Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wagon R LXI: సామాన్యులకు మారుతి బంపర్ ఆఫర్.. లక్షన్నరకే వాగన్ ఆర్ కారు.. వివరాలు..

Maruti Suzuki true value - Wagon R LXI: అసలే కరోనా కాలం.. వేధిస్తున్న ఆర్థిక పరమైన పరిస్థితులు.. ఈ క్రమంలో కారు కొనలేకపోతున్న వారికి శుభవార్త అందిస్తోంది.. దేశంలోని అతిపెద్ద

Wagon R LXI: సామాన్యులకు మారుతి బంపర్ ఆఫర్.. లక్షన్నరకే వాగన్ ఆర్ కారు.. వివరాలు..
Wagon R
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 20, 2021 | 6:03 AM

Maruti Suzuki true value – Wagon R LXI: అసలే కరోనా కాలం.. వేధిస్తున్న ఆర్థిక పరమైన పరిస్థితులు.. ఈ క్రమంలో కారు కొనలేకపోతున్న వారికి శుభవార్త అందిస్తోంది.. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి. అతి తక్కువ ధరకే తమ కంపెనీ ద్వారా సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసే సదుపాయాన్ని కల్పిస్తోంది. దీని ద్వారా మీరు అతి తక్కువ ధరకే కారును సొంతం చేసుకోవచ్చు. దీనిలో భాగంగా మారుతి సుజుకి ట్రూ వాల్యూ (Maruti Suzuki true value) ద్వారా సెకెండ్ హ్యాండ్ కార్లను వినియోగదారులకు విక్రయిస్తోంది. దీని ద్వారా ఇప్పటివరకూ 40లక్షల వరకు కార్లను విక్రయించింది.

ఈ కార్లను కొనలనుకున్నవారు టెస్ట్ డ్రైవ్ చేసి డీలర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. అయితే తాజాగా మారుతి సుజుకి లక్షన్నరకే వాగన్ ఆర్ కారును అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ కారు ఆన్ రోడ్ ధర 5 లక్షల రూపాయల వరకు ఉంది. అయితే మారుతి సుజుకి సెకండ్ హ్యాండ్ కార్లకు సంబంధించి మరికొన్ని ఆఫర్లు ఉన్నాయి. వాటిని కూడా ఇప్పుడు చూద్దాం..

1. వాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ: ఇది 2008 మోడల్. వాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐని ట్రూ వాల్యూలో విక్రయిస్తోంది. ఈ కారును పెట్రోల్ ఇంజిన్‌ కలిగి ఉంది. దీని ధర రూ. 1.4 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ కారు 50,541 కిలోమీటర్లు మాత్రమే నడిచింది.

2. ట్రూ వాల్యూలో మరో కారు కూడా ఉంది. 2008 వాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ మోడల్‌ను ట్రూ వాల్యూలో విక్రయిస్తోంది. పెట్రోల్‌తో నడిచే ఈ కారును 1,45,000 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఇప్పటివరకూ ఈ కారు 1,10,622 కిలోమీటర్లు ప్రయాణించింది.

3. 2008 మోడల్‌కు చెందిన వాగన్ ఆర్ వీఎక్స్ఐ పెట్రోల్ ఇంజిన్‌ కారును కూడా సుజుకి అందుబాటులో ఉంచింది. మీరు ఈ కారును రూ .1,45,000 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ఇప్పటి వరకూ 70,282 కి.మీ. నడిచింది.

మరిన్ని వివరాల కోసం ఈ లింకును క్లిక్ చేయండి.. Maruti Suzuki true value

Also Read:

Post Office: పోస్టాఫీస్ అదిరిపోయే సేవింగ్స్ స్కీం.. ఈ పధకంలో చేరితే రూ. 8 లక్షలు మీ సొంతం..!

KIA aid : ఆంధ్రప్రదేశ్‌ విపత్తు నిర్వహణ సంస్ధకి రూ.5 కోట్లు అందించిన కియా ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌