Stock Market: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోన్న ద్రవ్యోల్బం.. స్టాక్‌ మార్కెట్‌లో కొనసాగనున్న అస్థిరత..!

స్టాక్‌ మార్కెట్‌లో అస్థిరత అనేది సాధారణం.. గత కొద్ది సంవత్సరాలు స్టాక్‌ మార్కెట్లు రాణిస్తున్నాయి. కానీ 2020లో కరోనా వచ్చిన తర్వాత మార్కెట్లు పడిపోయాయి...

Stock Market: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోన్న ద్రవ్యోల్బం.. స్టాక్‌ మార్కెట్‌లో కొనసాగనున్న అస్థిరత..!
Inflation
Srinivas Chekkilla

|

Jun 16, 2022 | 9:25 AM

స్టాక్‌ మార్కెట్‌లో అస్థిరత అనేది సాధారణం.. గత కొద్ది సంవత్సరాలు స్టాక్‌ మార్కెట్లు రాణిస్తున్నాయి. కానీ 2020లో కరోనా వచ్చిన తర్వాత మార్కెట్లు పడిపోయాయి. కానీ ఆ తర్వాత రాణించాయి. కోవిడ్‌-19 తర్వాత మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. కొత్త గరిష్ఠాలను తాకాయి. కానీ రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన తర్వాత మార్కెట్‌లో అస్థిరత పెరిగింది. 2021 అక్టోబర్‌ 19న బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 62245.43 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 18604.45 చేరుకుంది. కానీ కొద్ది వారాలుగా స్టాక్‌ మార్కెట్‌లో తీవ్ర అస్థిరత కారణంగా 2022 జూన్‌ 15న సెన్సెక్స్‌ 52,541, నిఫ్టీ 15,692కు పడిపోయింది. అటు అంతర్జాతీయంగా కూడా అస్థిరత ఉంది. 2021 నవంబర్‌ 22 52 వారాల గరిష్ఠ స్థాయి 16,212 వద్ద ఉన్న యూఎస్‌ ట్రేడింగ్ ఇండెక్స్ నాస్‌డాక్‌ క్రమంగా పడిపోతూ 2022 మే 20న 11,035తో 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకింది.

2020-2021లో కరోనా కారణంగా మార్కెట్‌లోకి పెద్ద మొత్తం డబ్బును ఇన్‌ఫ్యూస్‌డ్‌ చేయడం ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణమైంది. యూఎస్‌, యూకెలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. భారత్‌లో కన్సూమర్‌ ప్రైస్‌ ద్రవ్యోల్బణం 8 ఏళ్ల గరిష్ఠానికి చేరింది. ఏప్రిల్‌ కన్సూమర్‌ ప్రైస్‌ ద్రవ్యోల్బణం 7.79గా నమోదు అయింది. దీంతో భారతీయ సెంట్రల్‌ బ్యాంక్‌ అయినా రిజర్వ్‌ బ్యాంక్‌ ఇండియా వడ్డీ రేట్లు పెంచక తప్పలేదు. మే 4న ఇటీవలి ఆఫ్-సైకిల్ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం తర్వాత RBI గవర్నర్, శక్తికాంత దాస్ అనిశ్చితపై ఆందోళనలను వ్యక్తం చేశారు. “ద్రవ్యోల్బణం చాలా కాలం పాటు ఈ స్థాయిలలో పెరిగినట్లయితే.. అది అంచనాలను తగ్గించగలదు. స్థిరమైన అధిక ద్రవ్యోల్బణం తప్పనిసరిగా పొదుపులను దెబ్బతీస్తుంది, పెట్టుబడి, పోటీతత్వం, ఉత్పాదక వృద్ధి దెబ్బ తీస్తుంది. ఇది పేద ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించడం ద్వారా వారిపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది” అని దాస్ తన ప్రకటనలో తెలిపారు. దాస్ పాలసీ రెపో రేటులో ఆఫ్-సైకిల్ 40 బేసిస్ పాయింట్ల పెంపును ప్రకటించడంలో ఆశ్చర్యం లేదు.

అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి యూఎస్‌ ఫెడ్‌ భారీగా వడ్డీ రేట్లను పెంచింది. ఇది 22 సంవత్సరాల గరిష్ఠం. వడ్డీ రేట్లు 0.75 శాతం నుంచి 1 శాతానికి పెచింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడానికి పలు దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. 2023 కల్లా ఆర్బీఐ వడ్డీ రేట్లను 80 బేసిస్ పాయింట్ల నుంచి 110 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉంది. అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన ఈఎంఐతో పెట్టుబడిదారులకు పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు ఉండవు. దీంతో స్టాక్‌ మార్కెట్‌లో ఇన్‌ఫ్లో తగ్గుతుంది. అటు రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమై ఈ మధ్య 100 రోజులు పూర్తయింది. ఇది కూడా స్టా్క్‌ మార్కెట్‌లో అస్థిరతకు కారణం కానుంది. ఈ యుద్ధం వల్ల సప్లై చైన్‌లో విఘాతం ఏర్పడింది. దీంతో కమిడిటీ రేట్లు పెరిగాయి. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది.

ఇవి కూడా చదవండి

“కేంద్రంలో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఇవి దీర్ఘకాలంగా బ్యారెల్‌కు $100 కంటే ఎక్కువగా ఉన్నాయి. రష్యన్ ఇంధన ఎగుమతుల్లో మొత్తం లేదా అర్ధవంతమైన భాగాన్ని ప్రపంచవ్యాప్తంగా తొలగించినట్లయితే ఇంధన ధరలు మరింత పెరగవచ్చు. ఇంధన మార్కెట్లు, రష్యా బ్యాంకులకు వ్యతిరేకంగా US, యూరప్ తదుపరి ఆర్థిక ఆంక్షలు, ఆర్థిక వ్యవస్థ, ఇంధన రంగంపై ప్రభావం చూపుతాయి. ప్రపంచ చమురు సరఫరా-డిమాండ్ పరిస్థితి ఇప్పటికే చాలా కఠినంగా ఉంది ”అని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీ తన జూన్ 2022 ఇండియన్ స్ట్రాటజీ నివేదిక తెలిపింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu