Savings Account: కొత్త సేవింగ్స్ అకౌంట్ తీసుకుంటున్నారా..? ఇవి పాటిస్తే మీకు లాభమే లాభం… తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే..
డబ్బులకు భద్రత కోసం చాలామంది సేవింగ్స్ అకౌంట్ అనేది తీసుకుంటూ ఉంటారు. కానీ అధిక మొత్తంలో నగదును ఈ అకౌంట్‌లో దాచుకోవడం వల్ల మీరు చాలా నష్టపోతారు. సేవింగ్స్ అకౌంట్ తీసుకునేటప్పుడు మంచి బ్యాంక్‌ను ఎంచుకోవాలి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

డబ్బులు పొదుపు చేసుకోవడానికి, భద్రపర్చుకోవడానికి బ్యాంకులు వివిధ రకాల బ్యాంక్ అకౌంట్లను అందిస్తున్నాయి. సేవింగ్స్, కరెంట్, శాలరీ అకౌంట్ అనేది బ్యాంకుల్లో అందుబాటులోకి ఉండేవి. ఉద్యోగం చేసేవారికి కంపెనీలు బ్యాంకులచే శాలరీ అకౌంట్ జారీ చేయిస్తాయి. ఇక వ్యాపారస్తులు, కంపెనీలు కరెంట్ అకౌంట్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇక సేవింగ్స్ అకౌంట్ అనేది మనందరికీ తెలిసిందే. ప్రతీఒక్కరూ ఈ అకౌంట్‌ను వాడుతూ ఉంటారు. సేవింగ్స్ అకౌంట్‌లో భద్రపర్చుకునే డబ్బులకు ఎక్కువ వడ్డీ అందదు. పొదుకు అకౌంట్ ఎలా వాడాలి..? ఎలా వాడితే మీకు ఉపయోగం జరుగుతుంది? నష్టపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కువ డబ్బులు ఉంచుకోకండి
కేవలం రోజువారీ ఖర్చులకు అవసరమయ్యే డబ్బులు, మూడు నెలలకు సరిపోయే ఖర్చుల డబ్బును మాత్రమే సేవింగ్స్ అకౌంట్ వాడాలి. అంతకంటే ఎక్కువ డబ్బులు మీరు దాచుకుంటే మీకే నష్టం. ఎందుకంటే బ్యాంకులు కేవలం 2.5 శాతం వడ్డీ మాత్రమే పొదుపు ఖాతాపై అందిస్తాయి. ఎక్కువ డబ్బులు సేవింగ్స్ అకౌంట్‌లో ఎక్కువకాలం దాచుకునే బదులు ఫిక్స్‌డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్స్, ఇతర వాటిల్లో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు అధికా రాబడి వస్తుంది.
ఛార్జీల వివరాలు
మీరు సేవింగ్స్ అకౌంట్ తీసుకునేటప్పుడు అకౌంట్‌లో మినిమిం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే విధించే ఛార్జీలు, ఏటీఎం ఛార్జీలు గురించి తెలసుకోవాలి. ఛార్జీలు ఎందులో తక్కువ ఉంటే ఆ బ్యాంక్‌ను ఎంచుకోండి. అలాగే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఏ బ్యాంక్ అయితే త్వరగా స్పందిస్తుందో.. ఏ బ్యాంక్ సర్వీస్ బాగుంటుందో అది ఎంచుకోండి. కొన్ని కొత్త బ్యాంకులు సేవింగ్స్ అకౌంట్‌పై అధిక వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. కానీ తీసుకుటేప్పుడు ఆ బ్యంకు సురక్షితమా..లేదా అనేది చూడాలి.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు
సేవింగ్స్ అకౌంట్‌లో రూ.2 లక్షల కంటే ఎక్కువ డబ్బులను ఎక్కువరోజులు ఉంచుకోకండి. దానికి బదులు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసుకోండి. దీని వల్ల మీకు ఆ డబ్బుకు అధిక వడ్డీ వస్తుంది.




