Paytm IPO: పేటీఎం ఐపీఓతో కోటీశ్వరులుగా మారనున్న 350 ఉద్యోగులు .. భారీగా లాభపడ్డ ఎంప్లాయీస్‌..!

Paytm IPO: భారతీయ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్‌ సిద్దార్ధ్ పాండే దేశంలోనే అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ తర్వాత మిలియనీర్‌గా నిలిచారు. నవంబర్‌ 18న స్టాక్‌ మార్కెట్‌ జాబితా అయిన వెంటనే భారత్‌లో దాదాపు 350..

Paytm IPO: పేటీఎం ఐపీఓతో కోటీశ్వరులుగా మారనున్న 350 ఉద్యోగులు .. భారీగా లాభపడ్డ ఎంప్లాయీస్‌..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 13, 2021 | 9:17 PM

Paytm IPO: భారతీయ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీర్‌ సిద్దార్ధ్ పాండే దేశంలోనే అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ తర్వాత మిలియనీర్‌గా నిలిచారు. నవంబర్‌ 18న స్టాక్‌ మార్కెట్‌ జాబితా అయిన వెంటనే భారత్‌లో దాదాపు 350 మంది కోటీశ్వరులుగా మారారు. పేటీఎం 2.5 డాలర్‌ బిలియన్‌ ఐపీవో తర్వాత దాదాపు 350 మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగులు ప్రతి ఒక్కరు కనీసం 10 మిలియన్‌ భారతీయ రూపాయల నికర విలువను కలిగి ఉన్నారని రాయిటర్స్‌ తెలిపింది. దీంతో స్టాక్‌ మార్కెట్‌లో జాబితాయిన వెంటనే భారత్‌లో దాదాపు 350 మంది కోటీశ్వరులుగా మారనున్నారు.

పేటీఎం రూ.18,300 కోట్లతో ఐపీవోకు వస్తోంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద రూ.10 వేల కోట్ల షేర్లను విక్రయాలు చేస్తోంది. ఇక మిగతవి రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఇష్యూ చేస్తోంది. ఒక్కో షేరు ధర రూ.2150గా ఉంది. ఈ ఐపీవోతో పేటీఎంలో పనిచేస్తున్న, గతంలో పనిచేసిన 350 మంది లక్ష నుంచి పది లక్షల డాలర్ల వరకు అధిపతులు కాబోతున్నారు. దాంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  అయితే పేటీఎంలో గతంలో పని చేసిన ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు కోటీశ్వరులు కానున్నారు. వీరిలో ఎక్కువ మంది పేటీఎంలలో ఎక్కువ మొత్తంలో షేర్లు ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ సందర్భంగా గతంలో పేటీఎంలో పనిచేసిన సిద్ధార్థ్‌ పాండే అనే ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీర్‌ ఆయన అనుభవాన్ని పంచుకున్నారు. తొమ్మిదేళ్ల క్రిందట ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎంలో చేరడానికి తన తండ్రి వ్యతిరేకించాల్సి వచ్చిందన్నారు. పేటీఎంలో పని చేస్తున్నానని తెలిసి మా నాన్న నిరాశకు చెందారు. కానీ, ఆయన ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. పైగా ఇప్పుడు దానిలోనే ఉండిపో అని కూడా సూచిస్తున్నాడు అని ఆయన తెలిపారు. పేటీఎంలో తన ఏడేళ్ల పని తనకు పదివేల షేర్లను మిగిల్చిందని చెప్పుకొచ్చారు. అయితే దేశంలోనే అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూ ఇటీవల సంచలన సృష్టించింది పేటీఎం ఐపీవో ఎంతో మంది జీవితాలను మార్చేసింది.

ఇవి కూడా చదవండి:

Mobile App: మొబైల్‌ యాప్స్‌ డౌన్‌లోడ్‌లలో చైనా తర్వాత భారత్‌ 2వ స్థానం.. ఎక్కువగా డౌన్‌లోడ్‌ చేసిన యాప్స్‌ ఇవే..!

RBI Curbs: మరో బ్యాంకుపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆంక్షలు.. ఇక నుంచి ఈ బ్యాంకు నుంచి ఖాతాదారులు రూ.1000 కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు..!