Honda CD110 Delux: సరికొత్తగా హోండా సీడీ డీలక్స్ లాంచ్.. అతి తక్కువ ధరలో.. సెల్ఫ్ స్టార్ట్ తో పాటు మరిన్ని అదనపు ఫీచర్లు..
హోండా తన పాత హోండా సీడీ 110డీలక్స్ బైక్ ను రీలాంచ్ చేసింది. హోండా సీడీ 110 డీలక్స్ అప్ గ్రేడెడ్ వర్షన్ గా తీసుకొచ్చింది. ఓబీడీ-2 కంప్లైంట్ తో రూ 73,400కే ఇండియాలో విడుదల చేసింది. ఎంట్రీ లెవెల్ బైక్ రేంజ్ లో ఇది ఇప్పటికే తన సత్తాను చాటింది. హోండా కంపెనీ నుంచి వచ్చిన అతి త క్కువ బడ్జెట్ బైక్ ఇదే కావడం విశేషం.ఈ హోండా సీడీ110 డీలక్స్ ఓబీడీ-2 కంప్లైంట్ బైక్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ద్విచక్ర వాహనాల్లో హోండా కంపెనీకి మన దేశంలో అధిక డిమాండ్ ఉంది. ఒకప్పుడు హీరోహోండాగా కలసి ఉన్నప్పటి నుంచి వీటికి డిమాండ్ ఉంది. ఆ తర్వాత హీరో, హోండాగా విడిపోయాక కూడా రెండు బ్రాండ్లు తమ స్థానాన్ని మార్కెట్లో పదిల పరుచుకునేందుకు పోటీ పడుతున్నాయి. రెండింటిలోనూ హోండా కాస్త ముందజలో ఉందని చెప్పాలి. ముఖ్యంగా హోండా యాక్టివా, హొండా యూనికార్న్ వంటి మోడళ్లను హోండాను ముందుతీసుకొస్తున్నాయి. అయినప్పటికీ హీరో కూడా మార్కెట్లో తన స్థానాన్ని నిలబెట్టుకుంటోంది. ఇదే క్రమంలో హోండా తన పాత హోండా సీడీ 110డీలక్స్ బైక్ ను రీలాంచ్ చేసింది. హోండా సీడీ 110 డీలక్స్ అప్ గ్రేడెడ్ వర్షన్ గా తీసుకొచ్చింది. ఓబీడీ-2 కంప్లైంట్ తో రూ 73,400కే ఇండియాలో విడుదల చేసింది. ఎంట్రీ లెవెల్ బైక్ రేంజ్ లో ఇది ఇప్పటికే తన సత్తాను చాటింది. హోండా కంపెనీ నుంచి వచ్చిన అతి త క్కువ బడ్జెట్ బైక్ ఇదే కావడం విశేషం. దీనికి 10 ఏళ్ల వారంటీ ప్యాకేజీ ఉంటుంది. దీనిలో మూడేళ్ల స్టాండర్డ్, ఏడేళ్ల ఆప్షనల్ ఎక్స్ టెండెట్ వారంటీ ఉంటుంది. ఈ హోండా సీడీ110 డీలక్స్ ఓబీడీ-2 కంప్లైంట్ బైక్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
హోండా సీడీ110 డీలక్స్ 2023 ఇంజిన్.. ఈ బైక్ లో 109.51 సీసీ, 4 స్ట్రోక్ ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలెండర్ ఉంటుంది. ఇది 8.67 బీహెచ్ పీ, 9.30 ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఇప్పుడు బీఎస్-6 ఫేజ్-2కి అప్ గ్రేడ్ అయ్యింది. దీనిలో ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్ సెన్సార్స్ ఉన్నాయి. దీనిలో 4 స్పీడ్ మల్టీ ప్లేట్ వెట్ క్లట్జ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ ఇంజిన్ సులభంగా మెయింటేన్ చేయొచ్చని కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా సిటీ అవసరాలకు బాగా ఉపకరిస్తుంది.
హోండా సీడీ110 డీలక్స్ ఫీచర్స్.. ఈ బైక్ లో డీసీ హెడ్ ల్యాంప్ ఉంది. కానీ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఇవ్వలేదు. డీఆర్ఎల్ కూడా ఎల్ఈడీ లేదు. ఇంజిన్ స్టార్ట్/స్విచ్ బటన్ ఇచ్చారు. అంటే సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది. కాంబీ బ్రేక్ సిస్టమ్ ఉంటుంది. డిస్క్ బ్రేకులు ఉండవు. దీనిలో పొడవైన సీట్లు ఉంటాయి. 720ఎంఎం పొడవుతో ఇవి ఉంటాయి. అలాగే దీనిలో విస్కస్ పేపర్ ఫిల్టర్ ఉంటుంది. ఇది 18,000 కిలోమీటర్ల వరకూ మార్చాల్సిన అవసరం ఉండదని కంపెనీ పేర్కొంది.
హోండా సీడీ110 డీలక్స్ డిజైన్.. ఇప్పుడు విడుదలైన ఈ బైక్ కూడా పాత మోడల్లోనే ఉంటుంది. డిజైన్ లో ఎటువంటి మార్పు లేదు. అయితే ట్యాంక్ వద్ద, అలాగే బైక్ కి అటువైపు, ఇటు వైపు కొత్తగా గ్రాఫిక్ ఎలిమెంట్స్ జోడించారు. అల్లాయ్ వీల్స్ అలాగే కొనసాగించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..