Petrol, Diesel Price: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎలా ఉన్నాయి!

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు దేశంలోని..

Follow us

|

Updated on: Nov 13, 2022 | 9:13 AM

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు దేశంలోని ప్రభుత్వ చమురు కంపెనీలు హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ మరియు భారత్ పెట్రోలియం నగరాల ప్రకారం పెట్రోల్-డీజిల్ ధరలను విడుదల చేస్తాయి.

ఈరోజు కూడా పెట్రోల్-డీజిల్ ధర విడుదలైంది. గత చాలా కాలంగా వాటి ధరల్లో పెద్దగా మార్పులేమీ లేకపోవడం గమనార్హం. దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు చాలా కాలంగా స్థిరంగా కొనసాగుతున్నాయి. నవంబర్‌ 13న దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్‌, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

☛ ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62

ఇవి కూడా చదవండి

☛ ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 106.31, డీజిల్ ధర రూ. 94.27

☛ కోల్‌కతాలో లీటర్‌ పెట్రోలు రూ.106.03, డీజిల్ ధర రూ.92.76

☛ చెన్నైలో లీటర్‌ పెట్రోలు రూ.102.63, డీజిల్ ధర రూ.94.24

☛ హైదరాబాద్‌లో లీటర్‌ లీటర్ పెట్రోల్ రూ. 109.66, డీజిల్ ధర రూ. 97.82

☛ బెంగళూర్‌లో పెట్రోల్ రూ. 101.94, డీజిల్ లీటర్‌ ధర రూ. 87.89

ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్, ఇతర వస్తువులను జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇంత ఎక్కువగా కావాడనికి ఇదే కారణం.

మీరు ఇంట్లో కూర్చొని పెట్రోల్-డీజిల్ రేట్లను తనిఖీ చేయవచ్చు. అన్ని చమురు కంపెనీలు SMS ద్వారా పెట్రోల్, డీజిల్ ధరలను తనిఖీ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తాయి. ధరను తనిఖీ చేయడానికి, ఇండియన్ ఆయిల్ (IOC) వినియోగదారు RSP<డీలర్ కోడ్> అని రాసి 9224992249 నంబర్‌కు పంపాలి. అదే సమయంలో, HPCL వినియోగదారులు 9222201122 నంబర్‌కు HPPRICE <డీలర్ కోడ్> అని టైప్ చేయడం ద్వారా, అలాగే BPCL (BPCL) వినియోగదారులు RSP<డీలర్ కోడ్> అని టైప్ చేయడం చేసి 9223112222కు SMS పంపండి. ధరలను తెలుసుకునేందుకు ఈ లింక్‌ ద్వారా కోడ్‌ను తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజిెనెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి