AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Accounts: ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే ఫెనాల్టీ బాదుడు.. అసలు క్లారిటీ ఇదే

ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా ఖాతా తీసుకోవడం అనేది పరిపాటిగా ఉంది. ప్రతి ఒక్కరికీ రెండు నుంచి నాలుగు బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే ఇటీవల సోషల్ మీడియా ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే చట్టవిరుద్ధమని, ఆర్‌బీఐ భారీగా జరిమానాలను విధిస్తుందని పలు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Bank Accounts: ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే ఫెనాల్టీ బాదుడు.. అసలు క్లారిటీ ఇదే
Bank Accounts
Nikhil
|

Updated on: Dec 15, 2024 | 4:43 PM

Share

భారతదేశంలో బహుళ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండటం చట్టవిరుద్ధమని, భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఇప్పుడు బహుళ బ్యాంక్ ఖాతాలు లేదా ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో బ్యాంక్ ఖాతాలు ఉన్న వ్యక్తులపై పెనాల్టీ విధిస్తారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలన్నీ ఫేక్ అని నిపుణులు చెబుతున్నారు. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో బహుళ బ్యాంకు ఖాతాలు లేదా బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న వ్యక్తులపై ఆర్‌బీఐ ఎలాంటి జరిమానా విధించదు. వాస్తవాలను తనిఖీ చేసిన తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇటీవల తన ఫేక్ న్యూస్ హెచ్చరికను విడుదల చేసింది. ఈ మేరకు అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది.

ఆర్‌బీఐ జరిమానా విషయంలో వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని, ఆర్‌బీఐ ఈ మేరకు ఎలాంటి మార్గదర్శకాలను రిలీజ్ చేయలేదని స్పష్టం చేసింది. ఇలాంటి ఫేక్ న్యూస్‌పై మీరు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. బహుళ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న వ్యక్తులకు జరిమానా విధించాలని ఆర్‌బిఐ యోచిస్తున్నట్లు ఇటీవలి వైరల్ వార్తలు నకిలీవని స్పష్టమైంది.

కాబట్టి బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేసే విషయంలో  ఆందోళన చెందవద్దని నిపుణులు చెబుతున్నారు. ఈ వార్తలను బట్టి ఒక వ్యక్తి లేదా అతని కుటుంబం ఉంచుకోగల బ్యాంకు ఖాతాల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదని స్పష్టం చేసింది. అయితే ప్రజలు తమ బ్యాంకు ఖాతాల సంఖ్యను గరిష్టంగా 2 లేదా 3కి పరిమితం చేయాలని సలహా ఇస్తున్నారు, ఎందుకంటే ఎటువంటి ప్రయోజనం లేకుండా ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండటం కష్టం. అంతేకాకుండా అన్ని ఖాతాలలో కనీస బ్యాంక్ బ్యాలెన్స్‌ని కూడా ఉంచుకోవాలి. లేని పక్షంలో ఏ బ్యాంకులు నాన్-మెయింటెనెన్స్ ఛార్జీలు విధించే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి