- Telugu News Photo Gallery Business photos Touch Independence Day 2023 offer: Free mobile will be given to those born in month of August 1947
Free Phone Offer: ఆగస్టు నెలలో పుట్టిన వారికి అదిరిపోయే ఆఫర్.. మొబైల్స్ ఫ్రీ!
మల్టీబ్రాండ్ రిటైల్ దిగ్గజం టచ్ మొబైల్స్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత ఫోన్ ఆఫర్ ప్రకటించింది. 1947 ఆగస్టు నెలలో జన్మించిన వారికి ఉచితంగా మొబైల్ ఇస్తున్నట్లు ప్రకటించింది.ఇండిపెండెన్స్ డే రోజున సమీపంలోని టచ్ స్టోర్‌ను సందర్శించి తమ ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని చూపిస్తే సరి. ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా ఫ్రీగా మొబైల్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది 77వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు దేశ వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా టచ్..
Updated on: Aug 15, 2023 | 2:18 PM

మల్టీబ్రాండ్ రిటైల్ దిగ్గజం టచ్ మొబైల్స్ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత ఫోన్ ఆఫర్ ప్రకటించింది. 1947 ఆగస్టు నెలలో జన్మించిన వారికి ఉచితంగా మొబైల్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

ఇండిపెండెన్స్ డే రోజున సమీపంలోని టచ్ స్టోర్‌ను సందర్శించి తమ ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని చూపిస్తే సరి. ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా ఫ్రీగా మొబైల్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

కాగా ఈ ఏడాది 77వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు దేశ వ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా టచ్ మొబైల్స్ కంపెనీ పలు ఆఫర్లను ప్రకటించింది. 1947 ఆగస్టు నెలలో జన్మించిన వారికి ఉచిత ఫోన్ ఆపర్‌తోపాటు అన్ని ప్రముఖ బ్రాండెడ్ ఫోన్లపై 50 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు పేర్కొంది.

అన్ని బ్రాండెడ్ యాక్ససరీస్‌లపై 77 శాతం రాయితీ ప్రకటించింది. 32 అంగుళాల ఎల్‌ఈడీ టీవీ ప్రారంభ ధర రూ.6,999, ఒప్పో బ్రాండ్‌కు చెందిన అన్ని మొబైల్ ఫోన్‌లపై 15 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఇస్తున్నట్లు ప్రకటించింది.

హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రిడిట్ కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్, సున్నా వడ్డీతో సులభ వాయిదా పద్ధతిలో ఫోన్లు పొందే అవకాశం కల్పించింది. అన్నట్టు ఈ ఆఫర్ ఆగస్టు 15, 2023 ఒక్కరోజే ఉంటుందండోయ్..





























