AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Shopping: మీకు తెలియకుండానే బిల్లు పెంచేస్తారు! ఆన్‌లైన్ షాపింగ్‌లో కొత్త మోసాలు! జాగ్రత్తలు ఇలా..

ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు మనకు తెలియకుండానే మనల్ని తప్పుదోవ పట్టించేలా వెబ్‌సైట్స్ వ్యవహరిస్తున్నాయని ఇటీవల కొందరు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. అసలు ఆన్‌లైన్ షాపింగ్ లో ఎలాంటి మోసాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Online Shopping: మీకు తెలియకుండానే బిల్లు పెంచేస్తారు! ఆన్‌లైన్ షాపింగ్‌లో కొత్త మోసాలు! జాగ్రత్తలు ఇలా..
Online Shopping
Nikhil
|

Updated on: Oct 25, 2025 | 4:59 PM

Share

ఇ-కామర్స్‌ సంస్థలు చాలా తెలివిగా కస్టమర్లను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తాయి. ఇవన్నీ మార్కెటింగ్ జిమ్మిక్కుల వంటివే అయినా సరైన అవగాహన లేని వాళ్లు మోసపోయే ప్రమాదముంది. ఆన్ లైన్ షాపింగ్ చేసే సమయంలో కస్టమర్ల మైండ్ ను ప్రభావితం చేసే విధంగా సంస్థలు కొన్ని ట్రిక్స్ ను ఉపయోగిస్తాయి. కస్టమర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేయడం, వారిని గందరగోళానికి గురిచేయడం, బలవంతంగా షాపింగ్‌ చేయించడం.. ఇలా ఇందులో రకరకాల ట్రిక్స్ ఉన్నాయి. అవెలా ఉంటాయి? వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో  ఇప్పుడు చూద్దాం.

ఫాల్స్‌ అర్జెన్సీ

ఆలస్యించిన ఆశాభంగం అంటుంటారు కదా! అదే తరహా ట్రిక్ ఇది. ఈ వస్తువును ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పటికీ కొనలేరని, ఆఫర్‌ మిస్ అయితే ఇక ఎప్పటికీ తక్కువ ధరలో దొరకదు అన్నట్టుగా కస్టమర్లను ఫాల్స్ అర్జెన్సీలోకి నెడతారు.

బాస్కెట్ స్నీకింగ్‌

కావాల్సిన వస్తువులు కార్టలో యాడ్ చేసుకుని పేమెంట్ దగ్గరకు వచ్చాక కార్ట్ కొన్ని అదనపు వస్తువులు కనిపిస్తాయి. యూజర్ల అనుమతి లేకుండానే డొనేషన్‌, చారిటీ లేదా ఎక్స్‌టెండెడ్ వారంటీ అంటూ కొన్ని ప్రొడక్ట్స్ ను యాడ్ చేస్తారు. కస్టమర్ చూసుకోకపోతే వాటికి కూడా కలిపి పేమెంట్ చేసేస్తాడు. ఈ తరహా ట్రిక్ ను బాస్కెట్ స్నీకింగ్ అంటారు.

బెయిట్ అండ్ స్విచ్

ముందుగా ఒక వస్తువుని తక్కువ ధరకు లిస్ట్ చేసి.. తీరా దాన్ని కొనే సమయంలో అది అందుబాటులో లేదని దాన్ని పోలి ఉన్న మరో ప్రోడక్టును కొనేలా ట్రిక్ ప్లే చేస్తారు. దీన్నే బెయిట్ అండ్ స్విచ్ అంటారు.

ఫోర్స్‌డ్‌ యాక్షన్‌

కస్టమర్ల చేత బలవంతంగా కొన్ని వస్తువులను కొనేలా చేసే ట్రిక్ ఇది. ఉదాహరణకు వారెంటీ, సబ్‌స్క్రిప్షన్‌ వంటివి తీసుకోకుండా ఆ ప్రొడక్ట్ కొనడానికి వీలుండదు. అలగే కొన్ని ప్రొడక్ట్స్ ను రెండు లేదా అంతకంటే ఎక్కువ క్వాంటిటీలోనే కొనాలి. ఇలా బలవంతంగా కొనేలా చేయడాన్ని ఫోర్స్‌డ్‌ యాక్షన్‌ ట్రిక్ అంటారు.

ఇవి కూడా..

ఇకపోతే వీటితో పాటు తమ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకోమని, నోటిఫికేషన్లు ఆన్ చేసుకోమని అడగడం, అలాగే ఏదైనా వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే సేవల కోసం సైన్‌అప్ చేసుకోమని అడగడం, మెయిల్ ఐడి తీసుకుని ప్రమోషనల్ మెయిల్స్ పంపడం.. ఇలా ఆన్ లైన్ మోసాల్లో చాలానే రకాలున్నాయి. యూజర్లు వీటి గురించి తెలుసుకుని వీలైనంత వరకూ వీటి బారిన పడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. లేకపోతే మోసపోయే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి