Petrol Diesel Price: వాహనదారులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగివచ్చిన పెట్రోల్ ధర..

వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. సామాన్యల ఊరటనిస్తున్నాయి. నిరంతర పెరుగుదల

Petrol Diesel Price: వాహనదారులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా దిగివచ్చిన పెట్రోల్ ధర..
Petrol And Diesel
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 25, 2021 | 9:02 AM

Petrol-Diesel Rates Today: వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. సామాన్యల ఊరటనిస్తున్నాయి. నిరంతర పెరుగుదల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్ రూ .100 దాటింది. కాగా, పెట్రోల్, డీజిల్ రేట్లలో ఇవాళ ఎలాంటి మార్పు లేదు. దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచలేదు. ఆదివారం స్థిరంగా ఉంచారు. ఇదిలాఉంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను వరుసగా పెంచుతున్నాయి.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 97.96గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.71 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.98.83గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.89గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.99గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.83గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.89గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.83ఉండగా.. డీజిల్ ధర రూ.97.96 గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.38 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.52గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.108 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 99.60 లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.80 ఉండగా.. డీజిల్ ధర రూ.98.43గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.93లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.99.48గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.43 గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.06గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 108 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.99.60 లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.84గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 89.87 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.83కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.45గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.102.08 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 93.02 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 102.49ఉండగా.. డీజిల్ ధర రూ.94.39గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.105.25 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.95.26 గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.91 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.90.26గా ఉంది.

ఇవి కూడా చదవండి: New Ration Cards: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

Bonala Jatara: బోనమెత్తిన ఉజ్జయిని.. బంగారు బోనం సమర్పించిన మంత్రి తలసాని