Paytm: మీ ఫోన్‌లో పేటీఎమ్ యాప్ ఉందా.? రూ. 100 క్యాష్ బ్యాక్ పొందే అవకాశం.
ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ యాప్స్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. టీ స్టాల్ నుంచి పెద్ద పెద్ద హోటల్స్ వరకు యూపీఐ పేమెంట్స్‌ను స్వీకరిస్తారు. దీంతో డిజిటల్ పేమెంట్ సంస్థల మధ్య పోటీ పెరిగింది. ఈ పోటీని తట్టుకునే క్రమంలోనే యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. కొంగొత్త ఫీచర్లు, ఆఫర్లతో..
ప్రస్తుతం డిజిటల్ పేమెంట్ యాప్స్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. టీ స్టాల్ నుంచి పెద్ద పెద్ద హోటల్స్ వరకు యూపీఐ పేమెంట్స్‌ను స్వీకరిస్తారు. దీంతో డిజిటల్ పేమెంట్ సంస్థల మధ్య పోటీ పెరిగింది. ఈ పోటీని తట్టుకునే క్రమంలోనే యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. కొంగొత్త ఫీచర్లు, ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ డిజిల్ పేమెంట్ సంస్థ పేటీఎమ్ యూజర్లకు యూపీఐ లైట్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.
ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు పేమెంట్ చేసిన ప్రతిసారీ పిన్‌ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక్క ట్యాప్ ద్వారా రూ. 200, రోజుకు రెండు సార్లు రూ. 2 వేల వరకు లావాదేవీలు చేసుకోవచ్చు. అత్యంత వేగంగా యూపీఐ లావాదేవీలను పేటీఎమ్‌తో చేసుకోవచ్చని, ఇలాంటి ఫీచర్‌ను అందిస్తున్న ఏకైక ప్లాట్‌ఫారమ్ తమదేనని పేటీఎం పేర్కొంది. కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో సహా తొమ్మిది బ్యాంకులు ప్రస్తుతం పేటీఎం లైట్ సర్వీసులకు మద్దతు ఇస్తున్నాయి.
Very proud of launching with @UPI_NPCI our latest in commitment to payments that are scalable and never fail. Upgrade your UPI experience by switching to @Paytm App ! Here payments never fail, tx are super fast and you don’t see clutter in your bank statement! All this ?? pic.twitter.com/c1tr7J4V3A
— Vijay Shekhar Sharma (@vijayshekhar) February 24, 2023
ఇక పేమెంట్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకునుంచి ఎస్‌ఎంఎస్, పేమెంట్స్ హిస్టరీ అందిస్తారు. ఇదిలా ఉంటే యూపీఐ లైట్‌ను తొలిసారి యాక్టివేట్ చేసుకున్న వారికి ప్రత్యేకంగా రూ. 100 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. దీంతోపాటు పేటీఎమ్ క్యాన్సిల్ ప్రొటెక్ట్ అనే మరో ఫీచర్‌ను సైతం తీసుకొచ్చింది. దీని ద్వారా విమాన, బస్సు టిక్కెట్ల క్యాన్సిలేషన్‌పై 100 శాతం రీఫండ్ అందిస్తుంది. ఫ్లైట్ టికెట్ బుకింగ్ కోసం రూ. 149, బస్ టికెట్ కోసం రూ. 25 చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..