Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ola Electric Offers: ముగుస్తోన్న మూడు రోజుల బంపర్ ఆఫర్.. ఈ రోజే ఆఖరు.. త్వరపడండి..

దేశీయ నంబర్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయదారు ఓలా ఎలక్ట్రిక్ ‘భారత్ ఈవీ ఫెస్ట్’ పేరుతో అక్టోబర్ 16న ప్రత్యేకమైన సేల్ ప్రారంభించింది. దీనిలో భాగంగా మూడు రోజుల పాటు అదనపు ఆఫర్లు, తగ్గింపులను అందిస్తోంది. అక్టోబర్ 22 నుంచి 24 మధ్య ‘72 గంటల ఎలక్ట్రిక్ రష్’ పేరుతో దీనిని నిర్వహిస్తోంది. మంగళవారం రాత్రితో ఈ సేల్ ముగియనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Ola Electric Offers: ముగుస్తోన్న మూడు రోజుల బంపర్ ఆఫర్.. ఈ రోజే ఆఖరు.. త్వరపడండి..
Ola Scooters
Follow us
Madhu

|

Updated on: Oct 24, 2023 | 3:05 PM

అన్ని రంగాలలో ఫెస్టివ్ సేల్స్ నడుస్తున్నాయి. ఇదే క్రమంలో ఆటో మొబైల్ రంగంలో కూడా పెద్ద ఎత్తున డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ టూ వీలర్ల కంపెనీలు కూడా పెద్ద ఎత్తున డిస్కౌంట్లు, అదనపు ప్రయోజనాలు అందిస్తున్నాయి. అందులో ప్రధానంగా దేశీయ నంబర్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయదారు ఓలా ఎలక్ట్రిక్ భారత్ ఈవీ ఫెస్ట్ పేరుతో అక్టోబర్ 16న ప్రత్యేకమైన సేల్ ప్రారంభించింది. దీనిలో భాగంగా మూడు రోజుల పాటు అదనపు ఆఫర్లు, తగ్గింపులను అందిస్తోంది. అక్టోబర్ 22 నుంచి 24 మధ్య 72 గంటల ఎలక్ట్రిక్ రష్ పేరుతో దీనిని నిర్వహిస్తోంది. మంగళవారం రాత్రితో ఈ సేల్ ముగియనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

72 గంటల ఎలక్ట్రిక్ రష్..

ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ 72 గంటల ఎలక్ట్రిక్ రష్ లో భాగంగా అదనపు ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తోంది. ఇప్పటికే భారత్ ఈవీ ఫెస్ట్ లో అందిస్తున్న రూ. 24,000 మొత్తం ప్రయోజనాలకు అదనంగా రూ. 2,000 బెనిఫిట్స్ ను ఓలా ఎలక్ట్రిక్ అందిస్తోంది. ఎస్1 ప్రో , ఎస్1 ఎయిర్, ఎస్1 ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై ఇప్పటికే ఉన్న ఉచిత 5 సంవత్సరాల ఎక్స్ టెండెట్ బ్యాటరీ వారంటీతో పాటు ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్ కొనుగోలుపై రూ. 5,000 తగ్గింపును కంపెనీ ప్రకటించింది.

ఇవి కూడా చదవండి
  • భారత్ ఈవీ ఫెస్ట్ క్యాంపెయిన్ లో భాగంగా, ఓలా కంపెనీ “లక్కీ-బూట్ ఆఫర్స్” కింద అనేక రకాల ఆఫర్‌లు, తగ్గింపులను ప్రకటించింది. ఇందులో ఉచిత సరుకులు, తగ్గింపు కూపన్‌లు వంటి ఇతర ఆఫర్‌లతో పాటు ప్రతిరోజూ ఎస్1 ఎక్స్+ గెలుచుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఈ ఆఫర్లు నవరాత్రి, దసరా ముగిసే వరకు అందుబాటులో ఉంటాయని ఓలా ప్రకటించింది. అలాగే, వారి ఫైనాన్స్ ఆఫర్‌లను చూస్తే.. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ. 7,500 వరకు తగ్గింపుతో పాటు జీరో డౌన్ పేమెంట్, నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఇతర ఆఫర్‌లు దీపావళి వరకు వర్తిస్తాయి.
  • ఎస్1 ఎక్స్ (3కేడబ్ల్యూహెచ్), ఎస్1 ఎక్స్ (2కేడబ్ల్యూహెచ్) ప్రీ-బుకింగ్‌లు ఓపెన్ అయ్యాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను రూ. 999 చెల్లించి రిజర్వ్ చేసుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ దాని దాదాపు 1,000 ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లలో ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్‌ను కూడా అందిస్తోంది, ఇందులో కస్టమర్‌లు ఇప్పుడు తమ పాత పెట్రోల్ ద్విచక్ర వాహనాన్ని మార్చుకోవచ్చు.
  • ఈ ఆఫర్ల గురించి ఓలా ఎలక్ట్రిక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ ఓలా భారత్ ఈవీ ఫెస్ట్‌కు వస్తున్న స్పందన చూసి తాము చాలా సంతోషిస్తున్నామన్నారు. ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లలో రద్దీ గణనీయంగా పెరిగిందన్నారు. కొత్తగా ప్రారంభించిన ఎస్1 ఎక్స్ ప్లస్ కోసం చాలా కస్టమర్లు ఆసక్తిని కనబరుస్తున్నారన్నారు. ఇది అత్యాధునిక సాంకేతికతతో పాటు నాణ్యతపై రాజీపడకుండా సరసమైన ధరకు లభిస్తోందని చెప్పారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..