LIC Pension Scheme: ఎల్‌ఐసీ నుంచి అద్భుతమైన స్కీమ్‌.. నెలనెల పెన్షన్‌ కావాలా? ఇందులో చేరండి

పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయం కోసం అనేక పెన్షన్ పథకాలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆఫ్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ), బ్యాంకులు నిర్వహిస్తాయి..

LIC Pension Scheme: ఎల్‌ఐసీ నుంచి అద్భుతమైన స్కీమ్‌.. నెలనెల పెన్షన్‌ కావాలా? ఇందులో చేరండి
Lic Pension Scheme
Follow us

|

Updated on: Nov 30, 2022 | 7:34 PM

పదవీ విరమణ తర్వాత సాధారణ ఆదాయం కోసం అనేక పెన్షన్ పథకాలు ఉన్నాయి. వీటిని ప్రభుత్వం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆఫ్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ), బ్యాంకులు నిర్వహిస్తాయి. ఈ స్కీమ్‌లలో మీరు ఒక్కసారి డబ్బును పెట్టుబడి పెట్టడం ద్వారా జీవితకాల ఆదాయాన్ని పొందవచ్చు. మీరు కూడా పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందాలనుకుంటే ఎల్‌ఐసీ సరళ్‌ పెన్షన్‌ యోజన పథకాన్ని ఎంచుకోవడం మేలు. ఈ పథకం ఎల్‌ఐసీచే నిర్వహించబడే సాధారణ పెన్షన్ పథకం.

ఎల్‌ఐసీ సరళ్‌ పెన్షన్ పథకం అనేది నాన్-లింక్డ్, సింగిల్ ప్రీమియం, వ్యక్తిగత తక్షణ యాన్యుటీ ప్లాన్. ఈ పెన్షన్ స్కీమ్‌లో ప్రయోజనాలు ఒకే, ఉమ్మడి మార్గాలలో అందించబడతాయి. పెన్షన్ ప్లాన్ కింద మీరు ఒకే ఖాతాను తెరిస్తే మీరు జీవితాంతం పెన్షన్ పొందడం కొనసాగిస్తారు. పాలసీదారు మరణించినప్పుడు, నామినీకి తిరిగి ఇవ్వబడుతుంది.

ఉమ్మడి ఖాతా తెరిచినప్పుడు పాలసీదారు, అతని భార్య పేరు మీద పెన్షన్ పొందవచ్చు. ఇద్దరు సభ్యులలో ఒకరికి ముందుగా పెన్షన్ ఇవ్వబడుతుంది. పాలసీదారు మరణించిన తర్వాత భార్య పెన్షన్ మొత్తాన్ని పొందుతుంది. ఉమ్మడి ఖాతా కింద ఇద్దరూ మరణిస్తే పెన్షన్ మొత్తాన్ని నామినీకి ఇవ్వబడుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ ఈ పథకం కింద ప్రీమియం ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి మాత్రమే పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు జీవితాంతం పెన్షన్ పొందవచ్చు. ఈ పథకం కింద పెన్షన్ మొత్తం పాలసీ ప్రీమియం చెల్లించిన తర్వాత మాత్రమే ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఇది తక్షణ యాన్యుటీ ప్లాన్, అంటే పాలసీ తీసుకున్న వెంటనే పెన్షన్ ఇవ్వబడుతుంది.

ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు ఈ పెన్షన్ పథకం కింద మీరు 40 నుండి 80 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే ఈ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. భార్యాభర్తలతో కలిసి ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. 6 నెలల తర్వాత కూడా ఈ ఖాతాను సరెండర్ చేయవచ్చు. పెన్షన్‌ నెలనెలా కాకుండా త్రైమాసికం, అర్ధ సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన కూడా తీసుకోవచ్చు. మీకు ప్రతి నెల డబ్బు కావాలంటే మీరు కనీసం 1000 రూపాయల పెన్షన్ నుంచి ప్రారంభం అవుతుంది. అదే సమయంలో గరిష్ట పరిమితి లేదు. మీరు మీ డిపాజిట్ మొత్తాన్ని మధ్యలో తిరిగి పొందాలనుకుంటే 5 శాతం తగ్గింపుతో డిపాజిట్ చేసిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది.

సరళ్‌ పెన్షన్‌ యోజనలో పెన్షన్‌ పొందాలంటే నాలుగు ఆప్షన్స్‌ ఉన్నాయి. నెలవారీ, త్రైమాసికం, ఆర్థ సంవత్సరం, వార్షిక పెన్షన్‌ రూపంలో పొందవచ్చు. నెలవారీ పెన్షన్‌ రూ.1000, త్రైమాసిక పెన్షన్‌ కనిష్టంగా రూ.3,000, అర్ద సంవత్సరం పెన్షన్ కనిష్టంగా రూ.6000, వార్షిక పెన్షన్‌ రూ.12,000 పొందే వెసులుబాటు ఉంది. పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఎల్‌ఐసీ కార్యాలయాన్ని సంప్రదిస్తే సరిపోతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..