Petrol Diesel Price: నిలిచిపోయిన క్రూడాయిల్ పరుగులు.. మీ నగరం ధరలు పెట్రోల్, డీజిల్ ధరలను ఇక్కడ చూడండి..

దేశంలోని ప్రధాన చమురు కంపెనీలు మార్చి 16 బుధవారం కొత్త పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. ఈరోజు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులేదు. మరోవైపు

Petrol Diesel Price: నిలిచిపోయిన క్రూడాయిల్ పరుగులు.. మీ నగరం ధరలు పెట్రోల్, డీజిల్ ధరలను ఇక్కడ చూడండి..
Petrol Diesel Price
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 16, 2022 | 9:03 AM

Petrol-Diesel Rates Today: దేశంలోని ప్రధాన చమురు కంపెనీలు మార్చి 16 బుధవారం కొత్త పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి. ఈరోజు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులేదు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పడిపోయాయి. క్రూడాయిల్ ధరల్లో వేగంగా పతనం అవుతోంది. బుధవారం, మార్చి 16, WTI క్రూడ్ ధరలు $ 96.85, బ్రెంట్ క్రూడ్ ధరలు $ 100.5 కు చేరుకున్నాయి. కొద్ది రోజుల క్రితం, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $ 140కి చేరుకున్నాయి. అయితే ఇప్పుడు క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. ఇదిలావుంటే.. నవంబర్ 2021 వరకు దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉంటాయి. మెట్రో నగరాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని చాలా చోట్ల ధరల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఈ వివరాలను వెబ్ సైట్  అందించిన సమాచారం ప్రకారం మీ కోసం..

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.20గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉంది. కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.25గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.94.65గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 108.94గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.86గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.55గా ఉండగా.. డీజిల్ ధర రూ.95.71గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 108.62 ఉండగా.. డీజిల్ ధర రూ.95.01గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.69 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.35కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.96.44లకు లభిస్తోంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.109.90 ఉండగా.. డీజిల్ ధర రూ. 95.97గా ఉంది. విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.46 లకు లభిస్తుండగా.. డీజిల్ ధర రూ.95.57గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110.89గా ఉండగా.. డీజిల్ ధర రూ.96.94గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ.110.35లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.96.44లకు లభిస్తోంది.

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ.95.41 గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ. 86.67 లకు లభిస్తోంది. ఇదే సమయంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.98కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.94.14 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.104.67 చొప్పున ఉండగా.. డీజిల్ ధర రూ. 89.79 గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 101.40 ఉండగా.. డీజిల్ ధర రూ.91.43గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.100.58 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.85.01గా ఉంది. లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.36 ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.86.80గా ఉంది.

ఇవి కూడా చదవండి: AP CM YS Jagan: రెండేళ్లలో పరీక్షా సమయం రాబోతోంది.. అంతా సిద్ధంగా ఉండాలిః సీఎం వైఎస్ జగన్

Holi 2022 bank holiday: కస్టమర్లకు అలెర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే!