Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Digital PAN Card: కేవలం నాలుగైదు రోజుల్లో పాన్‌కార్డు మీ ఇంటికి.. కొత్త సర్వీసు ప్రారంభించిన ఫినో బ్యాంకు

ఆధార్ కార్డ్ లాగానే పాన్ కార్డ్ కూడా ఒక ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఇది బ్యాంకు ఖాతా తెరవడం నుండి చాలా చోట్ల ఉపయోగించేందుకు అవసరం అవుతుంది. పాన్ కార్డు రికార్డు ఆదాయపు పన్ను..

Digital PAN Card: కేవలం నాలుగైదు రోజుల్లో పాన్‌కార్డు మీ ఇంటికి.. కొత్త సర్వీసు ప్రారంభించిన ఫినో బ్యాంకు
Pan Card
Follow us
Subhash Goud

|

Updated on: Dec 02, 2022 | 5:04 PM

ఆధార్ కార్డ్ లాగానే పాన్ కార్డ్ కూడా ఒక ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఇది బ్యాంకు ఖాతా తెరవడం నుండి చాలా చోట్ల ఉపయోగించేందుకు అవసరం అవుతుంది. పాన్ కార్డు రికార్డు ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉంది ఉంటుంది. ఈ పాన్‌ కార్డు ద్వారా ప్రజల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి సమాచారం తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఈ పత్రం లేనట్లయితే మీరు అనేక ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కూడా కోల్పోవచ్చు. బ్యాంకు అకౌంట్‌ను తీయడానికి వీలుండదు.

ఈ నేపథ్యంలో ఫినో పేమెంట్స్ బ్యాంక్ ద్వారా కొత్త సర్వీస్ ప్రారంభించింది. దీని ద్వారా డిజిటల్ పాన్ కార్డ్‌ని ఇప్పుడు కొన్ని గంటల్లో పొందవచ్చు. దీని కోసం ఆధార్ అథెంటికేషన్ మాత్రమే అవసరం. భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పాన్ కార్డ్ జారీ సేవలను విస్తరించేందుకు బ్యాంక్ ప్రొటీన్ ఇగోవ్ టెక్నాలజీస్ (ఎన్‌ఎస్‌డిఎల్ ఇ-గవర్నెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్)తో జతకట్టింది.

12.2 లక్షల మర్చంట్ పాయింట్‌లతో కూడిన ఫినో బ్యాంక్ వర్చువల్ నెట్‌వర్క్ ద్వారా దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రొటీన్ తన పరిధిని విస్తరించడానికి ఈ టై-అప్ అనుమతించబడుతుందని ఫినో బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఫినో బ్యాంక్ సెంటర్ల సహాయంతో పాన్ కార్డ్ ఎలా పొందాలి?

ఆధార్ ప్రామాణీకరణ తర్వాత ఏ యూజర్ అయినా పాన్ కార్డ్ పొందవచ్చు. దీని కోసం మీరు ఏ ప్రత్యేక పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా వినియోగదారులకు డిజిటల్, భౌతిక రూపంలో పాన్ కార్డ్‌ని ఎంచుకునే అవకాశం ఇవ్వబడుతుంది. దరఖాస్తు చేసుకున్న కొద్ది గంటల్లోనే పాన్ కార్డ్ లేదా ఈ-పాన్ డిజిటల్ వెర్షన్ యూజర్ల ఇమెయిల్ ఐడీకి పంపబడుతుందని ఫినో బ్యాంక్ తెలిపింది.

పాన్‌ కార్డు 4 నుండి 5 రోజులలో ఇంటికి వస్తుంది:

e-PAN కార్డ్ భౌతిక పాన్ కార్డ్ వలె చెల్లుబాటు అవుతుంది. ఇది ప్రతిచోటా ఉపయోగించవచ్చు. అయితే మీకు భౌతిక పాన్‌కార్డు కావాలంటే ఫినో బ్యాంక్ 4 నుండి 5 రోజుల్లో మీ ఆధార్ చిరునామాకు పంపబడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి