Swiggy: 10 నిమిషాల్లో స్విగ్గీ డెలవరీ.. ఇకపై వరంగల్‌, జగిత్యాల, గుంటూరుతో పాటు..

క్విక్‌ కామర్స్‌ రంగంలో స్విగ్గీ దూకుడు పెంచుతోంది. కేవలం 10 నిమిషాల్లోనే ఫుడ్‌ ఐటమ్స్‌ను డెలివరీ చేసేందుకు వీలుగా ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన బోల్ట్‌ సేవలను మరిన్ని నగరాలకు విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 400 నగరాలు, పట్టణాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు...

Swiggy: 10 నిమిషాల్లో స్విగ్గీ డెలవరీ.. ఇకపై వరంగల్‌, జగిత్యాల, గుంటూరుతో పాటు..
Swiggy
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 02, 2024 | 6:05 PM

ప్రస్తుతం క్విక్‌ కామర్స్‌ రంగం ఓ రేంజ్‌లో విస్తరిస్తోంది. దాదాపు అన్ని ఈ కామర్స్‌ సంస్థలు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ డెలివరీ సంస్థ స్విగ్గీ సైతం ఫాస్ట్‌ డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బోల్ట్‌ పేరుతో స్విగ్గీ ఫాస్ట్‌ డెలివరీ సేలను ప్రారంభించింది.

పూర్తిగా తయారీ అవసరం లేని లేదా తయారీకి తక్కువ సమయంలో తీసుకునే ఆహార పదార్థాలను బోల్ట్‌లో భాగంగా కస్టమర్లకు అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సేవలను మరింత విస్తృతి చేసేందుకు స్విగ్గీ కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, ఢిల్లీ, ముంబయి, పుణె వంటి నగరాకుల మాత్రమే పరిమితమైన సేవలను మరిన్ని నగరాలకు విస్తరిస్తూ నిర్ఱయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా ఏకంగా 400 నగరాలు, పట్టణాల్లో విస్తరిస్తున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది స్విగ్గీ. జైపూర్‌, లఖ్‌నవూ, అహ్మదాబాద్‌, ఇందౌర్‌, కోయంబత్తూర్‌ వంటి నగరాలకూ విస్తరించింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే గుంటూరు, వరంగల్‌, జగిత్యాల వంటి టైర్‌2, టైర్‌ 3 పట్టణాలకు విస్తరించింది. వీటితోపాటు రూర్కీ, నాసిక్‌ వంటి పట్టణాల్లోనూ బోల్ట్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏపీ, తెలంగాణతో పాటు.. హరియాణా, తమిళనాడు, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఈ సేవలకు ఆదరణ లభిస్తోందని స్విగ్గీ తన ప్రకటనలో తెలిపింది.

బోల్ట్‌ సేవల్లో భాగంగా ఈ తరహా ఆర్డర్లకు ప్రాధాన్యం ఇచ్చేలా రెస్టారంట్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నామని స్విగ్గీ తెలిపింది. ప్రస్తుతానికి రెండు కిలోమీటర్ల వరకు మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉండగా, రానున్న రోజుల్లో రేడియస్‌ను మరింత పెంచనున్నామని స్విగ్గీ తెలిపింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ