Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. రాణిస్తున్న ఆర్థిక రంగ షేర్లు..
స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 9.16 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 506.41 పెరిగి 53047.80 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్ఈ నిఫ్టీ 142.40 పాయింట్లు వృద్ధి చెంది 15834.60 వద్ద ట్రేడవుతోంది...
స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 9.16 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 506.41 పెరిగి 53047.80 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్ఈ నిఫ్టీ 142.40 పాయింట్లు వృద్ధి చెంది 15834.60 వద్ద ట్రేడవుతోంది. ఆర్థిక రంగ షేర్లు బ్యాకింగ్, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు రాణిస్తున్నాయి. రూపాయి కూడా డాలర్‌తో పోలిస్తే పెరిగింది. 78.07 వద్ద ట్రేడవుతోంది. అటు అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచింది. 0.75 బేసిస్ పాయింట్లను పెచింది. దీంతో అంతర్జాతీయంగా మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్‌ండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ లాభాల్లో ఉండగా.. ఓఎన్‌జీసీ, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, డా. రెడ్డీస్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.