SBI Report: ఆ సంవత్సరం నాటికి దేశ తలసరి ఆదాయం దాదాపు 15 లక్షలకు చేరుకుంటుంది: ఎస్బీఐ రిపోర్ట్

ఇటీవల దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుకు చివరి తేదీ జూలై 31తో ముగిసింది. అలాగే ఈ సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్‌ల గణాంకాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది ఆదాయపు పన్ను డేటాను విశ్లేషించిన నివేదికను విడుదల చేసింది. దీని ఆధారంగా రాబోయే సంవత్సరాల్లో దేశంలోని ఆదాయపు పన్ను, అలాగే ప్రజల ఆదాయానికి సంబంధించిన గణాంకాలను అంచనా వేశారు. నేటి నుండి 24 సంవత్సరాల తర్వాత అంటే 2047..

SBI Report: ఆ సంవత్సరం నాటికి దేశ తలసరి ఆదాయం దాదాపు 15 లక్షలకు చేరుకుంటుంది: ఎస్బీఐ రిపోర్ట్
Income
Follow us
Subhash Goud

|

Updated on: Aug 15, 2023 | 1:39 PM

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయ్యాయి. అలాగే భారతదేశం ఈరోజు 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇటీవల దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలుకు చివరి తేదీ జూలై 31తో ముగిసింది. అలాగే ఈ సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్‌ల గణాంకాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది ఆదాయపు పన్ను డేటాను విశ్లేషించిన నివేదికను విడుదల చేసింది. దీని ఆధారంగా రాబోయే సంవత్సరాల్లో దేశంలోని ఆదాయపు పన్ను, అలాగే ప్రజల ఆదాయానికి సంబంధించిన గణాంకాలను అంచనా వేశారు. నేటి నుండి 24 సంవత్సరాల తర్వాత అంటే 2047 సంవత్సరంలో దేశ తలసరి ఆదాయం కూడా ఇందులో అంచనా వేయబడింది.

తలసరి ఆదాయం దాదాపు రూ.15 లక్షలకు ఎప్పుడు చేరుతుంది:

2023 ఆర్థిక సంవత్సరంలో దేశంలో తలసరి ఆదాయం రూ. 2 లక్షలుగా ఉంది. ఇది భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత దాదాపు రూ. 15 లక్షలకు చేరుకుంటుంది. 2047లో రూ.14.9 లక్షలకు చేరుకుంటుందని అంచనా. డాలర్ పరంగా ఇది 2023 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో $2,500 నుంచి $12,400 వరకు పెరుగుతుందని అంచనా.

ఈ నివేదిక కోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అసెస్‌మెంట్ సంవత్సరం 2012 నుంచి అసెస్‌మెంట్ సంవత్సరం 2023 వరకు అంచనా వేసింది. దేశంలో జనాభా పెరుగుదలతో పాటు, దేశంలో పన్నుల వ్యవస్థ మరింత సమర్థవంతంగా ఎలా మారుతుందో, దాని గణాంకాలు మెరుగుపడుతున్నాయని ఇందులో వెల్లడించింది. ఈ నివేదికలో కొన్ని ప్రత్యేక విషయాలు ప్రస్తావించింది. 0

ఇవి కూడా చదవండి

SBI నివేదికలోని ప్రత్యేక విషయాలను తెలుసుకోండి:

అసెస్‌మెంట్ సంవత్సరం 2012తో పోలిస్తే, 2023 అసెస్‌మెంట్ ఇయర్‌లో జనాభాలో 13.6 శాతం మంది తక్కువ ఆదాయ వర్గం నుంచి బయటకు వచ్చి ఎగువ ఆదాయ వర్గానికి మారారు. ఇది కాకుండా 2047 నాటికి, జనాభాలో 25 శాతం మంది తక్కువ ఆదాయ వర్గం నుంచి ఎగువ ఆదాయ వర్గానికి మారాలని భావిస్తున్నారు. 2024 మదింపు సంవత్సరానికి దేశంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య 8.5 కోట్లకు చేరుకుంటుందని అంచనా.

అసెస్‌మెంట్ ఇయర్ 2023లో ఐటీఆర్‌-1 ఫైలర్ల సంఖ్య 42 శాతం.

అసెస్‌మెంట్ ఇయర్ 2012లో మొత్తం పన్ను చెల్లింపుదారుల సంఖ్యలో 84.1 శాతం మంది సున్నా పన్ను బాధ్యతను చూపించారు. ఇప్పుడు అసెస్‌మెంట్ ఇయర్ 2023లో అది 64 శాతానికి తగ్గింది. దేశంలో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేవారి ఆదాయం పెరిగింది. దీని కారణంగా ఎక్కువ సంఖ్యలో ప్రజలు పన్ను చెల్లించడం ప్రారంభించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
పగిలిన డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నారా? ప్రమాదమేనట!
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
కుజ దృష్టితో ఆ రాశుల వారి జీవితాల్లో కొత్త మార్పులు
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
షారుక్ ఖాన్ మెరుపు సెంచరీ: తమిళనాడుకు అద్భుతమైన విజయం!
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే