Petrol Diesel Price Today: సామాన్యుడికి ఊరట.. స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇదే ట్రెండ్ కొనసాగుతుందా.?
Petrol And Diesel Price Today: పెరగడమే తప్ప తగ్గడం అంటూ తెలియనట్లు దూసుకుపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ఈ మధ్య కాలంలో కాస్త బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి..
Petrol And Diesel Price Today: పెరగడమే తప్ప తగ్గడం అంటూ తెలియనట్లు దూసుకుపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు ఈ మధ్య కాలంలో కాస్త బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు చెక్ పడుతూనే.. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ధరల్లో తగ్గుదల కూడా కనిపించడం విశేషం. ఈ క్రమంలోనే శనివారం కూడా ఇంధన ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లో కొంతమేర ధరల్లో తగ్గుదల కూడా కనిపించింది. మరి రానున్న రోజుల్లో ఇదే ట్రెండ్ కొనసాగుతుందా? లేదో చూడాలి. శనివారం దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.78 ఉండగా.. డీజిల్ ధర రూ.81.10 వద్ద కొనసాగుతోంది. * దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.19గా ఉండగా డీజిల్ రూ. 88.20గా ఉంది. * కర్నాటక రాజధాని బెంగళూరులోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 93.82గాఉండగా.. డీజిల్ ధర రూ. 85.99 వద్ద కొనసాగుతోంది. * తమిళనాడు రాజధాని చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 92.77గా ఉండగా.. డీజిల్ ధర రూ. 86.10గా ఉంది.
తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..
* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.39గా ఉండగా.. డీజిల్ రూ. 88.45 వద్ద కొనసాగుతోంది. * తెలంగాణలో మరో ముఖ్యమైన పట్టణమైన కరీంనగర్‌లోనూ ధరల విషయంలో మార్పు కనిపించలేదు. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 94.51గా ఉండగా.. డీజిల్ ధర రూ. 88.56గా నమోదైంది. * విజయవాడలో ధరల్లో కాస్త తగ్గుదల కనిపించింది ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 96.71 (శుక్రవారం రూ.96.90) కాగా.. డీజిల్ ధర రూ. 90.23 (గురువారం రూ.90.43)గా ఉంది. * ఇక సాగర నగరం విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ. 95.74 (గురువారం రూ.95.77) గా ఉండగా.. డీజిల్ రూ. 89.31 (గురువారం రూ.89.83) వద్ద కొనసాగుతోంది.
మిగతా నగరాల్లో పెట్రోల్ ధరల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://tv9telugu.com/business/petrol-price-today.html
మిగతా నగరాల్లో డీజిల్ ధరల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://tv9telugu.com/business/diesel-price-today.html
Also Read: Low Credit Score: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? రుణం ఇవ్వమన్నారా? అయితే ఇలా ప్రయత్నించి చూడండి..
How to Become Rich: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ట్రిక్‌తో ధనవంతులు కావచ్చటా..! మీరూ ట్రై చేయండి..!
Amazon WhatsApp: మీకు ఈ అమెజాన్ లింక్ వచ్చిందా..? అయితే జాగ్రత్త… క్లిక్ చేశారంటే ఇక అంతే సంగతి