NPCI: గూగుల్ పే, ఫోన్‌పేలకు ఉపశమనం.. మరో రెండు సంవత్సరాలు పోడిగింపు
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ యాప్‌లకు ప్రభుత్వం నుండి పెద్ద ఉపశమనం లభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ యాప్‌లు..
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ యాప్‌లకు ప్రభుత్వం నుండి పెద్ద ఉపశమనం లభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ యాప్‌లు 30 శాతం మార్కెట్ వాల్యూ క్యాప్ అనుసరించడానికి గడువును రెండు సంవత్సరాల పాటు డిసెంబర్ 31, 2024 వరకు పొడిగించింది. వాస్తవానికి యూపీఐ మార్కెట్‌లో కొన్ని పెద్ద కంపెనీల ఆధిపత్యాన్ని నిరోధించడానికి ప్రభుత్వం గరిష్టంగా 30% మార్కెట్ వాటా నియమాన్ని తీసుకొచ్చింది. దీని ప్రకారం.. యూపీఐ సేవలను అందించే కంపెనీ 30% కంటే ఎక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉండకూడదు. ఈ నియమాన్ని పాటించడానికి ఎన్‌పీసీఐ యూపీఐ యాప్‌లకు 31 డిసెంబర్ 2022 వరకు సమయం ఇచ్చింది. అయితే ఇప్పుడు కాలపరిమితిని రెండేళ్లు పొడిగించారు.
ప్రస్తుతం దేశంలో 96% UPI లావాదేవీలు కేవలం మూడు యాప్‌ల ద్వారానే జరుగుతున్నాయి. వీటిలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలు ఉన్నాయి. వీటిలో 80% యూపీఐ లావాదేవీలు ఫోన్ పే, గూగుల్ పే రెండు యాప్‌ల ద్వారానే జరుగుతాయి యూపీఐ ప్రస్తుత వినియోగం దాని భవిష్యత్ వృద్ధి సామర్థ్యం, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని థర్డ్-పార్టీ చెల్లింపు యాప్‌ల (టీఏపీఏ) మార్కెట్ వాల్యూమ్ క్యాప్‌కు అనుగుణంగా ఉండటానికి గడువును 2 సంవత్సరాలు పొడిగించినట్లుము తెలిపింది.
యూపీఐ యాప్‌లలోని తాజా డేటా ప్రకారం.. అక్టోబర్‌లో దాదాపు 47% యూపీఐ లావాదేవీలు ఫోన్‌పే ద్వారా జరిగాయి. గూగుల్ పే యూపీఐ లావాదేవీలలో 34% చూసింది. పేటీఎం వాటా 15%. యూపీఐ మార్కెట్‌లో అమెజాన్ పే, వాట్సాప్ పే సహా అనేక ఇతర యాప్‌లు ఉన్నాయి. కానీ వాటి మార్కెట్ వాటా చాలా తక్కువ. వినియోగదారులు ఈ టాప్-3 కంపెనీలతోనే ఉన్నారు. 2021 జనవరి 1 నుంచి ప్రాసెస్ చేసిన లావాదేవీల పరిమాణాన్ని అంతక ముందు మూడు నెలల్లో ప్రాసెస్ చేసిన వాల్యూమ్ ఆధారంగా లెక్కిస్తారు. అక్టోబర్‌లో యూపీఐ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్ల సంఖ్య 7.3 ట్రిలియన్‌లకు చేరుకుంది. గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే దాదాపు మూడొంతల పెరుగుదల ఉంది. ప్రతి రోజు దాదాపు 26 కోట్లకుపైగా డిజిటల్ పేమెంట్ లావాదేవీలు ఇండియన్ పేమెంట్స్ సిస్టమ్‌ల ద్వారా ప్రాసెస్ అవుతున్నట్లు తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి