Aadhaar: ఇప్పుడు తెలుగులోనూ ఆధార్ కార్డ్.. ఆన్‌లైన్‌లో మీ భాషలో మీ కార్డ్ వివరాలు ఇలా మార్చుకోవచ్చు..

ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన పత్రంగా మారింది. ఒకరకంగా ఇది మనకు ఒక గుర్తింపు కార్డు లాంటిది. ఏదైనా ఆర్థిక లావాదేవీకి, ప్రభుత్వ పథకాలను పొందడానికి కూడా ఆధార్ కార్డు అవసరం.

Aadhaar: ఇప్పుడు తెలుగులోనూ ఆధార్ కార్డ్.. ఆన్‌లైన్‌లో మీ భాషలో మీ కార్డ్ వివరాలు ఇలా మార్చుకోవచ్చు..
Aadhar Card In Regional Launguage
Follow us
KVD Varma

|

Updated on: Sep 28, 2021 | 4:22 PM

Aadhaar: ప్రతి భారతీయ పౌరుడికి ఆధార్ కార్డు ఒక ముఖ్యమైన పత్రంగా మారింది. ఒకరకంగా ఇది మనకు ఒక గుర్తింపు కార్డు లాంటిది. ఏదైనా ఆర్థిక లావాదేవీకి, ప్రభుత్వ పథకాలను పొందడానికి కూడా ఆధార్ కార్డు అవసరం. ఇది వ్యక్తి చిరునామాతో పాటు బయోమెట్రిక్ సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఇప్పటివరకూ ఆదార్ కార్డు పై సమాచారం ఇంగ్లీషులోనే ఉంటోంది. ఇప్పుడు ఈ విధానంలో మార్పులు తీసుకువచ్చింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI). తన తాజా అప్‌డేట్‌లో అనేక ప్రాంతీయ భాషలలో ఆధార్ జనరేషన్ సదుపాయాన్ని అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇప్పుడు ఆధార్ కార్డు జారీ చేసే సంస్థ ద్వారా ప్రాంతీయ భాషలో కార్డు జారీ అవుతుంది.

1 నుంచి 3 వారాలు..

ప్రస్తుత అప్‌డేట్ తర్వాత మీరు పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, మరాఠీ, ఒరియా, కన్నడ భాషలలో ఆధార్ కార్డును పొందవచ్చు. ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డులోని భాషను మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటే, దాని కోసం మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మీ భాషను బట్టి భాష అప్‌డేట్ కావడానికి 1 నుంచి 3 వారాలు పడుతుంది.

స్థానిక భాషను ఆధార్‌లో అప్‌డేట్ చేసుకోండి ఇలా..

ఆధార్‌లో మీ స్థానిక భాషను మార్చడానికి మీరు ఆధార్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లవచ్చు. లేదా దాని కోసం మీరు ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలంటే ఇలా చేయండి..

  • ముందుగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.
  • అప్‌డేట్ ఆధార్ హోమ్‌పేజీ కనిపిస్తుంది. ఇందులో అప్‌డేట్ డెమోగ్రాఫిక్ డేటా ఆన్‌లైన్‌పై క్లిక్ చేయండి.
  • తర్వాత 12 అంకెల ప్రత్యేక ఆధార్ నంబర్, క్యాప్చా సెక్యూరిటీ కోడ్‌ని నమోదు చేయండి. వివరాలను పూరించిన తర్వాత, సెండ్ వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP) పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు OTP ని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి.
  • లాగిన్ అయిన తర్వాత, అప్‌డేట్ డెమోగ్రాఫిక్ డేటా బటన్‌ని నొక్కండి.
  • ఇక్కడ మీరు మీకు ఇష్టమైన ప్రాంతీయ భాషను ఎంచుకుంటారు.
  • పాపప్‌లో జనాభాను అప్‌డేట్ చేయండి. సబ్మిట్ చేయండి. స్థానిక భాషలో మీ పేరు సరిగ్గా ఉచ్చరించబడిందని నిర్ధారించుకోండి.
  • అదేవిధంగా అప్లికేషన్ సమర్పించే ముందు మొత్తం సమాచారాన్ని సవరించండి. అన్ని వివరాలను ప్రివ్యూలో సరిచూసుకోండి.
  • మీ నమోదిత మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దాన్ని నమోదు చేయండి. ఆ తర్వాత రుసుము రూ.50 డిపాజిట్ చేయండి. చెల్లింపు పూర్తయిన తర్వాత, మీ ఆధార్‌లోని కొత్త భాషా నవీకరణ అభ్యర్థన విజయవంతంగా పూర్తి అవుతుంది.

Also Read: Viral News: ‘ఎనర్జీ డ్రింక్స్’ తాగిన కొద్ది గంటల్లోనే స్పృహ తప్పింది.. తీరా స్కాన్ చేసి చూడగా గట్టి షాక్!

Punjab Politics: ఢిల్లీకి పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్.. బీజేపీతో జట్టు కట్టడానికేనా?