Car Buying Tips: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోకపోతే పప్పులో కాలేసినట్లే..
ఆర్ధిక స్తోమత లేనివారి సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేస్తుంటారు. చాలామంది డీలర్లు సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. కండీషన్‌లో లేని కార్లను విక్రయిస్తున్నారు. దీంతో సెకండ్ హ్యాండ్ కారు తీసుకోవాలంటే ఓనర్ దగ్గర తీసుకోండి. డీలర్ దగ్గర తీసుకోవాలంటే ఇలాంటి జాగ్రత్తలు పాటించండి.

పెద్ద కుటుంబమైతే బైక్ ఉంటే సరిపోదు. ఎక్కడికైనా అందరూ కలిసి వెళ్లాలంటే కారు ఉండాల్సిందే. దీంతో తమ కష్టాన్ని ధారపోసి తమ కుటుంబం కోసం చాలామంది కారు కొనుగోలు చేస్తుంటారు. కారు కొనాలంటే లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ఆర్ధిక స్తోమత సరిపోని చాలామంది సెకండ్ హ్యాండ్ కారు లేదా యూస్డ్ కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. సెకండ్ హ్యాండ్ కారు పేరుతో మీకు కండీషన్స్‌లో లేని కారును మీకు కట్టబెట్టవచ్చు. దీంతో ఇలాంటి సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీకు నష్టం జరగకుండా చేసుకోవచ్చు.
కారు కండీషన్‌లో ఉందా..?
మీరు ముందు సెకండ్ హ్యాండ్ కారు కొనేముందు అది కండీషన్‌లో ఉందా.. లేదా అనేది చెక్ చేయాలి. బండి బాగానే నడుస్తుందా.. ఏమైనా ప్రాబ్లం ఉందా.. స్క్రాచులు, డెంట్స్ ఏమైనా ఉన్నాయా? అనేది చెక్ చేసుకోవాలి. టైర్ల పరిస్థతి ఎలా ఉండనేది చూడండి. ఇక ఇంజిన్ పరిస్థితి ఉందనేది చూడండి. ఇంజిన్ అనేది చాలా ముఖ్యం. అందుకే కారు స్టార్ట్ చేయగానే ఇంజిన్ శబ్దం ఎలా వస్తుంది.. పొగ ఏమైనా వస్తుందా..? గేర్లు బాగానే పనిచేస్తున్నాయా? అనేవి చూసుకోవాలి.
ఛలాన్లు
ఇక మీరు కొనుగోలు చేసే సెకండ్ హ్యాండ్ కారుపై కేసులు ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకోండి. లేకపోతే భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడతారు. ఇక కారుపై ట్రాపిక్ ఛలాన్లు ఉన్నాయా? అనేది తనిఖీ చేయండి. లేకపోతే తర్వాత మీరు ఛలాన్లు కట్టాల్సి ఉంటుంది. కొంతమంది డీలర్లు ప్రమాదానికి గురైన కార్లను లేదా కండీషన్‌లో లేని కార్లను మీకు కట్టబెట్టవచ్చు. దీంతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఇక పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్యూరెన్స్, లోన్‌పై కారు తీసుకుంటే NOC ఉందా.. లేదా అనే విషయాలు తెలుసుకోండి
టెస్ట్ డ్రైవ్
మీరు సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు తప్పకుండా టెస్ట్ డ్రైవ్ చేయండి. ఓడోమీటర్ రీడింగ్ తప్పనిసరిగా చెక్ చేయండి. కారు తక్కువదూరం ప్రయాణించినట్లు రీడింగ్‌లో చూపిస్తే మీరు అనుమాన పడాల్సిందే. అలాంటి సమయంలో సర్వీస్ రికార్డులతో పోల్చుకుని చూడండి.




