AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Iphone 16E: భారత మార్కెట్‌లోకి ఐఫోన్-16 నయా వెర్షన్.. వారే అసలు టార్గెట్..!

ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌కు ఉన్న క్రేజ్ మరే ఇతర స్మార్ట్ ఫోన్‌కు ఉండదు. ముఖ్యంగా ఐఫోన్ ఉండడం అనేది ఓ స్టేటస్ సింబల్‌లా భావించే వారు చాలా మంది ఉంటారు. ఎగువ మధ్యతరగతి ప్రజలు ఐఫోన్ వాడకాన్ని అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో మధ్యతరగతి ప్రజలను కూడా టార్గెట్ చేస్తూ ఐఫోన్ 16ఈ వెర్షన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేశారు. ఈ నేపథ్యంలో ఐఫోన్ -16ఈ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Iphone 16E: భారత మార్కెట్‌లోకి ఐఫోన్-16 నయా వెర్షన్.. వారే అసలు టార్గెట్..!
Iphone 16e
Nikhil
| Edited By: |

Updated on: Feb 20, 2025 | 8:10 PM

Share

భారతదేశంలో మధ్యతరగతి ప్రజలే టార్గెట్‌గా యాపిల్ కంపెనీ 16ఈను లాంచ్ చేసింది. అయితే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఐఫోన్-ఎస్ఈ వెర్షన్‌ సేల్స్‌ను సైలెంట్‌గా పక్కన పెట్టింది. ఐఫోన్ 16 సిరీస్‌ను మరింత బడ్జెట్ ఫ్రెండ్లీ ఎంపికను అందించే లక్ష్యంతో ఈ కొత్త మోడల్‌ను లాంచ్ చేసింది. ఐఫోన్ 16ఈ బేస్ వేరియంట్ ధర సుమారు రూ. 49,500 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నా భారతదేశంలో కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్ 16ఈ మోడల్ ధర రూ. 59,900 ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్త ఐఫోన్ 16ఈ కోసం ప్రీ-ఆర్డర్‌లు ఫిబ్రవరి 21న ప్రారంభమవుతాయి. అలాగే ఈ ఫోన్ డెలివరీలు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభం అవుతాయి. 

ఐఫోన్ 16ఈ 6.1 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈ ఫోన్‌లో వచ్చే యాక్షన్ బటన్ ద్వారా వినియోగదారులు కెమెరాను ప్రారంభించవచ్చు. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్ 16ఈ యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌తో అమర్చింది. ఈ ఫోన్ కూడా యాపిల్ ఏ18 చిప్ ద్వారా ఆధారంగా పని చేస్తుంది. ఏ18 చిప్ సెట్ సిక్స్ సీపీయూతో వస్తుంది. ఆపిల్ ఐఫోన్ 11కి శక్తినిచ్చిన ఏ13 బయోనిక్ చిప్ కంటే ఏ-18 చిప్ 80 శాతం వరకు వేగంగా పని చేస్తుంది. జీపీయూతో పాటు మెషిన్ లెర్నింగ్ పనులను మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి రూపొందించబడిన 16 కోర్ న్యూరల్ ఇంజిన్ ఈ ఫోన్ ప్రత్యేకత. ఐఫోన్ 16ఈ యాపిల్ ఇంటెలిజెన్స్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఐఫోన్ 16ఈ సింగిల్ 48 ఎంపీ ఫ్యూజన్ బ్యాక్ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్ కెమెరా సిస్టమ్ 2ఎక్స్ టెలిఫోటో జూమ్ ఎంపికను అందిస్తుంది. 

డిఫాల్ట్‌గా ఈ ఫోన్ 24 ఎంపీ ఫోటోలను తీసుకుంటుంది కానీ అధిక-రిజల్యూషన్ షాట్‌ల కోసం 48 ఎంపీ మోడ్‌కి మార్చవచ్చు. వివిధ లైటింగ్ పరిస్థితులలో మెరుగైన ఫోటో నాణ్యత కోసం కెమెరా సిస్టమ్ పోర్ట్రెయిట్ మోడ్, నైట్ మోడ్, హెచ్‌డీఆర్‌కు మద్దతునిస్తుంది. ఈ ఫోన్ ఆటోఫోకస్‌తో కూడిన 12 ఎంపీ ట్రూ డెప్త్ కెమెరాను కలిగి ఉంది. 4కే వీడియో రికార్డింగ్‌తో పాటు డాల్బీ విజన్‌కు మద్దతు ఇస్తుంది. ఐఫోన్ 16ఈ 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే ఈ ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. మెసేజెస్ వయా శాటిలైట్, ఎమర్జెన్సీ ఎస్ఓఎస్ వంటి ఉపగ్రహ కనెక్టివిటీతో వస్తుందని వివరిస్తున్నారు. ఈ ఫోన్‌లో క్రాష్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంది. ఈ అత్యవసర ఫీచర్ కేవలం యూఎస్ మార్కెట్‌కు మాత్రమే కాకుండా భారతీయులకు కూడా అందుబాటులో ఉన్నాయో? లేదో? తెలియాల్సి ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి