Gold Rates: బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. 10 రోజుల్లో ఎంత తగ్గిందో తెలుసా..?
బంగారం, వెండి ధరలు ఈ వారంలో పడిపోయాయి. దీంతో జనవరి 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వారంలో ఎలా ఉంటాయనేది హాట్‌టాపిక్‌గా మారింది. గత 10 రోజుల్లో గోల్డ్ రేట్లు భారీగా పడిపోయాయి. ఒకేసారి భారీ హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఎంతలా అంటే..?

పసడి ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ధరల్లో రోజురోజుకి మార్పులు జరుగుతున్నాయి. గత 10 రోజులుగా బంగారం, వెండి ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్, ఇరాన్-యూఎస్ మధ్య భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నుంచి వచ్చిన సంకేతాలు పెట్టుబడిదారులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. గత వారం రోజులుగా గోల్డ్ రేట్లు తగ్గగా.. ఫిబ్రవరి 9నుంచి ప్రారంభమయ్యే వారంలో పసిడి ధరలు ఎలా ఉంటాయనే దానిపై అనేక అంచనాలు మార్కెట్ వర్గాల నుంచి వెలువడుతున్నాయి. ఒకసారి ఆ విషయాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
పెరిగే అవకాశం ఉందా..?
దీర్ఘకాలిక భౌగోళిక రాజకీయ అనిశ్చితి, వాణిజ్య సుంకాల ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో రాబోయే రోజుల్లో పసిడి ధరలను ప్రభావితం చేసే అవకాశముంది. ఈ పరిణామాల ప్రకారం గోల్డ్, సిల్వర్ రేట్లు కొంతపైకి కదిరే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత 10 రోజుల్లో పదునైన దిద్దిబాటు జరిగిన క్రమంలో.. రాబోయే వారంలో పెరుగుతాయని విశ్లేషిస్తున్నారు.
పది రోజుల్లో రూ.22 వేలు డౌన్
పది రోజుల్లో బంగారం ధర ఏకంగా రూ.22,250 తగ్గింది. జనవరి 29న 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాముకు రూ.17,885గా ఉంది. ఫిబ్రవరి 8న గ్రాముకు రూ.15,660 వద్ద కొనసాగుతోంది. పది రోజుల్లో గ్రాముకు రూ.2225 తగ్గగా.. 10 గ్రాములపై రూ.22,250 తగ్గిందని చెప్పవచ్చు. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ఫిబ్రవరి 8న గ్రాముకు రూ.14,355గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.11,745 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధర కిలో రూ.2.85 లక్షల వద్ద ప్రస్తుతం ఉంది. జనవరిలో రూ.4 లక్షలకుపైగా చేరుకోగా.. ఇప్పుడు భారీగా తగ్గింది. అటు ఎంసీఎక్స్‌లో ఏప్రిల్ గడుపుతో ముగిసే ఫ్యూచర్స్ 0.26 శాతం క్షీణించి 10 గ్రాములకు రూ.1,55,050 వద్ద ముగిసింది. మార్చి గుడువుతో ముగిసే సిల్వర్ ప్యూచర్స్ 1.16 శాతం తగ్గి కిలో రూ.2,49,499 వద్ద ముగిసింది.
ఈ వారంలో “బుల్లిష్”
గత 10 రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గడంతో రాబోయే వారంలో హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశముంది. ఈ వారంలో బుల్లిష్‌గా కొనసాగుతాయని అంటున్నారు. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, ఈటీఎఫ్ పెట్టుబడులు పెరుగుతున్న క్రమంలో దీర్ఘకాలిక బలమైన డిమాండ్‌ను సూచిస్తున్నాయి. ఇక భౌగోళిక రాకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు కొనసాగుతున్న క్రమంలో గోల్డ్ ధరలు రాబోయే వారంలో పెరుగుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి రాబోయే వారంలో గోల్డ్ రేట్లు ఎలా ఉంటాయి..? కొనుగోలుదారులకు షాక్ ఇస్తాయా? అనేది వేచి చూడాలి.
