Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honda Elevate SUV: స్పోర్టీ లుక్‌లో హోండా కొత్త ఎస్‌యూవీ కారు.. బ్రాండ్ నేమ్‌ను ‘ఎలివేట్’ చేసేలా ఫీచర్స్..

జపాన్ కు చెందిన కార్ల తయారీ సంస్థ హోండా మిడ్ సైజ్ ఎస్‌యూవీల్లో ఎట్టకేలకు తన మొదటి కారును తీసుకొచ్చింది. దీని ధర రూ. 10.99 లక్షలు ఎక్స్ షోరూంగా ఉంది. ఈ కారులో సిటీ సెడాన్ లోని1.5 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 6 స్పీడ్ మాన్యూల్ లేదా 7 స్పీడ్ సీవీటీ ఉంటాయి. ఈ ఇంజిన్ 121 హెచ్పీ, 145 ఎన్ఎం గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈకారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Honda Elevate SUV: స్పోర్టీ లుక్‌లో హోండా కొత్త ఎస్‌యూవీ కారు.. బ్రాండ్ నేమ్‌ను ‘ఎలివేట్’ చేసేలా ఫీచర్స్..
Honda Elevate Suv
Follow us
Madhu

|

Updated on: Sep 05, 2023 | 4:30 PM

సంప్రదాయ కార్లకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ సొంత కారు కావాలని కోరుకుంటున్నారు. అందులోనూ సెమీ ఎస్‌యూవీ సైజ్ లో ఉండే వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఈ క్రమంలో మన దేశంలో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఎలివేట్ ఎస్‌యూవీ కారును హోండా కార్స్ ఇండియా ఆవిష్కరించింది. దీంతో జపాన్ కు చెందిన ఈ కార్ల తయారీ సంస్థ మిడ్ సైజ్ ఎస్‌యూవీల్లో ఎట్టకేలకు తన మొదటి కారును తీసుకొచ్చినట్లు అయ్యింది. దీని ధర రూ. 10.99 లక్షలు ఎక్స్ షోరూంగా ఉంటుంది. ఈ హోండా ఎలివేట్ కారులో సిటీ సెడాన్ లోని1.5 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. 6 స్పీడ్ మాన్యూల్ లేదా 7 స్పీడ్ సీవీటీ ఉంటాయి. ఈ ఇంజిన్ 121 హెచ్పీ, 145 ఎన్ఎం గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈకారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

హోండా ఎలివేట్ ఎస్‌యూవీ డిజైన్ ఇది..

ఈ కొత్త కారు ఎక్స్ టీరియర్ డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది. ముందువైపు పెద్ద గ్రిల్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. మొత్తం మీది దీని లుక్ స్పోర్టీగా ఉంటుంది. 17 అంగుళాల డైమండ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. ఇంటీరియ్ విషయానికి వస్తే ఈ కారులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. ఇన్ ఫో టైన్ మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, 7 అంగుళాల సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. సింగిల్ పేన్ సన్ రూఫ్ కూడా అందుబాటులో ఉంటుంది.

సేఫ్టీ ఫీచర్లు ఇలా..

కారులో సేఫ్టీ ఫీచర్లను చూస్తే దీనిలో అడాస్ స్యూట్ ఉంటుంది. దీనిలో లేన్ వాచ్ కెమెరా, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టేబిలిట్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, వెనుకవైపు కార్ పార్కింగ్ సెన్సార్స్ వంటి అనేక రకాల టాప్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ధర లభ్యత..

ఈ హోండా ఎలివేట్ ఎస్‌యూవీ కారు ఫోయినిక్స్ ఆరెంజ్ పెరల్, ఆబ్సిడియన్ బ్లూ పెరల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినమ్ వైట్ పెరల్, గ్లోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, లూనార్ సిల్వర్ మెటాలిక్, మెటరాయిడ్ గ్రే మెటాలిక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ కారు దేశంలోని అందరూ డీలర్ షిప్ ల వద్ద అందుబాటులో ఉంది. దీని ధరలు రూ. 10.99లక్ష లనుంచి ప్రారంభమై రూ. 15.99లక్షల వరకూ ఉంటుంది. మొత్తం నాలుగు వేరింయట్లలో ఇది లభ్యమవుతోంది. హోండా ఎలివేట్ ఎస్వీ, వీ, వీఎక్స్, జెడ్స్ పేరిట ఇవి ఉన్నాయి. వీటిల్లో మళ్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్, అలాగే సీవీటీ ఆప్షన్ల ఉంటాయి. వీటి ధరల్లో కూడా వ్యత్యాసం ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..