూడా తప్పనిసరి. భూమి సమాచారం, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాసు పుస్తకం, తదితర హార్డ్ కాపీలను సమర్పించకుండా ఉన్నవారిని పథకం నుంచి తొలగించింది ప్రభుత్వం. అన్ని పత్రాలను సమర్పించిన తర్వాత అవి ధృవీకరించబడిన తర్వాత మాత్రమే మీరు పీఎం కిసాన్ ప్రయోజనాలను పొందుతారు.

పీఎం కిసాన్ అర్హత ప్రమాణాలు.. సాధారణంగా ప్రభుత్వ పథకానికి నిర్ధిష్ట అర్హత ప్రమాణాలు ఉంటాయి. దాని ఆధారంగా మాత్రమే ప్రయోజనాలు కూడా పొందుతారు. పీఎం కిసాన్ పథకానికి భారతీయ సన్నకారు రైతులు అర్హులు. తమ పేర్లపై సాగు చేయబడే భూమి ఉన్న రైతులు కూడా అర్హులే. ముఖ్యంగా ఈ స్కీమ్ లాభాలు పొందాలంటే కచ్చితంగా పీఎం కిసాన్ ఈ కేవైసీ అప్డేట్ చేయాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

PM కిసాన్- eKYC తప్పనిసరి.. పీఎం కిసాన్ ప్రయోజనాలు పొందడం కోసం అర్హులైన రైతులు eKYCని తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఓటీపీ ఆధారిత eKYC PM-KISAN పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. eKYC అప్డేట్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. ఈకేవైసీ అప్డేట్ చేయనివారికి పీఎం కిసాన్ డబ్బులు రావు.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు