Motor Vehicles Price: వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఆ కంపెనీ వాహనాల ధరలు పెరిగే ఛాన్స్.. కారణాలివే..

వాహనాల ధరలు తరచూ పెరగవు. వాహనాల తయారీకి సంబంధించి మెటిరీయల్ ధరలు పెరిగిప్పుడు లేదా తయారీ వ్యయం అధికమైనప్పుడు కంపెనీలు వాహనాల ధరలను పెంచుతాయి. అలాగే వాహనాల ధరలు అనేవి వెహికల్..

Motor Vehicles Price: వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఆ కంపెనీ వాహనాల ధరలు పెరిగే ఛాన్స్.. కారణాలివే..
Tata Tiago Ev Cars
Follow us

|

Updated on: Dec 06, 2022 | 9:55 AM

వాహనాల ధరలు తరచూ పెరగవు. వాహనాల తయారీకి సంబంధించి మెటిరీయల్ ధరలు పెరిగిప్పుడు లేదా తయారీ వ్యయం అధికమైనప్పుడు కంపెనీలు వాహనాల ధరలను పెంచుతాయి. అలాగే వాహనాల ధరలు అనేవి వెహికల్ యొక్క ఫీచర్స్‌పై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా వాహనంలో సౌకర్యాలు ధరను ప్రభావితం చేస్తాయి. వచ్చే ఏడాది నుంచి అమల్లోకి వచ్చే కఠినమైన ఉద్గార నిబంధనలకు (ఎమిషన్స్ రూల్స్) అనుగుణంగా కంపెనీలు వాహనాలను అప్‌గ్రేడ్ చేస్తున్నాయి. దీంతో వాహనాల ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని కంపెనీలు నాలుగు చక్రాల ప్యాసింజర్, వాణిజ్య వాహనాలను తదుపరి స్థాయి ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించాల్సి ఉంటుంది. దీంతో ప్రొడక్షన్‌ ఖర్చు పెరుగుతుందని, వచ్చే ఏడాది నుంచి ధరల్లో ఈ ప్రభావం కనిపిస్తుందని వాహన రంగ నిపుణులు చెబుతున్నారు. దేశీయ దిగ్గజ ఆటో సంస్థ టాటా మోటార్స్​వాహనాల ధరలను పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. 2023 జనవరిలో వాహనాల ధరలను పెంచాలని ఆ సంస్థ భావిస్తోంది. ఎమిషన్స్ నిబంధనలకు తగ్గట్టుగా.. సంస్థకు చెందిన వాహనాలను సిద్ధం చేసేందుకు ఈసారి ధరలను పెంచాలని టాటా మోటార్స్​ యోచిస్తోంది. ఏడాది కాలంగా ముడి సరకు ధరలు ఎక్కువగా ఉన్నాయని, తాజా ధరల పెంపుతో కంపెనీపై భారం తగ్గుతుందని టాటా మోటార్స్​ అంచనా వేస్తోంది. సాధారణంగా రెగ్యూలేటరీ మార్పులు.. ధరలను ప్రభావితం చేస్తాయి. ముడి సరకు ధరలు తగ్గితే, అది వచ్చే త్రైమాసికంలో కనిపిస్తాయి. కానీ ఏడాదిగా ముడి సరకు ధరలు ఎక్కువగానే ఉన్నాయి. ఫలితంగా కంపెనీపై భారం పడటంతో ధరలను పెంచాలని భావిస్తున్నట్లు టాటా మోటర్స్ వెల్లడించింది. టాటా మోటార్స్ పంచ్​, నెక్సాన్​, హ్యారియర్​, సఫారీతో పాటు నెక్సాన్​ ఈవీ, టియాగో ఈవీ వంటి మోడల్స్​ను విక్రయిస్తోంది.

ఈ ఏడాది చాలా సార్లు వాహనాల ధరలను టాటా మోటర్స్ పెంచింది. గత నెల వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. పెంచిన ధరలు నవంబర్​ 7వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. మళ్లీ వచ్చే నెలలో ధరలను పెంచుతామని ప్రకటించడంతో కస్టమర్లను కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టాటా మోటర్స్‌కు సంబంధించిన వాహనాలను చాలా మంది ఇప్పటికే బుక్ చేసుకున్నారు. వారికి డెలివరీ అవడానికి టైం పడుతుంది. దీంతో ఇప్పటికే బుక్ చేసుకున్న తమ వాహనం ఎప్పుడు డెలివరీ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

టాటా మోటార్స్‌తో పాటు మారుతీ సుజుకీ నుంచి మహీంద్రా అండ్​ మహీంద్రా వరకు.. అన్ని ఆటో సంస్థలు తమ వాహనాల ధరలను పెంచనున్నాయి. 2023 జనవరిలో వాహనాల ధరలను పెంచుతున్నట్టు గత వారమే మారుతీ సుజుకీ ప్రకటించింది. 2023 ఏప్రిల్​ నుంచి అమల్లోకి వచ్చే నిబంధనల ప్రకారం.. ఎమిషన్​ లెవల్స్​ను డ్రైవింగ్​ సమయంలోనే పర్యవేక్షించేందుకు.. కారులో సెల్ఫ్​ డయగ్నోస్టిక్​ డివైజ్​ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎమిషన్​ అనేది ఎక్కువగా ఉంటే.. వార్నింగ్​ సిగ్నల్స్​ ఇస్తుంది. ఆ వెంటనే కారు సర్వీసుకు ఇవ్వాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..