Jio New Plan: అదిరిపోయే బెనిఫిట్స్.. జియో న్యూ ఇయర్ ప్లాన్.! వీడియో..
రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను తీసుకువస్తోంది. కొద్ది రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ ఇప్పటి నుంచే ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువస్తోంది. జియో తన వినియోగదారుల కోసం ప్రత్యేకమైన ‘న్యూ ఇయర్ వెల్కమ్ ప్లాన్ రూ.2025’ ను ఆవిష్కరించింది. డిసెంబర్ 11, 2024 నుండి జనవరి 11, 2025 వరకు రీఛార్జ్ కోసం అందుబాటులో ఉండే ఈ ప్లాన్ వినియోగదారులకు భారీగా సేవింగ్స్, అదనపు ప్రయోజనాలను అందిస్తుంది.
రూ.2025 ధరతో అందించే ఈ ప్లాన్‌లో.. అన్‌లిమిటెడ్ 5జీ యాక్సెస్ 200 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2.5 జీబీ డేటాతో మొత్తం 500 GB 4జీ డేటా ను అందిస్తోంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తోపాటు అన్‌లిమిటెడ్ ఎస్‌ఎమ్మెస్‌లు కూడా చేసుకోవచ్చు. పార్టనర్ కూపన్ల రూపంలో రూ.2150 విలువైన అదనపు ప్రయోజనాలు ఇందులో ఉంటాయి. ఈ ప్లాన్ నెలవారీ రూ.349 ప్యాకేజీతో పోలిస్తే రూ.468 పొదుపు చేసుకోవచ్చు. రూ.2025 ప్లాన్‌ను తీసుకునే వినియోగదారులు ప్రత్యేక ఆఫర్లుగా రూ.500 AJIO కూపన్‌ను కనిష్ట కొనుగోలు రూ.2500 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలుపై ఉపయోగించవచ్చు. స్విగ్గీపై రూ.150 తగ్గింపు పొందవచ్చు. అయితే కనిష్ట ఆర్డర్ రూ.499 పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈజ్ మై ట్రిప్ పై రూ.1500 తగ్గింపు లభిస్తుంది. మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఫ్లైట్ బుకింగ్ చేసుకునేవారికి ఇది వర్తిస్తుంది. ఈ ఆఫర్ పరిమిత కాలానికి అందుబాటులో ఉంది. డిసెంబర్ 11, 2024 నుండి జనవరి 11, 2025 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. వినియోగదారులు జియో వెబ్‌సైట్, యాప్ లేదా ఆథరైజ్డ్ రీటైలర్ల ద్వారా రీఛార్జ్ చేయవచ్చు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

