Gifts Tax: బహుమతులపై టాక్స్ ఎలా విధిస్తారు? ఆదాయపు పన్ను చట్టం ఏం చెబుతోంది?
బహుమతులపై టాక్స్ కూడా వాటిని ఎవరు ఇస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం కింద 'బంధువులు' కేటగిరీలోకి వచ్చే వ్యక్తుల నుంచి అందుకునే బహుమతులపై టక్స్ విధించరు. బహుమతి విలువతో సంబంధం లేకుండా.. భార్య బంధువు పరిధిలోకి వస్తుంది. అంటే భార్యకు షేర్లను బహుమతిగా ఇస్తే అతను లేదా అతని భార్య ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. భార్యతో పాటు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు.. తల్లిదండ్రులు, భార్య తల్లిదండ్రులు.. ఇతర వ్యక్తులు కూడా 'బంధువు'..
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు బహుమతులు టాక్స్ నుంచి మినహాయింపు ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఒక సంవత్సరంలో అందుకున్న అన్ని బహుమతుల మొత్తం విలువ రూ.50,000 కంటే తక్కువగా ఉంటే, అప్పుడు ఎటువంటి టాక్స్ విధించరు. రూ.50,000 కంటే ఎక్కువ విలువ ఉన్న గిఫ్ట్ తీసుకున్నపుడు ఆ బహుమతుల మొత్తంపై టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. డబ్బు, ఆస్తి, వాహనం, నగలు లేదా ఇతర చరాస్తులతో సహా షేర్లు రియల్ ఎస్టేట్ బహుమతిగా ఇవ్వవచ్చు. అయితే వాటికి బహుమతిని పొందిన వ్యక్తి టాక్స్ చెల్లించాలి.
బహుమతులపై టాక్స్ కూడా వాటిని ఎవరు ఇస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టం కింద ‘బంధువులు’ కేటగిరీలోకి వచ్చే వ్యక్తుల నుంచి అందుకునే బహుమతులపై టక్స్ విధించరు. బహుమతి విలువతో సంబంధం లేకుండా.. భార్య బంధువు పరిధిలోకి వస్తుంది. అంటే భార్యకు షేర్లను బహుమతిగా ఇస్తే అతను లేదా అతని భార్య ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. భార్యతో పాటు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు.. తల్లిదండ్రులు, భార్య తల్లిదండ్రులు.. ఇతర వ్యక్తులు కూడా ‘బంధువు’ వర్గంలో ఉన్నారు.
భార్య బహుమతిగా పొందిన షేర్లను విక్రయించినా లేదా డివిడెండ్‌ల నుంచి సంపాదించినా, ఖచ్చితంగా టాక్స్ ఉంటుంది. ఈ షేర్లను ఒక వ్యక్తి కొనుగోలు చేసి అతని భార్యకు ఇచ్చినందున, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 64 ప్రకారం క్లబ్‌బింగ్ నిబంధనలు వర్తిస్తాయి. బహుమతులు గా ఇచ్చిన షేర్ల విక్రయం వల్ల వచ్చే లాభం లేదా నష్టం అతని ఆదాయంలో కలుపుతారు. ఒకవేళ ఆశిష్ ఆదాయం అతని భార్యఆదాయం కంటే ఎక్కువగా ఉంటే కనుక ఆ వ్యక్తి దానిపై పన్ను చెల్లించాలి.
హోల్డింగ్ పీరియడ్ ప్రకారం టాక్స్ వర్తిస్తుంది.. లిస్టెడ్ షేర్లను కొనుగోలు చేసిన తేదీ నుంచి 12 నెలల కంటే తక్కువ వ్యవధిలో విక్రయించినట్లయితే, లాభంపై 15% చొప్పున స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను (STCG) చెల్లించాలి. 12 నెలల తర్వాత విక్రయిస్తే లాభంపై పన్ను విధిస్తారు. దీనిని దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. రూ.1 లక్ష కంటే ఎక్కువ లాభాలపై 10% పన్ను విధిస్తారు. ఈ రెండు సందర్భాల్లోనూ సెస్ – సర్‌చార్జి కూడా చెల్లించాల్సి ఉంటుంది.
అన్‌లిస్టెడ్ షేర్ల విషయంలో 24 నెలల కంటే తక్కువ సమయంలో అమ్మితే, లాభం స్వల్పకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. అయితే 24 నెలల తర్వాత విక్రయిస్తే అది దీర్ఘకాలిక మూలధన లాభంగా పరిగణిస్తారు. స్వల్పకాలిక విషయంలో ఇది స్లాబ్ రేటు వద్ద పన్ను విధిస్తారు. అయితే దీర్ఘకాలిక లాభం స్లాబ్ రేటు వద్ద పన్ను విధిస్తారు. ఇండెక్సేషన్ ప్రయోజనంతో 20% చొప్పున పన్ను చెల్లించాలి. మీరు షేర్లు కాకుండా ఇతర ఆస్తులను బహుమతిగా ఇచ్చినప్పుడు కూడా తప్పనిసరిగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. వేర్వేరు ఆస్తులకు హోల్డింగ్ వ్యవధి భిన్నంగా ఉంటుంది. షేర్‌లను ఆన్‌లైన్ – ఆఫ్‌లైన్‌లో రెండు రకాలుగా బహుమతిగా ఇవ్వవచ్చు. ఆఫ్‌లైన్ మోడ్‌లో దాత అంటే గిఫ్ట్ ఇచ్చిన వారు డెలివరీని పూర్తి చేయాలి. ఇన్‌స్ట్రక్షన్ స్లిప్ (DIS) మీ బ్రోకర్‌కి ఇవ్వండి. కొంతమంది బ్రోకర్లు బహుమతి కోసం e-DIS సదుపాయాన్ని అందిస్తారు. ఇందులో కంపెనీ పేరు, షేర్ల సంఖ్య, బహుమతి తీసుకున్న వారి డీమ్యాట్ ఎకౌంట్ వివరాలు ఇవ్వాలి. పెళ్లి సందర్భంగా వధూవరులు అందుకునే బహుమతులు పూర్తిగా పన్ను రహితం. కానీ, స్నేహితుల నుంచి అందుకునే బహుమతులపై టాక్స్ విధిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి