Credit score: క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా నో ప్రోబ్లమ్.. ఇలా చేస్తే రుణం పొందడం చాలా ఈజీ..!
ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక సమయంలో రుణం తీసుకునే అవసరం వస్తుంది. అనుకోకుండా వచ్చిన ఖర్చులు, వైద్య చికిత్సలు, పిల్లలు చదువులు, స్థలం కొనుగోలు చేయడం.. ఇలా అనేక కారణాలు దీని వెనుక ఉండవచ్చు. సాధారణంగా రుణాల కోసం మొదటగా బ్యాంకులను సంప్రదిస్తాం. బ్యాంకు అధికారులు ముందుగా మన క్రెడిట్ స్కోర్ ను పరిశీలిస్తారు. అది మెరుగ్గా ఉంటేనే రుణం మంజూరు చేస్తారు. లేకపోతే మన రుణ దరఖాస్తును తిరస్కరిస్తారు. అయితే తక్కువ స్కోర్ ఉండి, రుణం పొందలేనివారు కూడా వేరే మార్గాల్లో రుణం పొందే అవకాశం ఉంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రెడిట్ స్కోర్ 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. మన ఆర్థిక లావాదేవీలు అంటే గతంలో తీసుకున్న రుణాలను చెల్లించిన విధానం, వాయిదాలు కట్టిన పద్ధతిని బట్టి స్కోర్ నిర్ణయిస్తారు. క్రెడిట్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉంటే చాలా మంచిదిగా లెక్కిస్తారు. 600 కంటే తక్కువ ఉండే చెత్త స్కోర్ అని అర్థం. అయితే అత్యవసర సమయంలో తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారు కూడా ఈ కింద తెలిపిన విధానాలను పాటిస్తే ప్రయోజనం కలుగుతుంది.
క్రెడిట్ స్కోర్ ను తెలుసుకోండి
రుణం కోసం దరఖాస్తు చేయడానికి ముందుగానే క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. దాని వల్ల మీ ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి, రుణం ఆమోదంలో సవాళ్లను అధిగమించడానికి వీలుంటుంది.
రుణదాతలు
దేశంలోని కొన్ని ఆర్థిక సంస్థలు పేలవమైన క్రెడిట్ చరిత్ర కలిగిన వ్యక్తులకు రుణాలు అందజేస్తాయి. అయితే వడ్డీ రేటు కొంచెం అధికంగా ఉండవచ్చు. సంప్రదాయ బ్యాంకులతో పోల్చితే క్రెడిట్ స్కోర్ విషయంలో కొంచెం ఉదారంగా ఉంటారు.
సెక్యూర్డ్ లోన్
క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉండే సెక్యూర్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోండి. ఈ సందర్బంలో కారు, స్థిరాస్తి, ఫిక్స్ డ్ డిపాజిట్ వంటి వాటిని తాకట్టు పెట్టవచ్చు. అయితే రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైతే, తాకట్టు పెట్టిన ఆస్తి కోల్పోయే ప్రమాదం ఉంది.
గ్యారెంటర్, సహ దరఖాస్తుదారుడు
మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నసహ దరఖాస్తుదారుడు, లేదా గ్యారెంటర్ తో రుణం ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
క్రెడిట్ స్కోర్ ను మెరుగుపర్చుకోవడం
క్రెడిట్ స్కోర్ ను మెరుగుపర్చుకోవడం అత్యుత్తమ విధానాలలో ఒకటి. దాని వల్ల భవిష్యత్తులో సులువుగా రుణం పొందే అవకాశం కలుగుతుంది.
స్థిరమైన ఆదాయ రుజువు
లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు స్థిరమైన ఆదాయ రుజువులు సమర్పించాలి. మీరు రుణవాయిదాల (ఈఎంఐ)ను సక్రమంగా చెల్లిస్తారనే నమ్మకం బ్యాంకులకు వాటి వల్లే కలుగుతుంది. దాని కోసం జీతం స్లిప్పులు, బ్యాంక్ స్టేట్ మెంట్లు, ఆదాయపు పన్నురిటర్న్స్ సమర్పించాలి.
స్వల్పకాలిక రుణాలు
స్వల్పకాలిక రుణాలతో క్రెడిట్ స్కోర్ ను మెరుగుపర్చుకోవచ్చు. వీటి వల్ల రుణదాతలకు పెద్దగా న ష్టం ఉండదు. వీటిని తీసుకుని సక్రమంగా చెల్లించడం వల్ల క్రెడిట్ స్కోర్ బాగుపడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి