Business Ideas: ఐదేళ్లలో బిలియనీర్! బిజినెస్ చిన్నది.. లాభం చాలా పెద్దది.. రూ. లక్షతో మొదలు పెట్టొచ్చు..
మంచి బిజినెస్ ఐడియా, సరైనా ప్లానింగ్, ప్లానింగ్ కు తగ్గా శ్రమ, ఎగ్జిక్యూషన్ ఉంటే ఇది సాధ్యమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. నిజమే మీరు కూడా అతి తక్కువ సమయంలో లక్షాధికారి కావొచ్చు. అది కూడా రూ. లక్షతోనే. కేవలం ఐదేళ్లలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అందుకోసం మీకు అవసరమైనదల్లా ఏంటంటే కాస్త ఓపిక. అవునండీ ఓపిక, దానికితోడు కష్టం ఉంటే ఈ బిజినెస్ లో రాణించడం సులువు. ఆ బిజినెస్ గురించి తెలుసుకుందాం రండి..
స్నేహితులతో సరదాగా మాట్లాడుకొనే సందర్భంలో తక్కువ సమయంలో కోట్లు కూడబెట్టాలిరా.. ఐదేళ్లలో లక్షాధికారి కావాలిరా అంటూ శపథాలు చేస్తూ ఉంటాం. అయితే ఆ శపథాలు ఆరోజుకి, నవ్వుకునేందుకు మాత్రమే సరిపోతాయి. అయితే మంచి బిజినెస్ ఐడియా, సరైనా ప్లానింగ్, ప్లానింగ్ కు తగ్గా శ్రమ, ఎగ్జిక్యూషన్ ఉంటే ఇది సాధ్యమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. నిజమే మీరు కూడా అతి తక్కువ సమయంలో లక్షాధికారి కావొచ్చు. అది కూడా రూ. లక్షతోనే. కేవలం ఐదేళ్లలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. అందుకోసం మీకు అవసరమైనదల్లా ఏంటంటే కాస్త ఓపిక. అవునండీ ఓపిక, దానికితోడు కష్టం ఉంటే ఈ బిజినెస్ లో రాణించడం సులువు. అప్పుడు ఆ బిజినెస్ మీ గురించి ప్రపంచం మాట్లాడటం ప్రారంభిస్తుంది. ఏంటా బిజినెస్? తెలుసుకుందాం రండి..
టమోటా ప్యూరీ స్టార్టప్..
నిన్నమొన్నటి వరకూ టామోటా ధర ఆకాశన్నంటింది. కేజీ రూ. 200 వరకూ కూడా వెళ్లింది. దీంతో సామాన్యులు టమోటాను కొనుగోలు చేయడం తగ్గించేశారు. అయితే ఇప్పుడు పరిస్థితి నెమ్మదిగా మామూలు స్థితికి వస్తోంది. టమోటా ధర అంత ఎక్కువ ఉన్నప్పుడు కూడా రెస్టారెంట్లు, హోటళ్లులో రేట్లు పెంచకుండా అదే రేటుకి టమోటాతో తయారు చేసే కూరలు, గ్రేవీ కర్రీలు ఎలా ఇవ్వగలిగారు? ఎప్పుడైనా ఆలోచించారా? వారేమైనా టమోటాలు తయారు చేస్తారా? లేదు కదా మరెలా సాధ్యమైంది? సింపుల్ టామోటాల స్థానంలో వారు టమోటా ప్యూరీని వినియోగిస్తారు. ఏంటి.. టమోటా ప్యూరీ అనే పదాన్నే మొదటి సారి వింటున్నారా? పదం మీరు వినడం మొదటి సారేమో గానీ హోటళ్లు, రెస్టారెంట్లలో ఇది తరచూ వినియోగిస్తారు. ఈ టమోటా ప్యూరీ అంటే ఏమిటంటే టమోటాలను పేస్ట్ చేసి భద్రపరుచుకోవడం, అవసరం అయినప్పుడు కూరలు, సాస్ లలో మిక్స్ చేయడం అంతే. ఈ బిజినెస్ కు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. చిన్న స్టార్టప్ లా కేవలం రూ. లక్షతో దీనిని ప్రారంభించవచ్చు. నెమ్మదిగా వ్యాపారం వృద్ధి చెందుతుంది. క్రమక్రమంగా వ్యాపారాన్ని అప్ గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఐదేళ్లలో మిలియనీర్ కావొచ్చు.
స్టెప్ బై స్టెప్ బిజినెస్ ప్లాన్..
టమోటా ప్యూరీ తయారు చేసే కంపెనీ నుంచి చిన్న ప్రాంఛైజీ తీసుకోండి. తక్కువ పెట్టుబడితో దీనిని ప్రారంభింవచ్చు. ఈ సమయంలోనే మీరు హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. మీకు లాభాల మార్జిన్ కూడా తక్కువగా ఉంటుంది. అయితే 1 సంవత్సరం పాటు కస్టమర్ల కోసం నిరంతరం వెతకడం ద్వారా మార్కెట్ మొత్తం మీ నియంత్రణలోకి వస్తుంది. ఎప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంటుందో, ఎప్పుడు తక్కువగా ఉంటుందో మీకు అర్థం అవుతుంది. ఎవరు ఎంత కొనుగోలు చేస్తున్నారు? వారికి ఏ నాణ్యత కావాలో కూడా మీకు తెలుస్తుంది. ఇలా రెండు సంవత్సరాలు బాగా శ్రమపడాల్సి ఉంటుంది.
- ఇక 3వ సంవత్సరంలో, టొమాటో ప్యూరీ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసి, మీ సొంత బ్రాండ్‌ను ప్రారంభించండి. దీని కోసం మీరు ప్రత్యేకంగా నిధిని వెతకాల్సిన పనిలేదు. లేదా అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే కేవలం రూ. 2 నుంచి 5 లక్షల రూపాయలతోనే ఈ కంపెనీని మీరు ప్రారంభించొచ్చు. అందుకోసం మీరు చేసిన రెండేళ్ల బిజినెస్ మీకు కొంత మొత్తాన్ని అందిస్తుంది. మీరు సంపాదించిన సొమ్ములో 25శాతం తిరిగి పెట్టుబడి పెట్టండి. అప్పటికే మీరు మార్కెట్లో తిరుగుతున్నారు కాబట్టి డిమాండ్, నాణ్యత గురించి మీకు ఓ ఐడియా వచ్చే ఉంటుంది. దాని కనుగుణంగా ప్లాన్ చేసుకొనే మీ సొంత బ్రాండ్ ను ప్రమోట్ చేసుకోడానికి ప్రయత్నించండి. కొంతకాలానికి ఇది స్థిరపడుతుంది. చాలా మంది వ్యక్తులు మీ ప్రవర్తన ఆధారంగా మీ నుండి వస్తువులను కొనుగోలు చేస్తారు.
- నాల్గో సంవత్సరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో మీ టొమాటో ఫ్యూరీ బ్రాండ్‌ను మార్కెట్ చేయండి . వీలైనంత వరకు డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను రూపొందించండి. వాటిని మార్కెట్‌లో ఏర్పాటు చేయడానికి వారితో కలిసి పని చేయండి. లాభాల మార్జిన్ తక్కువగా ఉంటుంది, కానీ ఇప్పుడు మీకు సమీపంలోని అనేక జిల్లాల్లో డీలర్‌షిప్ నెట్‌వర్క్ ఉంటుంది . కాబట్టి భారీ మొత్తంలో డిమాండ్ ఏర్పడుతుంది.
- ఐదో సంవత్సరంలో, యంత్రాలను కొనుగోలు చేయండి. మీ స్వంత టమోటా ప్యూరీని తయారు చేయడం ప్రారంభించండి. ఇప్పుడు మీ లాభాల మార్జిన్ ఎక్కువగా ఉంటుంది. మీ బ్రాండ్ స్థాపించబడింది. మీకు పెద్ద డీలర్‌షిప్ నెట్‌వర్క్ ఉంది. అంటే మీ యంత్రాలకు తగినంత పని ఉంది. ఎలాంటి గందరగోళానికి అవకాశం లేదు. నేటి పరిస్థితిలో యంత్రాల ధర దాదాపు 30 లక్షల రూపాయలు. 4 సంవత్సరాల తర్వాత దాదాపు 40 లక్షల రూపాయలు అవుతుంది. లేదా తగ్గే అవకాశమూ ఉంది. మీరు గత కొన్నేళ్లుగా వ్యాపారంలోనే ఉన్నారు కాబట్టి మీరు ఇంత మొత్తం సంపాదించే ఉంటారు. తద్వారా పెద్ద యంత్రాలను కొనుగోలు చేయడానికి మళ్లీ కొత్త అప్పుడు చేసి రిస్క్ చేయాల్సిన అసవరం ఉండదు. ఇప్పుడు రాబడి అధికంగా ఉంటుంది. అనుభవజ్ఞుడైన వ్యక్తి ఎప్పుడూ విఫలం కాడని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. కాబట్టి ఫీల్డ్ లో ఇప్పటికే మీరు పాతుకుపోయి ఉంటారు కాబట్టి నష్టాపోయే చాన్స్ చాలా తక్కువగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..