దేశంలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ వినియోగం..ఇది దేనికి సంకేతం?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆరు మాసాల గరిష్ఠ స్థాయికి చేరాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సానుకూల పరిస్థితులకు సంకేతంగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

దేశంలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ వినియోగం..ఇది దేనికి సంకేతం?
Petrol and Diesel consumption
Follow us
Janardhan Veluru

|

Updated on: Dec 02, 2024 | 6:08 PM

న్యూఢిల్లీ: పండుగల సీజన్.. ఆ తర్వాత వెంటనే వచ్చిన పెళ్లిళ్ల సీజన్ కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగం భారీగా పెరిగింది. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలసిస్ సెల్ (PPAC) డేటా మేరకు.. ఈ ఏడాది నవంబర్ మాసంలో పెట్రోల్ అమ్మకాలు 3,418 వేల మెట్రిక్ టన్నులకు(TMT) చేరాయి. గత ఏడాది నవంబర్ మాసంలో నమోదైన పెట్రోల్ అమ్మకాలతో పోలిస్తే.. ఈ ఏడాది నవంబర్ మాసంలో పెట్రోల్ అమ్మకాలు 9.2 శాతం పెరిగింది.

అటు దేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఇంధనమైన డీజిల్ అమ్మకాలు కూడా నవంబర్ మాసంలో పెరిగాయి. నవంబర్ మాసంలో 8.4 శాతం వృద్ధితో 8,158 వేల మెట్రిక్ టన్నుల(TMT) డీజిల్ విక్రయాలు జరిగాయి. వర్షాకాలంలో పెట్రోల్, డీజిల్ విక్రయాలు తగ్గినా.. ఆ తర్వాత డిమాండ్ పెరగడంతో విక్రయాలు ఆరు మాసాల గరిష్ఠ స్థాయికి చేరాయి.

అటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) సెగ్మెంట్ కూడా బలంగా ఉంది. ఏటీఎఫ్ వినియోగం నవంబర్ మాసంలో 7.7 శాతం వృద్ధితో 743 టీఎంటీలకు చేరుకుంది. ఏవియేషన్ రంగంలో నెలకొన్న అనుకూల పరిస్ధితికి ఇది సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. విమాన ప్రయాణాలు పెరగడంతో ఆ మేరకు ఏటీఎఫ్ వినియోగం పెరిగింది. అలాగే ఎల్పీజీ గ్యాస్ వినియోగం కూడా 7.3 శాతం పెరిగి 2,765 టీఎంటీ

పెట్రోల్, డీజిల్ వినియోగం పెరగడం పట్ల దేశ పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. ఇతర దేశాల్లో మాంధ్యం ప్రభావం మన దేశంపై లేదని.. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతోందని అనడానికి ఇదే తార్కాణమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ డిమాండ్ మెరుగ్గా ఉండడం దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల మరింత సానుకూల వైఖరి ఏర్పడేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు.