AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ కీలక అంశాల గురించి తప్పక తెలుసుకోండి

Personal Loan: పర్సనల్ లోన్ మంజూరు చేసే సమయంతో పాటు రుణాలను తిరిగి చెల్లించే సమయంలో బ్యాంకులు 6 రకాల ఫీజులు వసూలు చేస్తాయి. ఆ రకరకాల ఫీజులేంటి..? ఏయే బ్యాంకు ఎంత మొత్తం వసూలు చేస్తాయి? తదితర అంశాలను ముందుగానే తెలుసుకుని ఏ బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ తీసుకోవాలన్నది నిర్ణయించుకోవాలి.

Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ కీలక అంశాల గురించి తప్పక తెలుసుకోండి
Personal Loan
Janardhan Veluru
|

Updated on: Jun 30, 2022 | 3:58 PM

Share

Personal Finance Tips: వ్యక్తుల ఆర్థిక అత్యవసరాల కోసం బ్యాంకులు పర్సనల్ లోన్స్(Personal Loans) ఇస్తాయి. మరీ ఎక్కువ డాక్యుమెంట్లు, సెక్యూరిటీ లేకుండా బ్యాంకులను నుంచి ఈ రుణాలు పొందొచ్చు. ఆర్థిక ఒత్తిడి, అత్యవసరమైనప్పుడు  సులభంగా పర్సనల్ లోన్ లభిస్తుంది. నెలవారీ ఈవీఎంల ద్వారా తీసుకున్న రుణాన్ని వడ్డీతో కలిపి చెల్లించే వెసులుబాటు ఉంటుంది. అయితే వ్యక్తుల సిబిల్(SIBIL) స్కోరు బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేటును ప్రధానంగా ప్రభావితం చేస్తుంది. అత్యవసరంగా పర్సనల్ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినా.. రుణాలు తీసుకునే ముందు బ్యాంకుల నిబంధనలు, వడ్డీ రేటు, కాల పరిమితి, లేట్ ఫీజు వంటి కీలక అంశాల గురించి తెలుసుకోవాలి.

పర్సనల్ లోన్ మంజూరు చేసే సమయంతో పాటు రుణాలను తిరిగి చెల్లించే సమయంలో బ్యాంకులు 6 రకాల ఫీజులు వసూలు చేస్తాయి. ఆ రకరకాల ఫీజులేంటి..? ఏయే బ్యాంకు ఎంత మొత్తం వసూలు చేస్తాయి? తదితర అంశాలను ముందుగానే తెలుసుకుని ఏ బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ తీసుకోవాలన్నది నిర్ణయించుకోవాలి.

1.ప్రాసెసింగ్ ఫీజు.. పర్సనల్ లోన్ మంజూరు చేసేందుకు చాలా బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తాయి. ప్రాసెసింగ్ ఫీజు బ్యాంకులిచ్చే లోన్ మొత్తంపై ఆధారపడి ఉంటుంది. బ్యాంకుల నిర్వహణ వ్యయం కోసం దీన్ని ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా వసూలు చేస్తాయి. కొన్ని బ్యాంకుల్లో కనీస, గరిష్ఠ ప్రాసెసింగ్ ఫీజులు ఉంటాయి. లోన్ మొత్తంపై 0.5 శాతం నుంచి 2.5 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. పర్సనల్ లోన్ తీసుకునే ముందు ప్రాసెసింగ్ ఫీజు ఎంత వసూలు చేస్తారో బ్యాంకర్‌ను అడిగి క్లారిటీ తెచ్చుకోవాలి.

ఇవి కూడా చదవండి

2.వెరిఫికేషన్ ఛార్జీ.. పర్సనల్ లోన్ ఇచ్చేందుకు కొన్ని బ్యాంకులు వెరిఫికేషన్ ఛార్జీలు వసూలు చేస్తాయి. పర్సనల్ లోన్‌కు మీరు అప్లై చేసుకుంటే.. రుణాలను తిరిగి చెల్లించేందుకు మీకున్న సామర్థ్యాన్ని బ్యాంకులు థర్డ్ పార్టీల ద్వారా చెక్ చేసుకుంటాయి. మీ క్రెడిట్ హిస్ట్రీ తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని మీకు పర్సనల్ లోన్ మంజూరు చేయడంపై బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయి. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ కోసం బ్యాంకులకు అయ్యే అదనపు ఖర్చులను.. రుణగ్రహీతల నుంచే బ్యాంకులు వసూలు చేస్తాయి. ఈ వ్యయాన్ని వెరిఫికేషన్ ఫీజుల కింద వసూల చేస్తాయి బ్యాంకులు.

3.EMI లేట్ ఫీజు.. పర్సనల్ లోన్‌ను నెలవారీ ఈఎంఐల ద్వారా చెల్లించవచ్చు. ప్రతి నెలా గడువు నాటికల్లా ఈఎంఐని చెల్లించలేని పక్షంలో బ్యాంకులు లేట్ ఫీజులు వసూలు చేస్తాయి. అందుకే లోన్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో తమ సామర్థ్యానికి మించి ఎక్కువ మొత్తాన్ని ఈఎంఐగా చేసుకోవడం సరికాదు. మీ ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగానే ఈఎంఐ ఉండేలా చూడాలి. అవసరమైతే ఈఎంఐ కాల పరిమితిని పెంచుకోవాలి.

4.డూప్లికేట్ స్టేట్‌మెంట్ ఫీజు.. మీ లోన్‌కు సంబంధించి స్టేట్‌మెంట్‌ను చాలా బ్యాంకులు ఉచితంగానే ఆన్‌లైన్‌లో సమకూరుస్తాయి. అవసరమైనప్పుడు నేరుగా సంబంధిత బ్యాంకును సంప్రదించి పర్సనల్ లోన్‌కు సంబంధించిన డూప్లికేట్ స్టేట్‌మెంట్స్ తీసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు డూప్లికేట్ స్టేట్‌మెంట్ జారీ చేసేందుకు కొంత మేర ఫీజులు వసూలు చేస్తాయి.

5.జీఎస్టీ Tax.. లోన్ మంజూరు సందర్భంలోనూ.. లోన్ తిరిగి చెల్లించే సమయంలోనూ రుణగ్రహీతలు బ్యాంకుల నుంచి పొందే అదనపు సేవలకు GST పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఫీజులపై ఈ జీఎస్టీ ఛార్జీలను వసూలు చేస్తారు.

6.ప్రీ పేమెంట్ ఛార్జీ.. కాల పరిమితి కంటే ముందే తమ రుణాన్ని బ్యాంకులకు తిరిగి చెల్లించాలన్న యోచన ఉంటే.. ప్రీ పేమెంట్ ఛార్జీల గురించి తప్పక తెలుసుకోవాలి. ఈ విషయంలో ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన విధానాన్ని అవలంభిస్తాయి. కొన్ని బ్యాంకులు రుణాలను నిర్ణాత కాలపరిమితి కంటే ముందే చెల్లిస్తే ఎలాంటి ఛార్జీలు వసూలు చేయవు. కొన్ని బ్యాంకులు మాత్రం రుణగ్రహీతల నుంచి ప్రీ పేమెంట్ ఛార్జీలు వసూలు చేస్తాయి. లేదా ముందుగా చెల్లించిన అసలుపై వడ్డీ రేటును ఎక్కువగా వసూలు చేస్తాయి. అందుకే సదరు బ్యాంకులో ప్రీ పేమెంట్ ఛార్జీలు ఎంత వసూలు చేస్తాయో పర్సనల్ లోన్ తీసుకోవడానికి ముందే తెలుసుకోవడం మంచిది.

దీనితో పాటు సిబిల్ స్కోరు బాగుంటే మీకు తక్కువ వడ్డీ రేటుకు పర్సనల్ లోన్ లభిస్తుంది. అందుకే పర్సనల్ లోన్ తీసుకోవాలంటే ముందు నుంచే సిబిల్ రేటును మెరుగుపర్చుకోవడంపై దృష్టిసారించాలి.

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి..