AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Independence Day Sale: టెక్ గ్యాడ్జట్ల‌పై అదిరే ఆఫర్లు.. మళ్లీ మళ్లీ రావు ఇలాంటి డిస్కౌంట్లు.. మిస్ చేసుకోవద్దు..

అన్ని ఈ-కామర్స్ సైట్లు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించాయి. అలాగే ఆన్ లైన్ రిటైలర్లు, షోరూంలలో కూడా పలు టెక్ గ్యాడ్జెట్లపై ఆఫర్లు ఉన్నాయి. వీటిల్లో ఐఫోన్లు, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు, ఫోన్ యాక్సెసరీస్, హోం థియేటర్స్ వంటివి కూడా ఉన్నాయి. ఇప్పటికే సేల్స్ ప్రారంభమై చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ సేల్స్, ఫ్లిప్ కార్ట్ లలో అందుబాటులో ఉన్న ఇండిపెండెన్స్ డే డీల్స్ గురించి ఇప్పుడు చూద్దాం..

Independence Day Sale: టెక్ గ్యాడ్జట్ల‌పై అదిరే ఆఫర్లు.. మళ్లీ మళ్లీ రావు ఇలాంటి డిస్కౌంట్లు.. మిస్ చేసుకోవద్దు..
Offers
Follow us
Madhu

|

Updated on: Aug 14, 2023 | 5:30 PM

అన్ని ఈ-కామర్స్ సైట్లు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించాయి. అలాగే ఆన్ లైన్ రిటైలర్లు, షోరూంలలో కూడా పలు టెక్ గ్యాడ్జెట్లపై ఆఫర్లు ఉన్నాయి. వీటిల్లో ఐఫోన్లు, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు, ఫోన్ యాక్సెసరీస్, హోం థియేటర్స్ వంటివి కూడా ఉన్నాయి. ఇప్పటికే సేల్స్ ప్రారంభమై చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ సేల్స్, ఫ్లిప్ కార్ట్ లలో అందుబాటులో ఉన్న ఇండిపెండెన్స్ డే డీల్స్ గురించి ఇప్పుడు చూద్దాం..

యాపిల్ ఐ ఫోన్ 14 స్మార్ట్ ఫోన్.. విజయ్ సేల్స్ లో ప్రస్తుతం మెగా ఫ్రీడమ్ సేల్ జరుగుతోంది. దీనిలో ఐఫోన్ 14 128జీబీ స్టోరేజ్ వెర్షన్ రూ. 69,900కే లభిస్తోంది. అలాగే హెచ్ డీఎఫ్సీ కార్డు పై కొనుగోలు చేస్తే రూ. 4,000 ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్ చేంజ్ చేస్తే రూ. 15,000 వరకూ తగ్గింపుతో పాటు రూ. 8,000అదనపు ప్రయోజనాలు అందుతాయి. మొత్తంగా ఈ ఫోన్ 14 మీరు కేవలం రూ. 42,900కే సొంతం చేసుకోవచ్చు.

యాపిల్ ఐప్యాడ్(నైన్ట్ జెన్).. విజయ్ సేల్స్ మెగా ఫ్రీడమ్ సేల్ లోభాగంగా యాపిల్ ఐప్యాడ్ తొమ్మిదో జనరేషన్ రూ. 27,990కే లభిస్తోంది. దీనిలో 3.5ఎంఎం హెడ్ జాక్, లైట్నింగ్ పోర్టు ఉంటుంది. 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫస్ట్ జనరేషన్ యాపిల్ పెన్సిల్ కు సపోర్టు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మోటోరోలా జీ14 స్మార్ట్ ఫోన్.. ఫ్లిప్ కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ లో భాగంగా ఈ ఫోన్ కేవలం రూ. 9,999కే లభిస్తోంది. ఇది టీ616ఎస్ఓసీ ఆధారంగా పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. 50ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

గూగుల్ పిక్సల్ 6ఏ స్మార్ట్ ఫోన్.. గూగుల్ నుంచి వస్తున్న ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ ఇది. ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్ సేల్లో భాగంగా ఇది రూ. 26,999కే లభిస్తోంది. ఈ 5జీ కస్టమ్ టెన్సర్ చిప్ తో తయారైంది. ఈ-సిమ్ సపోర్టు ఉంటుంది. ఐపీ67 రేటింగ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14కి అప్ గ్రేడ్ అవుతుంది.

సోనీ హెచ్టీ-ఎస్20ఆర్ 5.1 అంగుళాల హోం థియేటర్.. దీనిపై ఫ్లిప్ కార్ట్ లో 20శాతం డిస్కౌంట్ ఉంది. 5.1 చానల్ స్పీకర్ సిస్టమ్ ఉంటుంది. సబ్ వూఫర్స్, రియర్ స్పీకర్స్, సౌండ్ బార్ ఉంటుంది. 400వాట్ల సౌండ్ ఉత్పత్తి చేస్తుంది. ఈ స్పీకర్స్ బ్లూ టూత్ సపోర్టు చేస్తుంది. ఇది స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్ల నుంచి డైరెక్ట్ గా మ్యూజిక్ ని ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒక్కో రన్‌కు రూ. 24.50 లక్షల సంపాదన.. ఒక్క తప్పుతో పంత్ జేబు ఖాళీ
ఒక్కో రన్‌కు రూ. 24.50 లక్షల సంపాదన.. ఒక్క తప్పుతో పంత్ జేబు ఖాళీ
అప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు స్టార్ విలన్..
అప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు స్టార్ విలన్..
కారుపై గోడ కూలి డ్యామెజ్‌ అయ్యిందా? నష్టాన్ని భర్తీ చేసుకోవడం ఎలా
కారుపై గోడ కూలి డ్యామెజ్‌ అయ్యిందా? నష్టాన్ని భర్తీ చేసుకోవడం ఎలా
మామిడి పండుతో కలిపి పెరుగు తింటున్నారా..? తింటే ఏమౌతుందో తెలిస్తే
మామిడి పండుతో కలిపి పెరుగు తింటున్నారా..? తింటే ఏమౌతుందో తెలిస్తే
అంపైర్‌ నిర్ణయాన్నే ప్రశ్నించిన ప్లేయర్.. కట్‌చేస్తే.
అంపైర్‌ నిర్ణయాన్నే ప్రశ్నించిన ప్లేయర్.. కట్‌చేస్తే.
TTD ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు భారీగా విరాళాలు..రూ.2 కోట్లు అందజేత!
TTD ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు భారీగా విరాళాలు..రూ.2 కోట్లు అందజేత!
IPL 2025: 4 గంటల్లో సూర్యకు ఇచ్చిపడేసిన కింగ్ కోహ్లీ..
IPL 2025: 4 గంటల్లో సూర్యకు ఇచ్చిపడేసిన కింగ్ కోహ్లీ..
భారత్‌ నిర్ణయాలతో కాళ్ల బేరానికి పాకిస్తాన్..! ఆ దేశాలతో రాయబారం
భారత్‌ నిర్ణయాలతో కాళ్ల బేరానికి పాకిస్తాన్..! ఆ దేశాలతో రాయబారం
మళ్లీ సాధారణ స్థితికి పహల్గామ్‌..పర్యాటకులు ఏమంటున్నారంటే!
మళ్లీ సాధారణ స్థితికి పహల్గామ్‌..పర్యాటకులు ఏమంటున్నారంటే!
విషవాయువుతో నిండిన బావిలో పడిన వ్యాన్‌.. 12 మంది మృత్యువాత..
విషవాయువుతో నిండిన బావిలో పడిన వ్యాన్‌.. 12 మంది మృత్యువాత..