Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్య బీమా చేసుకోవడం అవసరమా.. కంపెనీలు కట్టే హెల్త్ ఇన్య్సూరెన్స్ తో ఎంత వరకు ప్రయోజనం అంటే..

మారుతున్న జీవనశైలిలో అనేక రకాల కొత్త రకాల జబ్బులు పుట్టుకొస్తున్నాయి. ఎప్పుడు ఏ వ్యాధి బారిన పడతామో తెలియని పరిస్థితి నెలకొంది. ఏదైనా ఆరోగ్య సమస్యల బారిన పడితే ఆసుపత్రుల ఖర్చు తలకుమించిన భారమవుతోంది. సంపాదించిన సంపాదనలో..

ఆరోగ్య బీమా చేసుకోవడం అవసరమా.. కంపెనీలు కట్టే హెల్త్ ఇన్య్సూరెన్స్ తో ఎంత వరకు ప్రయోజనం అంటే..
Health Insurance
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 01, 2022 | 8:00 AM

మారుతున్న జీవనశైలిలో అనేక రకాల కొత్త రకాల జబ్బులు పుట్టుకొస్తున్నాయి. ఎప్పుడు ఏ వ్యాధి బారిన పడతామో తెలియని పరిస్థితి నెలకొంది. ఏదైనా ఆరోగ్య సమస్యల బారిన పడితే ఆసుపత్రుల ఖర్చు తలకుమించిన భారమవుతోంది. సంపాదించిన సంపాదనలో ఎక్కువ భాగం వైద్యానికే పెట్టాల్సి వస్తుంది. ఈక్రమంలో ఎవరైనా వ్యక్తి లేదా కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే వైద్యానికి అయ్యే ఖర్చు భారం కాకుండా కాపాడటానికి అనేక ఆరోగ్య బీమా పథకాలు ఉన్నాయి. దంతాలకు చేసే రూట్ కెనాల్ ట్రీట్ మెంట్ మొదలు గుండె శస్త్ర చికిత్సల వరకు అన్ని రకాల వైద్య సేవలను కవర్ చేసే హెల్త్ ఇన్య్సూరెన్స్ లు ఎన్నో ఉన్నాయి. కేవలం రుగ్మతలకే కాకుండా వాహన ప్రమాదాలకు బీమా ఇచ్చే పాలసీలు ఉన్నాయి. సెక్షన్ 80డీ కింద ఆరోగ్య బీమా వార్షిక ప్రీమియానికి పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. గతంతో పోలిస్తే ప్రజల్లో అవగాహన పెరగడంతో ఆరోగ్య బీమాలు తీసుకుంటున్నవారి శాతం ఇటీవల కాలంలో పెరిగింది. మారుతున్న జీవనశైలి కారణంగా ఆరోగ్య బీమా పథకాలకు డిమాండ్ పెరిగింది. అసలు ఆరోగ్య బీమాకు మూలం చూసుకున్నట్లయితే రెండవ ప్రపంచ యుద్దం తర్వాత అమెరికాలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులు ఇతర కంపెనీలకు వెళ్లకుండా ఆపడానికి.. వారిని ఆకర్షించడానికి ఆరోగ్య బీమాను ఎంచుకున్నారు. ఇటీవల కాలంలో ఉద్యోగాల్లో చేరుతున్న వారు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పిస్తున్న కంపెనీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. హెల్త్ ఇన్య్సూరెన్స్‌ తీసుకుంటే ప్రతి సంవత్సరం వేల రూపాయలు ఖర్చు పెట్టాలనే ఆలోచనలో చాలా మంది ఈ పథకానికి దూరంగా ఉంటారు. అందుకే తమకు ఆరోగ్య బీమాను కల్పించే కంపెనీలకు ప్రిపర్ చేస్తుంటారు. కాని మనం ఎంచుకున్న పాలసీని బట్టి ప్రీమియం ఆధారపడి ఉంటుందనేది గుర్తించుకోవాలి. ఆరోగ్య బీమా వర్తించే పథకాలు ఏమిటో తెలుసుకుందాం

కంపెనీ కల్పించే ఆరోగ్య బీమా

ప్రస్తుతం దేశంలో ఉండే కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులకు ఎంతో కొంత ఆరోగ్య బీమా సౌకర్యం ఉంటుంది. కానీ ఇది ఉద్యోగులందరినీ దృష్టిలో పెట్టుకుని తీసుకున్న పాలసీ కనుక మన అవసరలకు తగినట్టుగా ఉండే అవకాశం తక్కువుగా ఉంటుంది. చాలా కంపెనీలలో వాహన ప్రమాదానికి బీమా సౌకర్యం ఉండదు. అలాగే కేటరాక్ట్ చికిత్స లేదా రూట్ కెనాల్ లాంటివి కంపెనీ బీమా కవరేజ్‌లో ఉండవు. ఇవి కాకుండా, కుటుంబం మొత్తానికి కవరేజ్ ఉండక పోవచ్చు. ఇవన్నీ క్షుణ్ణంగా బేరీజు వేసుకుని తగిన ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం ఎంతైనా అవసరం.

ప్రభుత్వ సదుపాయాలు

కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత పథకాలతో పేద, మధ్య తరగతి ప్రజల వైద్య ఖర్చులు భరిస్తున్నాయి. ఈ పథకాల వల్ల కొంత వరకూ ఉపయోగం ఉన్నా అన్ని వేళలా ఈ పథకాలు మన అవసరాలకు సరిపోకపోవచ్చు. ముందుగా ఈ పథకాలు అల్పాదాయ వర్గాలకు మాత్రమే వర్తిస్తాయి అందరికీ ఈ పథకాలు వర్తించవు. ఒకవేళ ఆదాయం తక్కువగా ఉన్న ఉద్యోగులకు వర్తించినా, అందులో ఎన్నో షరతులు ఉంటాయి., అన్ని రకాల చికిత్సలకు ఈ పథకాల ద్వారా లబ్ది పొందే అవకాశం తక్కువ. మరోవైపు ఈ పథకాల వల్ల లబ్ది పొందటానికి ప్రభుత్వ ఆసుపత్రి లేదా, ప్రభుత్వం గుర్తించిన ఆసుపత్రులకు మాత్రమే వెళ్లాలనే నియమాలు ఉండచ్చు. మనకు అవసరమైన చికిత్స మనకు దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండకపోవచ్చు. అందువల్ల ప్రతీ ఒక్కరు తమ అవసరాలకు తగినట్టుగా ఆరోగ్య బీమా తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

ఆరోగ్యంగా ఉన్నవారికి బీమా అవసరం లేదా..

చాలామంది తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నాను కదా.. బీమా ఎందుకులే అనుకుంటారు. ఆరోగ్యంగా ఉన్న వారికి బీమా అవసరం లేదనే వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది. ఇది సరైన ఆలోచనా ధోరణి కాదు. సహజంగా నలభై లోపు వయసు ఉన్నవారికి వైద్య ఖర్చులు తక్కువగానే ఉంటాయి. కాబట్టి ఆరోగ్య బీమా, జీవిత బీమా అవసరం ఈ సమయంలో తక్కువగానే ఉంటుంది. కానీ, వయసు పెరిగేకొద్దీ ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. ప్రధానంగా మధుమేహం, రక్తపోటు లాంటివి వంశపారపర్యంగా వస్తున్న రుగ్మతలు. వీటి బారిన పడే అవకాశం వయసుతో పాటూ పెరుగుతుంది. అందుకే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆరోగ్య బీమా తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

సింక్ డ్రెయిన్ శుభ్రం చేయడానికి బెస్ట్ క్లీనింగ్ టిప్స్..!
సింక్ డ్రెయిన్ శుభ్రం చేయడానికి బెస్ట్ క్లీనింగ్ టిప్స్..!
ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్.. 2 జట్లతో ఏకంగా 12 మ్యాచ్‌లు
ఐపీఎల్ తర్వాత టీమిండియా షెడ్యూల్.. 2 జట్లతో ఏకంగా 12 మ్యాచ్‌లు
మెట్లు ఎక్కేటప్పుడు కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. నిపుణులు సలహా
మెట్లు ఎక్కేటప్పుడు కీళ్ల నొప్పులు వస్తున్నాయా.. నిపుణులు సలహా
హైస్పీడ్ రైలు.. హైదరాబాద్ నుండి బెంగళూరు కేవలం 2 గంటల్లోనే..!
హైస్పీడ్ రైలు.. హైదరాబాద్ నుండి బెంగళూరు కేవలం 2 గంటల్లోనే..!
అందాలతో మెస్మరైజ్ చేస్తున్న జ్యోతిక..బ్యూటిఫుల్ ఫొటోస్
అందాలతో మెస్మరైజ్ చేస్తున్న జ్యోతిక..బ్యూటిఫుల్ ఫొటోస్
బాహుబలి సినిమాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
బాహుబలి సినిమాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
జపాన్‌ను భయపెడుతున్న అతి భారీ భూకంపం.. సునామీ కూడా..!
జపాన్‌ను భయపెడుతున్న అతి భారీ భూకంపం.. సునామీ కూడా..!
సమ్మర్‌లో మీ శరీరం ఎప్పుడూ చల్లగా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్ ఇవ
సమ్మర్‌లో మీ శరీరం ఎప్పుడూ చల్లగా ఉండాలంటే పాటించాల్సిన టిప్స్ ఇవ
వాహనదారులకు షాక్‌.. ఈ కారు ధర రూ.62 వేలు పెంపు..ఏ మోడల్‌కు ఎంతంటే
వాహనదారులకు షాక్‌.. ఈ కారు ధర రూ.62 వేలు పెంపు..ఏ మోడల్‌కు ఎంతంటే
మరో ఇద్దరు చిన్నారుల గుండెకు ప్రాణం పోసిన మహేష్ బాబు
మరో ఇద్దరు చిన్నారుల గుండెకు ప్రాణం పోసిన మహేష్ బాబు