- Telugu News Photo Gallery Business photos Bank Loan rules If the borrower dies, who will pay the interest Understand that bank rule
Bank Loan: రుణం తీసుకున్న వ్యక్తి చనిపోతే ఎవరు చెల్లిస్తారు? బ్యాంకు నియమాలు ఏంటి?
Bank Loan: చట్టబద్ధమైన వారసుడికి రుణం తిరిగి చెల్లించమని బ్యాంకు ఒత్తిడి తీసుకురావచ్చా? అంటే అవుననే చెప్పాలి. చట్టబద్ధమైన వారసుడు ఆస్తిపై హక్కును క్లెయిమ్ చేస్తే, బ్యాంకు ఆ వ్యక్తికి రుణ బాధ్యత గురించి తెలియజేస్తుంది. ఆ వ్యక్తి చట్టబద్ధమైన వారసుడు..
Updated on: Oct 26, 2025 | 8:30 PM

Bank Loan: వాహనం, ఇల్లు లేదా ఇతర వస్తువుల కోసం రుణం తీసుకోవడం ఒక సాధారణ విషయంగా మారింది. రుణం ఇచ్చే ముందు బ్యాంకులు ఆ వ్యక్తి ఆర్థిక చరిత్ర, అతని ఆదాయం, రుణం తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. కానీ రుణగ్రహీత మరణిస్తే రుణాన్ని ఎవరు తిరిగి చెల్లించాలి? రుణంపై వడ్డీని ఎవరు చెల్లించాలి అనే ప్రశ్న చాలా మందికి వస్తుంటుంది. ఈ రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంటుంది. దీని గురించి బ్యాంకు నియమాలు ఏం చెబుతున్నాయి?

రుణగ్రహీత మరణిస్తే బ్యాంకు ముందుగా సహ-దరఖాస్తుదారుడిని సంప్రదిస్తుంది. గృహ రుణాలు, విద్యా రుణాల కోసం దరఖాస్తులో సహ-దరఖాస్తుదారుడి పేరు ఉంటుంది. తరచుగా దీని కోసం ఉమ్మడి రుణ ఖాతా ఉంటుంది. సహ-రుణగ్రహీత రుణాన్ని తిరిగి చెల్లించలేకపోతే బ్యాంకు హామీదారుని సంప్రదిస్తుంది.

హామీదారుడు కూడా రుణం తిరిగి చెల్లించడానికి నిరాకరిస్తే, బ్యాంకు మరణించిన వ్యక్తి చట్టపరమైన వారసుడిని సంప్రదిస్తుంది. ఇందులో మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు లేదా అతని తల్లిదండ్రులు ఉన్నారు. రుణం తిరిగి చెల్లించమని బ్యాంకు వారికి నోటీసు ఇస్తుంది. రిమైండర్‌లను పంపుతుంది. ఈ ప్రక్రియలో ఎటువంటి ప్రతిస్పందన లేకపోతే చట్టపరమైన చర్య తీసుకుంటారు.

బ్యాంకు ఎప్పుడు ఆస్తిని జప్తు చేయవచ్చు?: సహ-దరఖాస్తుదారులు, హామీదారులు లేదా చట్టపరమైన వారసులు ఎవరూ రుణం తిరిగి చెల్లించడానికి సిద్ధంగా లేకుంటే, బ్యాంకు మరణించిన వ్యక్తి ఆస్తిని స్వాధీనం చేసుకుని విక్రయిస్తుంది. గృహ రుణాల విషయంలో బ్యాంకు నేరుగా మరణించిన వ్యక్తి ఆస్తి, బంగ్లా, ఫ్లాట్, ఇంటిని స్వాధీనం చేసుకుంటుంది. ఈ ఇంటిని వేలంలో అమ్ముతారు. బ్యాంకు దాని నుండి మంచి లాభం పొందుతుంది. వాహన రుణం ఉంటే బ్యాంకు వాహనాన్ని వేలం ద్వారా విక్రయిస్తుంది. వ్యక్తిగత రుణం విషయంలో బ్యాంకు మరణించిన వ్యక్తి ఆస్తులను అమ్మడం ద్వారా రుణాన్ని తిరిగి చెల్లిస్తుంది.

రుణ బీమా ఉంటే ఏం జరుగుతుంది?: మరణించిన వ్యక్తి రుణానికి బీమా చేసి ఉంటే అతని మరణం తర్వాత బీమా కంపెనీ మొత్తం రుణాన్ని చెల్లిస్తుంది. అతని కుటుంబం ఒక్క రూపాయి భారాన్ని మోయాల్సిన అవసరం లేదు. చట్టబద్ధమైన వారసుడికి రుణం తిరిగి చెల్లించమని బ్యాంకు ఒత్తిడి తీసుకురావచ్చా? అంటే అవుననే చెప్పాలి. చట్టబద్ధమైన వారసుడు ఆస్తిపై హక్కును క్లెయిమ్ చేస్తే, బ్యాంకు ఆ వ్యక్తికి రుణ బాధ్యత గురించి తెలియజేస్తుంది. ఆ వ్యక్తి చట్టబద్ధమైన వారసుడు కాకపోతే రుణం తిరిగి చెల్లించమని అతనిపై ఎటువంటి ఒత్తిడి ఉండదు. కానీ అతనికి ఆస్తిపై క్లెయిమ్ ఉంటే అతను రుణం తిరిగి చెల్లించడానికి బ్యాంకుతో సహకరించాలి.





