OnePlus 10T: సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న వ‌న్‌ప్లస్ 10టీ 5జీ డిజైన్.. 150డ‌బ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ స‌పోర్ట్‌తో రానున్న ఫోన్..

వ‌న్‌ప్లస్ 10టీ 5జీ డిజైన్ ఫొటో ఆన్‌లైన్ హల్‌చల్ చేస్తుంది. ఈ ఫొన్‌కు సంబంధించి డిజైన్‌ వివ‌రాలు ఆన్‌లైన్‌లో లీక‌య్యాయి. వ‌న్‌ప్లస్ 10 ప్రొ 5జీ త‌ర్వాత వ‌న్‌ప్లస్ 10 సిరీస్‌లో ఈ ప్రీమియం ఫోన్ మార్కెట్‌లోకి రానుంది...

OnePlus 10T: సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న వ‌న్‌ప్లస్ 10టీ 5జీ డిజైన్.. 150డ‌బ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ స‌పోర్ట్‌తో రానున్న ఫోన్..
One Plus 10t
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 16, 2022 | 11:14 AM

వ‌న్‌ప్లస్ 10టీ 5జీ డిజైన్ ఫొటో ఆన్‌లైన్ హల్‌చల్ చేస్తుంది. ఈ ఫొన్‌కు సంబంధించి డిజైన్‌ వివ‌రాలు ఆన్‌లైన్‌లో లీక‌య్యాయి. వ‌న్‌ప్లస్ 10 ప్రొ 5జీ త‌ర్వాత వ‌న్‌ప్లస్ 10 సిరీస్‌లో ఈ ప్రీమియం ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. వ‌న్‌ప్లస్ 10టీ 5జీ ప్రొడ‌క్షన్‌ జులైలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. లేటెస్ట్ వ‌న్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఈ నెలాఖ‌రున ఖ‌రార‌వుతుంద‌ని టెక్ నిపుణుడు యోగేష్ బ్రార్ చెప్పారు. ఇక ఆన్‌లైన్‌లో లీకైన వ‌న్‌ప్లస్ 10టీ 5జీ డిజైన్ ప్రకారం లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ వ‌న్‌ప్లస్ 10 ప్రొను పోలిఉంటుంది తెలుస్తుంది. కెమెరా మాడ్యూల్ డిజైన్ వ‌న్‌ప్లస్ 10ప్రొ త‌ర‌హాలో ఉంటుంది. ఎల్ఈడీ మాడ్యూల్ పొజిష‌న్ స్థానంలో లెన్స్ ఉంటాయి. 150 డ‌బ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌తో 4800ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం క‌లిగి ఉంటుంది.

ఎఫ్‌\1.8 అపెర్చర్‌తో 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌766 మెయిన్ కెమెరాతో వ‌న్‌ప్లస్ 10టీ 5జీ క‌స్టమ‌ర్లకు అందుబాటులోకి రానుంది. 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ మ్యాక్రో కెమెరా, సెల్ఫీల కోసం ఫోన్ ముందుభాగంలో 16ఎంపీ కెమెరా ఉంటుందని తెలిసింది. 6.7 ఇంచ్ పుల్ హెచ్‌డీ+ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను క‌లిగి ఉంటుంది. ఇక వ‌న్‌ప్లస్ 10టీ 5జీ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజ‌న్ ఓఎస్ 12పై ర‌న్ వర్క్ చేస్తుంది. అయితే ఈ ఫోన్‌ డిజైన్‌ ఎలా లీక్‌ అయిందో తెలియడం లేదని కంపెనీ చెబుతోంది.