Plummeting Onion Prices: కిలో ఉల్లి రూ. 5 మాత్రమే … కొనేవారి కోసం చూస్తున్న ఉల్లి రైతులు.. ఎక్కడంటే…!
ఉల్లి ధర పాతాళానికి పడిపోయింది. కొనే వాళ్లు లేక రైతు కన్నీళ్లు పెడుతున్నాడు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంట పండిస్తే .. పంట చేతికొచ్చే సరికి ధర అమాంతం పడిపోయింది. ఉల్లిని మార్కెట్‌కు తీసుకెళ్లిన రైతులు ఏమి చేయాలో తెలియక తలలు..
ఉల్లి ధర పాతాళానికి పడిపోయింది. కొనే వాళ్లు లేక రైతు కన్నీళ్లు పెడుతున్నాడు. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంట పండిస్తే .. పంట చేతికొచ్చే సరికి ధర అమాంతం పడిపోయింది. ఉల్లిని మార్కెట్‌కు తీసుకెళ్లిన రైతులు ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. క్వింటాళ్ల కొద్ది ఉల్లి బస్తాలతో మార్కెట్‌లు నిండిపోయాయి. ఉల్లిని కొనండి మహాప్రభో అంటూ రైతులంతా చేతులెత్తి వేడుకుంటున్నారు.
రైతు అంటేనే.. కష్టజీవి. నిత్యం శ్రమటోడ్చే వ్యక్తుల్లో ముందుండేది రైతే. వేసి పంట కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటాడు. పంట చేతికొచ్చేదాక దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. కానీ ఏనాడూ గిట్టుబాటు వచ్చింది లేదు.. అదృష్టం కలిసొచ్చిందీ లేదు. ఇప్పుడు ఉల్లి పంట అమ్ముకునే సమయంలోనూ అలాగే జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో దాదాపు 5వేల ఎకరాల్లో ఉల్లి సాగు చేశారు. ప్రస్తుతం మార్కెట్ యార్డ్‌కి 6వేల క్వింటాళ్ల ఉల్లి ఉత్పత్తులు వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో మధ్యస్తంగా క్వింటా ఉల్లి ధర 500 రూపాయలు పలుకుతోంది. కనీసం రెండు వేల రూపాయల ధర పలికితేనే తమకు గిట్టుబాటు అవుతుందంటున్నారు రైతులు.
సాధారణంగా మహారాష్ట్ర, గుజరాత్ ఉత్పత్తుల దిగుబడిపై కర్నూల్ మార్కెట్ ధర ఆధారపడి ఉంటుంది. ప్ర స్తుతం ఆ రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో ఉల్లి వస్తుంది. దీంతో ధర పడిపోయిందంటున్నారు అధికారులు. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టిలా మారింది ఉల్లి ధరల పరిస్థితి. ఒక్కోసారి కొండెక్కి కూర్చుంటుంది.. మరోసారి ఢమాల్ అంటోంది. ప్రస్తుతానికి రేటు పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.