Maruti Suzuki: మారుతి సుజుకి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేయండి! కానీ తొమ్మిది నెలలు ఆగాల్సిందే!

ఈ ఏడాది ఏప్రిల్ లో మారుతీ సుజుకి తన కార్ల ధరలను 1.3 శాతం వరకూ పెంచింది. ఈ పెంచిన ధరలు వచ్చే జనవరి నుంచి అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు దారులు ధరలు పెరగక ముందే కార్లను కొనుగోలు చేయాలని తలంచి విపరీతంగా బుకింగ్స్ చేస్తున్నారు.

Maruti Suzuki: మారుతి సుజుకి కారు కొనాలనుకుంటున్నారా? వెంటనే బుక్ చేయండి! కానీ తొమ్మిది నెలలు ఆగాల్సిందే!
Maruti Suzuki
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Dec 17, 2022 | 3:15 PM

మీరు కారు కొనాలనుకుంటున్నారా? అది కూడా మారుతి సుజుకి కంపెనీకి చెందిన మోడల్స్ లోనే కావాలనుకుంటున్నారా? అయితే మీరు కారును వెంటనే బుక్ చేసుకోవాలి. కానీ మీకు కారు ఇంటికి రావడానికి తొమ్మిది నెలలు పడుతుంది. ఎందుకంత సమయం పడుతుంది? అంత సమయం పట్టినా ఎందుకు వెంటనే కారు బుక్ చేసుకోవాలి? తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.

డిమాండ్ అండ్ సప్లయి..

మార్కెట్ లో ఉన్న డిమాండ్ ప్రకారం ఈ మారుతి సుజుకి కంపెనీకి చెందిన కార్లు బుక్ చేసుకున్న తొమ్మిది నెలలకు గాని రావడం లేదంట! అయితే అది మీరు ఉన్న నగరం.. అక్కడి డీలర్ తదితర అంశాలను బట్టి డెలివరీ టైంలో మార్పు ఉండవచ్చు. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి కంపెనీకి చెందిన వివిధ రకాల మోడల్ కార్లు.. వాటిని బుక్ చేసిన ఎన్ని రోజులకు డెలివరీ అవుతుంతో ఓ సారి చూద్దాం..

ఎర్టిగా కావాలంటే తొమ్మిది నెలలు..

7 సీటర్ సామర్థ్యం కలిగిన ఎర్టిగా కారు మీకు కావాలంటే కనీసం తొమ్మిది నెలలు సమయం పడుతుందని హిందుస్తాన్ లైవ్ తెలిపింది. అలాగే ఆల్టో, ఇగ్నిస్ అయితే బుక్ చేసిన వెంటనే మీకు డెలివరీ అవుతుంది. మిగిలిన మోడళ్లలో బ్రెజ్జా, గ్రాండ్ విటారా, ఎక్స్ఎల్6, బాలెనో కార్లు బుక్ చేసిన మూడు నెలల్లో డెలివరీ అవుతున్నాయి. ఇక స్విఫ్ట్ కోసం అయితే రెండున్నర నెలలు, సియాజ్ కోసం నెలన్నర ఆగాల్సి వస్తోంది. అలాగే వ్యాగన్ ఆర్, ఎస్ ప్రెస్సో, సెలెరియో, డీజైర్ వంటి మోడళ్లు బుక్ చేసిన నెల రోజులకు డెలివరీ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

కారణం ఇదేనా..

ఈ ఏడాది ఏప్రిల్ లో మారుతీ సుజుకి తన కార్ల ధరలను 1.3 శాతం వరకూ పెంచింది. ఈ పెంచిన ధరలు వచ్చే జనవరి నుంచి అమలు కానున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు దారులు ధరలు పెరగక ముందే కార్లను కొనుగోలు చేయాలని తలంచి విపరీతంగా బుకింగ్స్ చేస్తున్నారు. దీంతో కార్లకు ఎన్నడూ లేనంతగా డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా డెలివరీ టైం ఏకంగా నెలలు దాటుతోంది.

దేశంలోనే మొదటి వాహనం..

మారుతీ సుజుకి తన ఫ్లెక్స్ ఫ్యూయెల్ ప్రోటో టైప్ కారుని ఇటీవల ఢిల్లీలో ప్రదర్శించింది. ఇది ఇథనాల్, పెట్రోల్ కాంబినేషన్ లో 20 శాతం ఇథనాల్, 80 శాతం గ్యాసోలైన్ తో నడవగలుగుతుంది. దేశంలోనే ఈ విధంగా తయారు చేసిన తొలి ఇంజిన్ ఇదే. మన దేశంలోని మారుతి సుజుకి ఇంజినీర్లు జపాన్ నిపుణుల సాయంతో దీనిని తయారు చేశారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
శభాష్..! కొత్త అవతారమెత్తిన ఖమ్మం కలెక్టర్!
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
టాలీవుడ్ దమ్ము చూపిన పుష్పరాజ్.. రూ.1000 కోట్ల బిజినెస్ సీక్రెట్.
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
దేవతలే దిగివచ్చి పంట కోస్తున్నారా.? కోటి తలంబ్రాలు పంట పండింది..
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు.! 24 గంటల్లో మరింత బలపడే అవకాశం.
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ట్రంప్ కళ్లెదుటే మస్క్‌కి అవమానం.! పేలిపోయిన ఎలాన్‌ మస్క్‌ రాకెట్
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
ఇలా చేస్తే.. చలికి నల్లగా మారిన శరీర ఛాయ తెల్లగా మారుతుంది.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
కార్తీకంలోనే కాదు.. ఆ రోజుల్లోనూ ఉల్లి, వెల్లుల్లిని తినకూడదట.!
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
వర్కవుట్స్ చేయిస్తూ కుప్పకూలిన జిమ్ ట్రైనర్.డాక్టర్లు ఏం చెప్పారు
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
రాత్రివేళ బట్టలు ఉతుకుతున్నారా.? ఇది తెలిస్తే.. ఇక ఆ పని చెయ్యరు!
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.
నయన్ రూట్‌ నే ఫాలో అవుతున్న నాగచైతన్య-శోభిత.! వీడియో.