AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OnePlus Ace 6: వన్‌ప్లస్ నుంచి కొత్త ప్రీమియం ఫోన్! దిమ్మ తిరిగే ఫీచర్లు!

అక్టోబర్ 27 న వన్‌ప్లస్ నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ మొబైల్ రిలీజ్ అవ్వబోతోంది. వన్‌ప్లస్ ఏస్ 6 (OnePlus Ace 6) పేరుతో చైనాలో లాంఛ్ అయ్యే ఈ మొబైల్ ప్రపంచవ్యాప్తంగా OnePlus 15R పేరుతో అందుబాటులోకి వస్తుంది. ఈ మొబైల్ గురించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.

OnePlus Ace 6:  వన్‌ప్లస్ నుంచి కొత్త ప్రీమియం ఫోన్! దిమ్మ తిరిగే ఫీచర్లు!
Oneplus Ace 6
Nikhil
|

Updated on: Oct 26, 2025 | 3:43 PM

Share

వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ ఏస్ 6 పేరుతో కొత్త మొబైల్ లాంచ్ అవ్వనుంది. వన్‌ప్లస్ కంపెనీ ఈ కొత్త మొబైల్‌ను అల్ట్రా-పెర్ఫార్మెన్స్ ఫ్లాగ్‌షిప్ డివైజ్‌గా అభివర్ణించింది. ఈ ఫోన్‌లో చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నట్టు సమాచారం.  ముందుగా ఈ ఫోన్ చైనా మార్కెట్​లో లాంచ్ అవుతుంది. ఆ తర్వాత భారత్​లో దీని రీబ్రాండెడ్ వెర్షన్‌ను OnePlus 15R  పేరుతో లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇందులో అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌, లెటెస్ట్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్‌‌ వంటివి ఉండనున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

ఫీచర్లు..

వన్‌ప్లస్ ఏస్ 6 లో  6.83 ఇంచెస్ BOE OLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది1.5K రిజల్యూషన్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగ ఈ డిస్ ప్లే.. 165Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అంటే 60Hz, 90Hz, 120Hz, 144Hz, 165Hz రిఫ్రెష్ రేట్‌లలో నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.  ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ పై పనిచేస్తుంది. ఈ మొబైల్ మిడిల్ మెటల్ ఫ్రేమ్ డిజైన్ తో వస్తుంది.  IP68 వాటర్ ప్రూఫ్ రేటింగ్ కలిగి ఉంటుంది. Android 16 సాఫ్ట్ వేర్ పై రన్ అవుతుంది.

ధరలు

ఇక కెమెరాల విషయానికొస్తే.. ఇది 50MP + 8MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 7,800mAh ఉంటుంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్.. బ్లాక్, ఫ్లాష్ వైట్, సిల్వర్ వంటి మూడు రంగులలో లభిస్తుంది. దీని బరువు 213 గ్రాములు ఉండవచ్చు. ఇక ధరల విషయానికొస్తే.. లాంచింగ్ ప్రైస్ సుమారు రూ.40,000 ఉండొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.