EPFO: మీ పీఎఫ్ ఖాతాలో వివరాలు తప్పుగా ఉన్నాయా? చాలా సులభంగా మీరే సరిచేసుకోవచ్చు.. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి చాలు..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) కీలకమైన అప్ డేట్ ప్రకటించింది. కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈపీఎఫ్ ఖాతాకు సంబంధించి ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలనుకొనే వారు ఈ కొత్త సూచనలు తప్పక పాటించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం ద్వారా మీ పీఎఫ్ ఖాతా వివరాలను అప్ డేట్ చేయడం చాలా సులభం. దీని మీరు ఎప్పుడైనా క్లెయిమ్లు చేసేటప్పుడు రిజెక్షన్లు లేకుండా ఉంటుంది.

అత్యవసర సందర్భాల్లో పీఎఫ్ ఖాతాలోని నగదును విత్ డ్రా చేస్తుంటారు. అయితే ఇటీవల ఎక్కువ శాతం ఆ దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. అలాగే మీ వివరాలతో బయటి వ్యక్తులు కూడా ఖాతాలోని నగదు తీస్తే మోసాలకు కూడా పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) కీలకమైన అప్ డేట్ ప్రకటించింది. కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఈపీఎఫ్ ఖాతాకు సంబంధించి ఏమైనా మార్పులు, చేర్పులు చేయాలనుకొనే వారు ఈ కొత్త సూచనలు తప్పక పాటించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానం ద్వారా మీ పీఎఫ్ ఖాతా వివరాలను అప్ డేట్ చేయడం చాలా సులభం. దీని మీరు ఎప్పుడైనా క్లెయిమ్లు చేసేటప్పుడు రిజెక్షన్లు లేకుండా ఉంటుంది. అలాగే బయటి వ్యక్తులు ఎటువంటి మోసాలకు పాల్పడకుండా నివారించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఏం మార్చుకోవచ్చు..
అవకాశం ఉన్నంత వరకూ ప్రతి ఒక్క పీఎఫ్ ఖాతాదారుడు అకౌంట్లోని వివరాలను సరిచూసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచిస్తోంది. అందుకోసం ప్రత్యేకమైన సర్క్యూలర్ విడుదల చేసింది. పీఎఫ్ ఖాతాలోని ప్రొఫైల్ లోకి వెళ్లి పదకొండు అంశాలను అప్ డేట్ చేసుకోవచ్చని సూచించింది. ఈపీఎఫ్ఓ సర్క్యులర్ ప్రకారం, ఈపీఎఫ్ ఖాతాదారుడు ప్రొఫైల్లోని పేరు, లింగం, పుట్టిన తేదీ, తండ్రి పేరు, రిలేషన్ షిప్, వైవాహిక స్థితి, సంస్థలో చేరిన తేది, సంస్థను వదిలివేయడానికి కారణం, సంస్థ నుంచి బయటకొచ్చిన తేది, జాతీయత, ఆధార్ నంబర్ వంటి అంశాలను అప్ డేట్ చేయచ్చు. అయితే దీనికి అవసరమైన డాక్యుమెంట్ ప్రూఫ్ లను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలంటే..
ఈపీఎఫ్ వెబ్ పోర్టల్ లోకి లాగిన్ అయ్యి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు చేసిన మార్పులను మీ సంస్థ యజమాని ధ్రువీకరించవలసి ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
- ముందుగా మెంబర్ సేవా పోర్టల్ లోకి వెళ్లాలి. దానిలో యూనివర్సల్ అకౌంట్ నంబర్(యూఏఎన్), పాస్ వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- ఆపై ‘జాయింట్ డిక్లరేషన్ (జేడీ)’ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ఆధార్ కు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌కు వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసిన తర్వాత జాయింట్ డిక్లరేషన్ ఫారమ్ మీకు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ఆ తర్వాత, నిర్దేశిత జాబితాలో పేర్కొన్న విధంగా సపోర్టింగ్ డాక్యుమెంట్‌లతో పాటు అవసరమైన వివరాలను మీరు సమర్పించాలి.
- అనంతరం అది మీ సంస్థ యజమాని ధ్రువీకరిస్తే, మీ ఖాతా ప్రోఫైల్ లో అప్ డేట్ అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..