CASHe: వాట్సాప్‌లో ఇట్టా ‘Hi’ అని మెసేజ్ పెడితే చాలు.. క్షణాల్లో లోన్ అట్టా మంజూరవుద్ది.. డిటేల్స్ ఇవిగో
లోన్ సేవను ఇంకాస్త సులభతరంగా అందుబాటులోకి తెచ్చింది ముంబైకి చెంది ఫిన్‌టెక్ సంస్థ క్యాష్‌ఈ. కేవలం వాట్సాప్‌లో హాయ్ అని చెబితే చాలు. నిమిషాల వ్యవధిలో లోన్ వచ్చేస్తది.
Personal loan platform: లోన్ కావాలంటే ఒకప్పుడు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇంకా చాలా డాక్యూమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉండేది. బ్యాంక్ మేనేజర్ కాళ్లా, వేళ్లా పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ వ్యవహారమంతా లేదు. బ్యాంక్ యాప్‌లోకి లాగిన్ అయ్యి మన వివరాలు అప్‌డేట్ చేస్తే.. మనకు ఎంత లోన్ మంజూరు అవుతుంది.. ఎంత ఇంట్రస్ట్ రేట్ అనేది ఇట్టే తెలిసిపోతుంది. మీ సిబిల్ స్కోర్ బాగుంటే బ్యాంకు సిబ్బందే ఫోన్ చేసి.. డాక్యుమెంటేషన్ లేకుండా నిమిషాల వ్యవధిలో లోన్ మంజూరు చేస్తున్నారు. అయితే లోన్ సేవను ఇంకాస్త అందుబాటులోకి తెచ్చింది ముంబైకి చెంది ఫిన్‌టెక్ సంస్థ క్యాష్‌ఈ (CASHe). కేవలంవాట్సాప్‌లో హాయ్ (Hi) అని చెబితే చాలు. ఎటువంటి మొబైల్ అప్లికేషన్లు డౌన్‌లోడ్ చేయకుండా.. ఎలాంటి డాక్యుమెంట్లు పూర్తి చేయకుండానే లోన్ ఇస్తామని చెబుతోంది. టెక్నాలజీ సాయంతో అందిస్తున్న ఈ సౌకర్యాన్ని తొలిసారి తామే ప్రవేశపెట్టినట్లు క్యాష్‌ఈ తెలిపింది. ఇన్‌స్టంట్ క్రెడిట్ లైన్ పొందేందుకు క్యాష్‌ఈ సంస్థ ఓ వాట్సాప్ నంబర్‌ను పెట్టింది. 80975 53191 అనే నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు వెంటనే చాట్ బాట్ నుంచి మీకు రిప్లై వస్తుంది. మీరు అందించే వివరాలను సరిపోల్చుకుని కొన్ని క్లిక్కుల్లోనే లోన్ మొత్తాన్ని అందిస్తుంది. అయితే, కేవలం ఉద్యోగులకు మాత్రమే ఈ సదుపాయం అందిస్తున్నట్లు ఆ సంస్థ స్పష్టం చేసింది. 2016లో సంస్థ కార్యకలాపాలు ప్రారంభమవ్వగా.. దేశవ్యాప్తంగా 3 లక్షల మందికి సుమారు రూ.2వేల కోట్ల మేర లోన్స్ అందించినట్లు ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
నేటి స్మార్ట్ యూజర్స్ కాంటాక్ట్ లెస్ సపోర్ట్ కోరుకుంటున్నారని, ఆ దిశగా తాము ఈ వాట్సాప్ సేవలను ప్రారంభించినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు వి.రమణ్ కుమార్ తెలిపారు. వాట్సాప్‌లో భారీ సంఖ్యలో ఉన్న యూజర్స్‌కు తమ ఈ సేవల ద్వారా చేరువ అవ్వాలనుకుంటున్నట్లు వెల్లడించారు.